వినమరుగైన

కొల్లాయి గట్టితేనేమి? మహీధర రామమోహనరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా వినకుండా కూతురును చదివించాడు. అందుకు కోపంతో తెగతెంపులు చేసుకొని స్వరాజ్యం భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. కూతురును కాపురానికి పంపటానికి ఇష్టపడినా, చదువుకున్న ఆడపిల్ల వొద్దని వాళ్లు తలుపులు మూసేశారు. చేసేదేమీ లేక ఇరవై ఏళ్ల స్వరాజ్యం కాలేజీలో చదువుకుంటోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రామనాధం అబ్బాయి నాయుడు ఆధునిక దృక్పథానికీ, స్వరాజ్యం తెగువకూ ఆకర్షితుడయ్యాడు.
ఈ రామనాధానికి కూడా అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే పెళ్లయింది. అతడి మామ నారాయణమూర్తి పోలీస్ ఆఫీసర్- రాజభక్తి పరాయణుడు. తన అల్లుడు జాతీయోద్యమంలో పాల్గొన్నందున అల్లుడిపై లాఠీఛార్జి చేసినవాడు. అల్లుని జైలుశిక్షకు గురిచేసినవాడు. తన కూతురును కాపురానికి పంపటానికి వీల్లేదన్నాడు. ఈ విధంగా రామనాధం వైవాహిక జీవితమూ చెడిపోయింది.
రామనాధం పెంపుడు తండ్రి పరమ నైష్ఠికుడు. సంప్రదాయాలనూ, ఆచారాలనూ మంటగలిపినందున రామనాధాన్ని వెలివేశాడు. రామనాధం వెలియై ఊరికి దూరంగా తనతోటలో పాక వేసుకొని జీవిస్తూ తన ఆశయాలనూ, ఆదర్శాలనూ నెరవేర్చటానికి కృషి చేస్తుంటాడు. స్వరాజ్యం అతని బాటలో నడుస్తుంది. కొంత సంఘర్షణ తర్వాత స్వరాజ్యాన్ని రామనాధం వివాహం చేసుకుంటాడు. అతడు నెలకొల్పిన ‘ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని’ దర్శించటానికి గాంధీ ముంగండ రావటంతో నవల ముగుస్తుంది.
ఇదీ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
1920 ప్రాంతాలో ఆంధ్రదేశంలో సాగిన జాతీయోద్యమాన్ని చిత్రించటం మాత్రమే కాదు ఈ నవల ధ్యేయం-ఆతరంలో తెలుగుదేశం సాంస్కృతిక జీవితాన్ని విశే్లషించటం రచయిత ప్రధాన ఆంతర్యం. కరడుగట్టిన ఫ్యూడల్ సమాజంలోకి ఆధునిక బూర్జువా భావజాలం ప్రవేశిస్తున్న చారిత్రక దశలో ఆ రెండింటి మధ్య చోటుచేసుకున్న సంఘర్షణను చెప్పటం ఒక బాధ్యతగా రచయిత ఈ నవలను రాశాడు.
రామనాధం ఆధునిక భావాలు కలిగినవాడు. అప్పుడప్పుడే సమాజంలో ప్రవేశిస్తున్న బూర్జునా భావజాలంతో ప్రభావితుడైనవాడు. అన్నికులాలపట్ల సమదృష్టి, స్ర్తి విద్య పట్ల గౌరవం, ఫ్యూడల్ ఛాందస ఆచారాల పట్ల వ్యతిరేకత, వర్ణాతర వివాహాల పట్ల సుముఖత, అస్పృస్యతను పాటించకపోవటం, దేశం పట్ల బాధ్యత కలిగి వుండటం, ఇంగ్లీషు చదువు.. ఇవీ బూర్జువా భావజాలంలోని కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగిన పాత్రగా రామనాధాన్ని రచయిత సృష్టించాడు. ఇతడి స్వగ్రామం ముంగండ- ఆ గ్రామం ఈ లక్షణాలన్నింటికీ వ్యతిరేక భావజాలం కలిగినది- ఫ్యూడల్ భావజృలంతో కరడుగట్టిన ఆ గ్రామాన్ని రచయిత నవలలో ప్రధాన కేంద్రం చేయటంలో ఉద్దేశం రెండు భిన్నమైన భావజాలాల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటుచేయటం కోసమే! ముంగండలో దళితులకు, చెరువు నీరు తాకటానికి అర్హత లేదు. అగ్రవర్ణాలవాళ్లు, వాళ్ల కడవల్లోకి పోసిన నీళ్లే గతి! రామనాధం ఈ పద్ధతిని వ్యతిరేకించాడు. తన తోటలోని బావిలో వాళ్లు నీళ్లు తోడుకోవడానికి వెసులుబాటు కల్పించాడు.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సింగమనేని నారాయణ