వినమరుగైన

మైదానం - చలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతన్ని కాపాడిన ఆమెను చంపడానికి చేతులు రాక తనే పొడుచుకుంటాడు. ఒక సందర్భంలో రాజేశ్వరికి డెస్టిమోనా గుర్తు వచ్చిందంటాడు చలం.
మీరాకు రాజేశ్వరిపట్ల ప్రేమ- అమర్ అంటే ద్వేషం లేదు. కానీ తను ఆమెకి దగ్గరవడం అతనికి నచ్చదని తెలుసు. అందుకే అక్కడా ఇక్కడా పొంచి ఆమెను చూసుకుంటాడు. ఆమె కోసం హత్యానేరాన్ని తనమీద వేసుకోచూస్తాడు.
రాజేశ్వరికి ఆ ఇద్దర్నీ కలపడం పెద్ద సమస్య అయింది. ముగ్గురం స్నేహంగా వుండలేమా అని ప్రయత్నించింది. ఒక స్ర్తి ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించడం సంభవమా అనేది చాలా సహజమైన, సామాన్యమైన ప్రశ్న. దానికి రాజేశ్వరి సమాధానం:
‘‘ఇట్లా ప్రేమ మారడమూ- ప్రేమలో సందేహాలు రావడమూ- ఒకేసారి ఇద్దరిమీద ప్రేమ ఉన్నట్లు తోచడమూ- ఆ ప్రేమ చెరొకరిమీదా చెరొక విధంగా వేరు కారణాలవల్ల కలిగినట్లుండటమూ - ఇదంతా మీవంటివారు వొప్పుకోరు. వొళ్లు కొవ్వెక్కితే అట్లానే వుంటుందిలే. పశుకామం అంటారు- అట్లా ఇద్దరిమీద వుండటం అసంభవమని- తమ నీతి శాసనాలలో సృష్టినే ప్రపంచంలోని హృదయానే్న పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు వ్రాస్తారు కొందరు పుస్తకాలలో- మీవి గాలి మాటలు, మావి రక్తపు అనుభవాలు’’-
‘‘నువ్వు సృష్టించుకున్న అగ్నిలో దగ్ధమవడానికి నువ్వెప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆహుతి కాకుండా నూతన మానవుడివి కాలేవు- అంటాడు తత్వవేత్త నీష్. ఆ మాట రాజేశ్వరికి, ఆమెను సృష్టించిన చలానికీ కూడా వర్తిస్తుంది.
మైదానం నవలలో సామాజిక చిత్రణ లేదని ఒక విమర్శ. సమాజంలో స్ర్తిల పరిస్థితి మైదానంలో లేకపోవడం ఏమిటి? రాజేశ్వరి అమర్‌తో వచ్చినపుడు చీకటి గది కిటికీ తలుపు తెరచినట్లు అనుకోలేదా?
ఆ చీకటిగది గురించి ఆమె స్పష్టంగా అనేక చోట్ల చెప్పనే చెప్పింది. అయితే ఆర్థికవాదం గురించి చలం చర్చించకపోయి వుండవచ్చు. చలం ముఖ్యంగాస్ర్తిల దుర్భర పరిస్థితిని గురించి ఆలోచించాడు. ఆ పరిస్థితులు అతన్ని వికారపెట్టాయి- ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకున్నాడు. మైదానం నవల వచ్చింది. ఈనాడు స్ర్తివాదులు పట్టించుకుంటున్న ‘స్ర్తిల లైంగికత’ గురించి అప్పుడే పట్టించుకున్నాడు. అనేక విమర్శలకి గురైనప్పటికి చలంకి రిప్రజెంటివ్‌గా నిలిచే రచన మైదానం.

-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.సత్యవతి