వినమరుగైన

కీలుబొమ్మలు -జి.వి.కృష్ణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఇంగ్లీషును బోధనా భాషగా నాటి బ్రిటీష్ పాలకులు ఏ కారణాల వల్ల ప్రవేశపెట్టినప్పటికీ, దాని మూలంగా కొన్ని మేళ్లు కూడా జరిగాయని ఒప్పుకోక తప్పదు. సాహిత్య రంగంలో నూతన ప్రక్రియలు పాశ్చాత్య ప్రభావం చేత ఆవిర్భవించటం అటువంటిదే. నవల అనే సాహితీ ప్రక్రియలు ఇలానే మనకి లభ్యమైంది. తెలుగు నవల మూలాన్ని గుణాఢ్యుడి బృహత్క్థ వరకూ అనే్వషించుకుంటూ వెళ్లవచ్చునేమో కానీ ఇప్పుడు మనకి తెలిసిన నవల స్వరూపం ఇంతకుముందు లేదని చెప్పడంతో అసత్యమేమీ లేదు. ఇది నిశ్చయంగా పాశ్చాత్య ప్రభావంవల్ల ఆవిర్భవించిందే. మొదట్లో ఈ నూతన ప్రక్రియని ఉపయోగించుకున్నారు. ఈ విధంగా ఇది పాఠకుల మానసిక పరిధులను విస్తృతం చేసి, సంకుచిత భావ సముదాయాన్ని, ఇతర విధాలైన వ్ఢ్యౌలనూ తరిమివెయ్యడానికి తోడ్పడింది. ఇంతేకాక పాశ్చాత్య దేశాలలో వీచే ఉదారభావ వీచికలు మనల్ని తాకాయి. దీనికితోడు ఆధునిక భౌతికవాద చింతనా, మనోవైజ్ఞానిక పరిశోధనా ఫలితాలూ మనల్ని ప్రభావితం చేశాయి. ఆ కారణంగా మన విజ్ఞాన పరిధి ఊహించలేని దిశలలో విస్తరిల్లింది. ఈ కొత్త భావాల సహాయంతో నవలలల్లిన వాళ్లున్నారు. ఈ భావాల కతీతంగా సంప్రదాయవాదులూ, కాల్పనిక వాదులూ స్వీయమైన సృజనాత్మకతతో నవలల నిర్మాణం కొనసాగించారు. ఇక్కడ గమనించవలసినది నవల కొత్త ప్రక్రియ అయినా జంకు లేకుండా చాలామంది దీనిని స్వతంత్రంగా ఉపయోగించుకోగలిగారు. నవలకున్న ఒదిగిపోయే (ప్లాస్టిక్) స్వభావమే దీనికి కొంత కారణం కావచ్చు.
స్వాతంత్య్రానంతర కాలంలో వచ్చిన ఉత్తమమైన నవలల్లో జి.వి.కృష్ణారావు గారి కీలుబొమ్మలు ఒకటి. నవలాకారుడిగా, పండితుడిగా, అధ్యాపకుడిగా, ఆలోచనాపరుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా కృష్ణారావుగారి ప్రతిభ బహుముఖీనమైనది.
బుచ్చిబాబు చివరకు మిగిలేది 1946లో ప్రచురణ కాగా, ఉప్పల లక్ష్మణరావు గారి అతడు ఆమె 1950లో అభ్యుదయలో ధారావాహికలో వెలువడింది. కృష్ణారావుగారి కీలుబొమ్మలు 1951లో వెలువడింది. బుచ్చిబాబు, లక్ష్మణరావుగార్ల నవలలకంటె కృష్ణారావు గారి నవల భిన్నమైనది. కీలుబొమ్మలు నవలలో కథాప్రదేశం కోస్తా జిల్లాలోని ఒకటి రెండు గ్రామాలకే పరిమితమయంది. ఈ పరిమిత పరిధిలో జరిగిన వ్యవహారాలు, సంఘటనలే కథకి ఆధారం. ఈ నవలకి రాసిన ప్రస్థానంలో కృష్ణారావుగారు ‘ఇది ప్రణయగాథ కాదు, ప్రాచీన చరిత్ర కాదు, భారతీయ ధర్మ విశిష్టతా బోధకం కాదు. ఈ రచనకు కళానుభూతే ప్రధానం. పార్టీ ఆదేశాలను సాధ్యమైనంతవరకు మరచి చదివినపుడే ఆ అనుభూతి ఇందులో సాధ్యం’ అంటారు. ఆ రకంగా రుూ నవలలో మానవత్వాన్ని, మానవ స్వభావాన్ని రచయిత సామాన్యీకరిస్తున్నట్టుగా భావించవచ్చు. అంటే రుూ నవలలో సంఘటనలు కాల, ప్రదేశ నిర్దిష్టాలు కావు. అయినప్పటికీ యిది రచయిత యొక్క ప్రాపంచిన దృక్పథానికి దర్పణం. ఈ నవలని ఒక సాంఘిక చరిత్ర అన్నా తప్పులేదు. ‘ది పవర్ ఆఫ్ ఎ లై’ అనే గ్రంథం కీలుబొమ్మలు నవలా రచనకు దోహదం చేసినట్లు కృష్ణారావుగారే ప్రస్థానవలో తెలియజేశారు. ఇంగ్లీషు పుస్తకానికి కీలుబొమ్మలు ఏవిధమైనట్టి అనువాదమూ, అనుసరణమూ కాదు. అజాగ్రత్తగా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలలో, విన్నవారికి విపరీతార్థం ధ్వనించి, ఎంతటి అనర్థాలకి దారితీస్తుందో ఈ నవల అపూర్వమైన రీతిలో చిత్రిస్తుంది. పుల్లయ్య గౌరవనీయుడైన ఒక మోతుబరి రైతు. చంద్రశేఖరం ఆదర్శ భావాలు గల విద్యావంతుడు. చంద్రశేఖరానికి ఐదువేలు అప్పు కావలసి వస్తే, ఆ అప్పుకు మార్వాడీ దగ్గర పుల్లయ్య పూచీ పడతాడు. చంద్రశేఖరం ఆ ప్రాంతాలలో గల పేద ప్రజలకి జీవనాధారం కల్పించటం కోసం, తన ఆస్తినంతా అమ్మి మరి కొంత అప్పు తెచ్చి, ఒక పేపరు మిల్లును నడుపుతుంటాడు. ఆ చుట్టుప్రక్కల మిల్లుల వాళ్ళకంటే తన మిల్లుల్లో పనిచేసే వాళ్లకి జీతభత్యాలు ఎక్కువగానే యిస్తుంటాడు.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-డి.కేశవరావు