వినమరుగైన

నారాయణరావు -అడివి బాపిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంట్లో రక్తము లేక పాలిపోయి అదో మంచి మేలిమి బంగారు రంగని చెప్పుకుంటూ నాల్గడుగులు నడవలేని మన జమీందారు దద్దమ్మ కాడు’’ అని జమీందారు చేతనే పలికిస్తారు బాపిరాజు.
ఇంగ్లీషు చదివి పై ఉద్యోగాలు చెయ్యడం ఆనాడు కొత్తగా ఏర్పడ్డ మార్గం అగ్రవర్ణాలకు. ఈ నలలో రామచంద్రరావు ఇంట్లో చెప్పకుండా పై చదువులకు అమెరికా వెళతాడు. దీనిలో 1935 ప్రాంతంలో మదరాసులో తెలుగువారి జీవితాలు వర్ణింపబడ్డాయి. స్ర్తిలో వ్యక్తిత్వం తాలూకు, స్పృహను సామాజిక దురన్యాయాన్నీ ప్రతిఘటించే గుండె దిటవునూ ‘చలం’ నవలలాగా, దీనిలో అక్కడక్కడ స్పృశించబడింది. భార్యకు భర్తయే దైవస్వరూపుడనే ప్రతివాక్యం బాపిరాజుగారి రుూ నవలలో రకరకాలుగా ధ్వనించింది. కుటుంబ జీవనంలో సుఖ శాంతులు విలసిల్లడానికి, స్ర్తి విద్యావంతురాలు కావడానికి సంబంధముందా?
నారాయణరావు నవలలో పరమేశ్వరమూర్తి తన భార్యకు తననర్థం చేసుకోగలిగే విజ్ఞత, సంస్కారము లేవని కుమిలిపోతాడు. విద్యావంతురాలయిన రోహిణిని ప్రేమించి ధర్మంకాదని దూరంగా ఉండిపోతాడు. బాపిరాజు గారిలో ఒక సమన్వయ దృష్టి వుంది. ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూనే ఆధునిక నాగరికతలోని ఉత్తమ సంస్కరణలను ఆయన ఆదరించారు.
కొన్ని కొన్ని సందర్భాలలో స్ర్తిలే తమ అర్థంలేని అహంతో సంసార జీవితాన్ని చికాకుపరచుకొని చివరకు పశ్చాత్తాపడడం జరుగుతుంది అనడానికి నారాయణరావులోని శారద పాత్ర ఉదాహరణ. వివాహ వ్యవస్థలో కొన్ని లోటుపాటులున్నాయి గనుక మూలచ్ఛేదమే మంచిదనే వాదనొకటి బయలుదేరింది. ఈ ప్రస్తావన నారాయణరావులోనూ వచ్చింది. ఈ సిద్ధాంతం పట్ల బాపిరాజుగారికి గౌరవం లేనట్లే తోస్తుంది.
నారాయణరావులో రాజేశ్వరరావు రుూ స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పుష్పలీలను లేవదీసకుపోతాడు. కాని పుష్పలీల తనను కాదని మరొక మహమ్మదీయ కుర్రవానిని ప్రేమించగనే భరించలేకపోతాడు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడలేక, దానిని కాదనలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకే బాపిరాజుగారు ‘ప్రేమ స్వాతంత్య్రము’ అన్న ప్రకరణలో ‘‘తిరుపతిరావు గారి చుట్టును పాశ్చాత్య విద్యాదక్షులగు పెక్కండ్రు చేరినారు’’ అని వ్రాస్తూ పాశ్చాత్య విద్యాదక్షులు అన్న చోట బ్రాకెట్‌లో ‘విద్యాదగ్ధులా?’ అని చమత్కరించారు. నియమాలను ఎదురించడం వలన వచ్చే ఆనందంతోపాటు ఎదుర్కోవలసిన కష్టాలనూ, నియమబద్ధమైన చికాకులతోపాటు కలిగే భద్రతనూ లాయరు సుబ్బయ్యశాస్ర్తీ చివరకు గుర్తిస్తాడు. బాల్య వివాహాలు రుూనాడు మన సమాజంలో యించుమించు లేవనే చెప్పాలి.
నారాయణరావులో శారదకు రజస్వల కాక పూర్వమే వివాహం జరిగినా, శ్యామసుందరీదేవి వయస్సు వచ్చిన తరువాతే వివాహం చేసుకుంది. తండ్రి బ్రహ్మసమాజస్థుడు. అందుకే వితంతు వివాహం చేసకుంటాడు. గ్రాంధిక భాషలో నవలలు వచ్చిన వాటిలో నారాయణరావు ఒకటి. ఉదాత్తమయిన సంస్కృత సమాసాలు, వెను వెంటనే అతి లలితమై, తేట తెలుగు పదాలు, బాపిరాజుగారి రచనకు వనె్న పెట్టాయి.
‘శారద’ అన్న ప్రకరణలో ఆమె గుణగణాలు, అందచందాలను ఇలా చిత్రీకరిస్తారు. ‘‘ఆమె సౌందర్యమూర్తి, మేలిమి బంగారు రంగులో తామర ఎరుపు కలిగిన శరీరచ్ఛాయ, బంగారు గనే్నరు మొగ్గవంటి ముక్కు, మధ్య సుడినొక్కుతో కాశీరత్నం పూలజంటలా ఆమె అధరాలు’’ ఇలా రమ్యంగా సాగుతుంది వర్ణన. బాపిరాజుగారి శైశవమంతా గోదావరి తీరంలోనే గడిచింది. పాపికొండలు, పట్టిసం వారిని పరవశుణ్ణి చేసాయి. అందుకే రుూ నవలలో గోదావరి సొగసులు పలు తావులలో పొంగి పొరలుతాయి. ‘గౌతమి’ అన్న శీర్షికలో ‘‘నీటిలో ముత్యమై, ఆ నీలజలములో కణమై, ఐక్యమైపోయి తేలియాడుచు, మునుగుచు, బాహువులు సారించి రుూదుచూ రుూ గౌతమీ బాలతో నాతడాడుకున్నాడు’’ అని చెబుతాడు.
ఆంధ్ర దేశంలో చిత్రకళకు ఆదరణ అడుగంటి ముచ్చపు పనివాళ్ల చేతుల్లో శల్యావవశిష్టంగా వున్న రోజుల్లో బాపిరాజు, రామారావు గారలు చిత్రకళను ఉద్ధరిచి ఆంధ్రదేశ గౌరవాన్ని నిలబెట్టారు. అందుకే విశ్వనాధవారు వారి బాపి బావను ‘‘అతడు గీసిన గీత బొమ్మే. అతడు పలికిన పలుకు పాటై’’ అని పొగుడుకున్నారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మారేమండ శ్రీనివాసరావు