వినమరుగైన

చివరకు మిగిలేది -బుచ్చిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తను నశించి ఆమెలో ఐక్యం కావాలంటే ఇద్దరూ కైలాసపర్వతం నుంచి పారే మంచు నదిలో పడి, కొట్టుకుపోయి హతమవ్వాలి. మరో ప్రపంచంలో వారిద్దరూ ఒక శరీరమే. ఇక్కడెందుకో విడిపోయారు’’ (పు.30) ‘‘కోమలి శరీరం నా ప్రేమతో పెరిగింది. హృదయం ఇప్పుడిప్పుడే జనిస్తోంది’’- అమృతం దయానిధుల కలయిక ఇలా వర్ణితం (పు.155)
ముక్కలయిన లయకోసం తడుములాడుతున్న కంఠంతో భూమి తిరిగిపోతుంది. స్థలం, సమయం గతులు తప్పాయి. విశ్వమే కదిలిపోతున్నట్లున్నది. ఎక్కడికో ఇంకా ఇంకా దగ్గరగా, కలసి ఒకరై, అన్ని రహస్యాలనీ ఛేదించి, అన్ని లోతుల్ని శోధించి, అన్ని శిఖరాల్ని సాధించి, ఒంటి జీవంగా కొట్టుకుని, విశ్వరహస్యానికి ప్రాణం పోశారు. సర్వేంద్రియాలు విడిపోయి జీవకణాలుగా శరీరాన్ని మార్చేశాయి. శరీరం అనుభవంతో ఆత్మైపోయింది’’ (పు.243)
కోమలి ఒకానొప్పటి వికాసం వొదిలేసిన మొగ్గ. ఈనాడు ఒంగిపోయిన పుష్పం, పుష్పాన్ని ఆస్వాదించిన గుర్తు- నుదుటి మీద మచ్చతో తిరిగి వచ్చిన కోమలిని దయానిధి ఇలా అర్థం చేసుకొన్నాడు.
‘‘ఎందరెందరి స్వప్నాలనో యదార్థం చేసి, తనలోని యదార్థాన్ని రహస్యంగా స్వప్నం చేసుకొంది కోమలి (ప.282)
‘‘ఒకరికొకరు అర్థం కానంతవరకూ శరీరాలూ పరిచయం కానంతవరకూ ప్రేమించుకుంటాం’’ అంటాడు దయానిధి. అంటే దయానిధి కోమలితో శారీరక సంబంధాన్ని త్రోసిపుచ్చి నిజంగా ఆమెనే ఆత్మతో ప్రేమించాడన్నమాట.
‘‘ఆమె శరీరం పొంగిపోయి, రాతిమీద భగ్నమైన కెరటం తుంపరలలాగా పడిపోయింది. మనిషంతా జీవుడై, మృతువుని వెతుక్కుంటోంది’’ (పు.333)
కోమలి లైంగిక చేష్టల్ని కూడా దయనిధి నిలువరించి ఆమెపట్ల నిజమైన దయని, ప్రేమని, కరుణని చూపించి తిరిగి ఆమెనించి ఆ దయ, ప్రేమ, కరుణల్ని పొందాడు. ఆ ఒక్క కోమలే లేకపోతే ఇక భవిష్య ప్రయాణం ఎటు?
దయానిధికి చివరికి మిగిలిన సమాధానం తనను తాను తెలుసుకోవటం, వాంఛనుండి విముక్తుడవటం. తనతో తాను సమాధానపడటంలోనే కర్కశ సమాజాన్ని కూడా ద్వేషంతో చూడకుండా ఉండగలగటంలోనే, ‘‘మానవుడికి కావాల్సింది దయ కొంచెం, కాస్తయినా చాలు’’ (పు.347) అనటంలోనే, అమ్మ చచ్చిపోనా ఏడవకూడదని తనకు తాను చెప్పుకోవటంలోనే, ‘‘నేను వెలుగును చూశాను- స్మశానంలోనే’’ అని కోమలితో పైకి చెప్పుకోవటంలోనే, ‘‘అవతలంటూ లేని అవతల నడిచి నడిచి; నడిచి మళ్లీ అక్కడికే’’ (పు.344) జేరుకోవటంలోనే చివరికి మిగలటం అనేదాన్ని తెలుసుకుంటాడు దయానిధి. చివరకు మిగిలేది అనే భావనను రూపకంగా తీసుకుంటే ఇరవయ్యవ శతాబ్ది నవలా సాహిత్యంలో చివరికి మిగిలిన నవలలు, మైదానం, వేయిపడగలు, చివరకు మిగిలేది, హిమజ్వాల, చలం, విశ్వనాథ, బుచ్చిబాబు, వడ్డిర చండీదాస్‌లకు వారి వారి అర్థాలు ప్రశ్నలుగానే అయినా మిగిలినయ్.
బుచ్చిబాబు నవల శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన సంస్కారపు మీమాంస. కోమలి చివరికి తానున్న కుటీరపు దహనంలో, జ్వాలల్లో చిక్కుకుపోవటం, దయానిధి ఆమెను రక్షించటం తనకు తోడుగా ఎటో తీసికెళ్లిపోవటం కూడా దహన సంస్కారపు ఆత్మసంస్కారంలోని భాగమే. దయానిధి తల్లి శిలా విగ్రహం తల పగిలినా ఆమె పాదాలు ఇంకా నిలిచి వుండటం ఈ సమాజపు సంస్కారంలో భాగమే. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోని మధ్య తరగతి మందహాస జీవితంలోని భాగస్థులే నిజాయితీ లేని దశరథరామయ్య, గోవిందరావు, కృష్ణమూర్తి, జోగప్ప నాయుడు, గుర్నాధం, ప్రకాశరావు, అరూపానందస్వామి, శిష్యులు జీవ, సజీవలు, మరీ ముఖ్యంగా రాజభూషణంలు, వాళ్లకు చివరికి మిగిలేదేమిటనే ప్రశే్న రాదు. ఎంత అదృష్టవంతులు వాళ్లు! చివరికి మిగిలేది నవలలో మాతృప్రేమ, స్వీయప్రేమల వికృతులు చివరికి ద్వేషరాహిత్యంతో ప్రేమ సాఫల్యాన్ని పొంది విశ్రాంతి నొందింది నవల.
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వేగుంట మోహనప్రసాదు