వినమరుగైన

పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని సందర్భాల్లో ఆమెలోనైన అంతర్మథనం మనని కలచివేస్తుంది. అంతరాత్మ పెట్టే ఘోషను పలుమార్లు పెడచెవిన పెట్టిన సహనశీలి మంజరి.
విలాస జీవితం అన్ని సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠలు, రెండు చేతులా నిర్విరామంగా ధనార్జన లక్ష్యంగా పెట్టుకుని, దాని సాధనకు మంజరి చెల్లించవలసిన మూల్యాలను గణించక, ముందుకుసాగి గమ్యం చేరుకున్నా, చివరకు విధి వక్రిస్తుంది. ఉన్న నాలుగు రోజులూ దయాదాక్షిణ్యాలు, పాప పుణ్యాలకు తావివ్వకుండా, జీవితాన్ని పిండుకుని ఆనందమనుభవించాలన్న సూత్రమే విషాదాంతానికి దారితీసింది. ఒక విధంగా మంజరి శాపగ్రస్త.
మంజరి సినీ, వ్యక్తి జీవితాన్ని పోలిన జీవనం గడిపిన తారలు నవలాకాలం నాటికి ఎందరో వున్నారు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నవారు, ఆత్మను చంపుకుని, శరీరాన్ని పణంగా పెట్టి, ఉన్నత స్థానాన్ని చేరుకున్న వారుండే వారన్నది సత్యదూరంకాదుగాక కాదు.
ఒక తమిళ హీరో గుప్పిట్లో చిక్కుకుని, దయనీయ స్థితిలో మరణించిన భగ్నజీవి అయిన ఒక మహానటి జీవితమే అందుకు ప్రబల సాక్ష్యం. స్పర్థలు పెంచుకుని, ఆ తర్వాత మంజరిమీద కక్షతో రాజీపడినరావు, మూర్తి పాత్రలు ఏ కథానాయకుల్ని స్ఫురణకు తెస్తాయో ఊహకు అందని విషయంగాదు. కులాభిమానానికి ఆ రోజుల్లోనూ తెలుగు సినీ రంగంలో తావుండినమాట కాదనలేం.
రంజిత అనే ఆనాటి హిందీ నటి సినిమా రంగ ప్రవేశానికి తొలిమెట్టు ‘కౌచ్’ (శయ్య) అంటూ తెగేసి చెప్పి, సంచలనం సృష్టించిన ఉదంతం పాతతరం సినీ ప్రేక్షకులకు గుర్తు వుండే వుంటుంది. కటువనిపించినా ఆ ప్రకటనలో కించిత్ సత్యాంశం లేకపోలేదు. ఒకనాటి హాలీవుడ్ అందాలరాశి మేరిలిన్ మన్రో జీవితం ఎంత విషాదంగా ముగిసిందో తెలిస్తే తప్ప, 50-60 దశకాల్లో తెలుగు సినీ జగత్తునావరించిన కలుషిత వాతావరణం అర్థంగాదు; ఆనాటి విషవలయాలూ స్ఫురణకు రావు; అక్కడి నిమ్నోన్నతాలు, మంచీ చెడులు, సుఖ దుఃఖాలు బోధపడవు; ఆత్మహత్యకు పాల్పడిన చిరు కళాకారిణులూ గుర్తుకురారు.
అదీగాక, ఆనాటి సినీ మేగజైన్స్ కొంతమేరకు తారల ఆరోపణ అవరోహణలలో పాలుపంచుకున్న మాట యదార్థం. నవలలోని కొరడా పత్రిక సంపాదకుడి పాత్ర ఆనాటి కాగడా శర్మ మలచబడిందే. కాగడా ఎన్ని దుమారాలు రేపిందో! ఎందరు ప్రముఖుల్ని గడగడలాడించిందో! అందుకు భిన్నంగా రూపవాణి, పెంకిపిల్ల, నటన, కినిమా, ఢంకా వంటి పత్రికలు సాదా సీదా కథనాలను, నిర్మాణ వార్తలనూ ప్రచురించేవి. వివాదాల జోలికి వెళ్ళేవిగావు. తమిళంలో హిందూనేశన్ పత్రిక సంపాదకుడైతే మేటి తమిళ తారల్ని బీతావహుల్నిచేసి, చివరకు దారుణహత్యకు గురయ్యాడు. ఈనాటికీ రంధ్రానే్వషణ చేసే పత్రికలున్నా, వాటి కంతగా ఆదరణ, ప్రచారాల్లేవు. ఐతే వ్యాపార ప్రకటనల ద్వారా నటీనటులు అప్పుడూ, ఇప్పుడూ తమ ఆదాయాన్ని పెంచుకుంటూనే వున్నారు.
అలా ధనర్జానతోబాటు స్పర్థలూ, వైషమ్యాలూ పెరగడం సహజ పరిణామమే. అప్పటికీ, ఇప్పటికీ సినిమా వేషం దొరకాలంటే ప్రజ్ఞ ఒక్కటే చాలదు. సిఫారసులు కూడా అవసరం.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.యస్.రావు