వినమరుగైన

కొల్లాయి గట్టితేనేమి? మహీధర రామమోహనరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చర్యతో ముంగండలోని అగ్రవర్ణాలవారి ఆగ్రహానికి గురి అయ్యాడు. దాంతో వారు అతన్ని బహిష్కరించారు. రామనాధం ఆ బహిష్కరణకు చలించలేదు. ఊరిబయట తన తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా చాలా సందర్భాలలో రచయిత రెండు భిన్న భావజాలాల సంఘర్షణను దృశ్యీకరించాడు. తాను రామనాధం పక్షాన నిల్చాడు.
రామనాధం, స్వరాజ్యంల పెళ్లి కూడా ఒక ఘర్షణకు లోనయినదే! స్వరాజ్యం భర్త నుండి విడిపోయిన ఇల్లాలు- రామనాధం భార్య నుండి విడాకులు పొందినవాడు-దీనికితోడు ఇద్దరి కులాలూ వేరు-వర్ణాతరమే కాకుండా, ద్వితీయం కూడానన్నమాట-స్వరాజ్యం తండ్రి అబ్బాయి నాయుడు బ్రహ్మసమాజం భావజాలం కలిగి వున్నప్పటికీ, కూతురు పెళ్లి విషయం దగ్గరకొచ్చేసరికి, సంఘర్షణకు గురి అవుతాడు.మరొక కులం వారికి ఇచ్చి పెళ్లి చెయ్యటంలో అతనికి అభ్యంతరం లేదు. అయితే పెళ్లి అయి, భార్య వున్నవాడికి వివాహాంతరం చెయ్యటంలో అభ్యంతరం -ఈ అభ్యంతరం వ్యక్తిగతమైనది కాదు, సామాజికమైనది- ఈఘర్షణను చాలా నేర్పుగా పరిష్కరించాడు రచయిత.
ముంగండ మడిగట్టుకొన్నప్పటికీ, కాశీనాథుని నాగేశ్వరరావు అంతటివాడు, గాంధీ అంతటివాడూ, ఆ వూళ్లోకి అడుగుపెట్టేసరికి వాళ్లు తమ ఆధిపత్యాన్ని కొంతసేపు పక్కన తీసిపెట్టడం, ఒక విచిత్రమైన ఘర్షణగా రచయిత ఈ నవలలో భాసింపజేశాడు.
కేవల వస్తు రీత్యా మాత్రమే కాదు ఈ నవల గొప్పతనం! నిర్మాణరీత్యా కూడా చాలా చక్కని పొందిక అమరిన నవల ఇది. మంచి నవలకుండాల్సిన మంచి లక్షణాలు. వాస్తవికత, దేశీయత, చారిత్రకత, కాల్పనికత, విశ్వసనీయత-ఇవన్నీ కూడా నిజానికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే! ఇవన్నీకూడా నిర్దిష్ట స్థల, కాలాలతో ముడిపడినవే. వాస్తవికత, దేశీయత అన్నవి స్థల, కాలాలతో ముడిపడి వున్నప్పుడూ విశ్వసనీయవౌతుంది. మంచి నవల నిర్దిష్ట, స్థల కాలాలను ప్రతిబింబిస్తూనే, స్థల కాలాలకు అతీతమైన సంస్కారాన్నీ, చైతన్యాన్నీ కూడా పాఠకులకు కలిగించగల్గాలి. కొల్లాయి గట్టితేనేమి నవల, దేశీయతా ముద్రగలది. కాబట్టే వాస్తవికమైనది- తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం ముంగండ. ఈ నవలలోని స్థలం అయినప్పికీ ఆ పరిధికే ఈ నవల పరిమితమైనది కాదు. దేశం మొత్తం సామాజిక పరిణామాన్ని, సాంస్కృతిక పరిణామాన్ని చెప్పగలిగినది ఈ నవల. కథలోని కాలం 1920 ప్రాంతాలదైనప్పటికీ నవలలో ప్రతిఫలించిన ప్రగతిశీల భావజాలం ఇప్పటికి కూడా పాఠకుడి చైతన్యాన్ని, సంస్కారాన్ని ఉద్దీపితం చేయగలిగినదే. ఈ నవల ఏ ఆర్భాటమూ లేకుండా ప్రారంభవౌతుంది. ఏ ఆడంబరమూ, ఏ అలంకారమూ లేని శైలి. రచయిత నవలలోని కథను తానుగా ఎక్కడా నడపడు. పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలూ ఇవే కథను నడుపుతాయి. నిజంగా ఇది గొప్ప శిల్పం. రచయిత ఏ పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేయడు. ప్రతి పాత్రా, దేవ, కాల, భావజాల బద్ధమైన స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. రామనాధం, స్వరాజ్యం, అబ్బాయి నాయుడు, శంకరశాస్ర్తీ, నారాయణమూర్తి-ఇలా అందరూ ప్రాణం పోసుకున్న పాత్రలే. కేవలం ఆదర్శీకరించిన పాత్రలూ, రచయిత చెప్పుచేతల్లోని పాత్రలూ ఈ నవలలో కనిపించవు. ఇలా వస్తువూ, రూపమూ, భావజాలమూ పడుగు పేకల్లా అల్లుకుపోయిన ఉదాత్తమైన నవల కొల్లాయిగట్టితేనేమి.

-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సింగమనేని నారాయణ