వినమరుగైన

నారాయణరావు -అడివి బాపిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నవలలో చిత్రకళను గూర్చిన ముచ్చటలు ‘‘శోభన మందిరము’’, ‘ఆంధ్ర నవకవి సమితి’ అన్న శీర్షికలలలో వివరంగా చెప్పారాయన. శోభన మందిరంలో సయితం నందలాలు, ప్రమోదుకుమారు, అవనీంద్ర, దేవీప్రసాదరాయ, దామెర్ల వంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలతో అలంకరించారు.
‘ఆంధ్ర నవ కవి సమితి’ అన్న శీర్షికలో కళా ప్రదర్శన నేతగా ‘కజన్స్’ను ఆహ్వానించారు. గుఱ్ఱం మల్లయ్య, బుచ్చి కృష్ణమ్మ, వరదా వెంకటరత్నం, చౌక్‌తాయ్ యిలా ఎందరెందరో గొప్ప చిత్రకారులను రప్పించి వారి కళా ప్రదర్శన చేయించారిందులో. అలాగే కవులలో దేవులపల్లి, కాటూరి, నండూరి, కురుగంటి, వేదుల యిలా ఎందరో ప్రముఖుల చేత కవి సమ్మేళనం జరిపించారీ శీర్షికలో!
జానపద జీవితాలన్నా, జానపద గేయాలన్నా చెవికోసుకొనేవాడు. ఈ నవలలో ‘ఆకుమళ్లు’ అన్న ఖండికలో జానపదుల పాటను
సోగా మీసాలయందం,
సొంపూ తలపాగా యందం
ఊగేటి వొళ్లూ అందం,
రాగాల గొంతుకందం,
లచ్చుమయ్యా నీ మచ్చమాయా’’
అని సొంపుగా పాడిస్తాడు. పొలం అన్న శీర్షికలో మాలగూడెంలోని యెంకటిదాసు, మరకడు, నీలాలు కథను కలుపు తీసేవాళ్లకు ఉద్రేకం కలిగేలా అద్భుతంగా చెబుతాడు. అతడు పుట్టు కథకుడు. పాత్రోచిత వర్ణన, సంభాషణ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలోనే నీలాలు వర్ణన యెంత సహజమో-
‘‘దాన్ని సూత్తే మైనగోరువంక సిగ్గుపడాలి
బేతాళుడు గుడిలో నున్నగా
తోయిన బాకులా తళతళలాడేటి వొళ్లు
లేత తామరాకు అరసేతులు,
సెంగలువకాడ సేతులు,
సెందురుడిలాంటి మొగము,
నగచత్రాల్లాంటి పళ్లు’’-
యిలా చక్కటి వర్ణన.
అలోపతి, ఆయుర్వేద శాస్త్రాల్లో జ్యోతిష సాముద్రిక శాస్త్రాల్లో గంటల తరబడి చర్చ చేయగల సమర్థుడాయన. రాయబారం అన్న శీర్షికలో సిద్ధాంతిగారికి, తహశీల్‌దారు గారికి జ్యోతిషంమీద చర్చ జరిపిస్తాడు.
‘‘వ్యాధికి మందు ఆయువుకు మందు లేదు’’
‘‘నాకు ప్రేమ లేదు’’
అన్నవాటిలో ఆయుర్వేదం, అలోపతులను చొప్పించారు. సంగీత, నృత్య శాస్త్రాల గురించి సమగ్రమైన, సుబోధకమైన ఉద్గ్రంధాన్ని రచించాలనే పూనికతో మిక్కిలి కృషి చేసి నోట్సు తయారుచేసుకున్నారాయన. ఈ విషయాలన్నీ, రుూ గాన నృత్య కళా రహస్యాలన్నీ పూలతోటలై, నక్షత్ర కాంతులై, చంటిబిడ్డల నవ్వులై, సంధ్యా సమయ శ్రీ నటేశ పాదకింకిణీ తాళములై, శ్రీ బాలకృష్ణ నూపుర ఘలం ఘలిత మధుర తర మధుగతీవేగమై రుూ నవలలో ‘గృహప్రవేశం’, ‘ముచ్చట్లు’, జగన్మోహనరావు అన్న శీర్షికలలో పాఠకులకు దర్శనమిస్తాయి.
పిల్లలతో ‘ఇడియట్ విత్ డబుల్ డి, డండరిహిట్, జింజెర్‌బ్రెడ్’ అని కేరింతలు కొడుతూ ఆడుకునేవారు. ఈ నవలలో నారాయణరావు అన్న కూతురుతో కొత్తపేట అన్న శీర్షికలో ‘‘చిన్న నాన్నగారూ, తిన్న నాన్నగాలూ, తిన్న నాన్నలూ’’ అని ముద్దుగా పలికిస్తారు.
నారాయణరావు నవలను నాలుగు అధ్యాయాలుగా, 90 అంతర్విభగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి దాని సారాంశాన్ని సూచించేలా కళాత్మకంగా పేర్లు పెట్టారాయన. ‘నీకు పెండ్లి అయినదా?’, ‘రైలు తథాస్తన్నది’, ‘ఔనా కాదా’ యిలా పలు రకాలుగా. ఔనా కాదా అన్నదానిలో బ్రాహ్మణ యింటిలో భోజన వేళ జరిగే సన్నివేశాన్ని నాటకీయంగా చిత్రించారు.
చిన్ననాడు అన్న దానిలో ముఖంమీద వందేమాతరం అని వ్రాసుకొని తోటి విద్యార్థులతో నారాయణరావు బడికి వెళ్లడంతో స్వాతంత్య్ర సముపార్జన దీక్షను చూపుతారు. గృహప్రవేశం అన్నదానిలో స్వదేశీ వస్త్రాలను ఖద్దరునే వాడడం, గాఢ స్నేహము అన్నదానిలో ఆనాడు కాశీనాధుని నాగేశ్వరరావు గారు తమ భారతి పత్రిక ద్వారా చిత్రకారులను, కవులను ప్రోత్సహించిన విషయం, మంగళగౌరి అన్నదానిలో ఆంధ్ర వనితలు శుభప్రదమైన నోములు నోయడం, కవిత్వము అన్నదానిలో మరుగునపడిన బొబ్బిలి పాటలలాంటి బిచ్చగాండ్ర పాటలు, పుష్పలీల, రాజేశ్వరరావు అన్న వాటిలో వారిరువురి కవిత్వము వివరించి ఉన్నారు.

-మారేమండ శ్రీనివాసరావు