వినమరుగైన

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమత్వం, అహజత్వం ఎక్క డ వెదికినా కనిపించవు. ఎంతో నిజాయితీతో ప్రజల మధ్యకొచ్చిన రచనగా స్పష్టపడుతుంది జానకి విముక్తి.
ఈ దోపిడీ సమాజమే స్ర్తి బ్రతుకునిలా ఛిద్రం చేసిందనే స్పష్టమైన, నూతన అవగాహన పాఠకుడికి నవల పూర్తయ్యేసరికి కలుగుతుంది.
బాధ్యతగల పాఠకులకూ, చదివిన దాన్నుండి కొత్త జ్ఞానం నేర్చుకోవాలనే తపన వున్నవాళ్లకు జానకి విముక్తి నవల ఎంతో మేలు చేస్తుంది. నవలలోని ప్రతి అంశం జీవంతో తొణికిసలాడుతూ పాఠకుడికి విజ్ఞానపూరిత సంభ్రమాలను కలిగిస్తుంది. ఇది శాస్ర్తియరచన. అభివృద్ధికరమైన రచన. వ్యవస్థలు మారినా తెలుగు నవలా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచన. నవలలోని వివిధ అభివృద్ధికర విషయాలే దానికా విలువని తెచ్చిపెట్టాయి.
నవలలో పేజీ పేజీన రచయిత్రి బాధ్యత కనపడుతుంది. నిజాయితీతో కూడిన స్పందన కనబడుతుంది. పరిశుభ్రమయిన జీవితం అంటే ఏమిటో పాఠకుడికి అర్థం అయ్యేలా చేసే తపన కనబడుతుంది. వివిధ వర్గాల ప్రజల సమస్యల మధ్య సంబంధముందనీ, అవి విడివిడిగా పరిష్కారం కావనీ, అన్ని సమస్యల పరిష్కారానికి ఒక మూలం వుందనీ, రచయిత్రి స్పష్టంగా, స్ఫటికమంత స్వచ్చంగా చెపుతారీ నవలలో. ఈ నవల పూర్తయ్యేసరికి రాజకీయాలంటే ఏమిటో, అవి తమ జీవితాలనెలా శాసిస్తాయో పాఠకుడికి ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతుంది. కళ కళ కోసంకాదు, కళ పీడిత ప్రజల అభివృద్ధి కోసం అనే నానుడికి ఈరచన నిలువెత్తు సాక్ష్యం.
ఇపుడిప్పుడే రచనా రంగంలోకి అడుగుపెడుతూ, పీడిత ప్రజల బాగుకోసం కలంపట్టేవారికి జానకి విముక్తి చక్కటి స్ఫూర్తినిస్తుందనటంలో సందే హం లేదు.
యువ రచయితలు ఈ రచన ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు. సమాజంలోని ఏ ఏ వర్గాల్ని రచయిత ఎలా చిత్రించాలో, ఆయా పాత్రలపై వ్యాఖ్యానాలు చేస్తున్నపుడు ఎలా స్పందించాలో, రచయిత మనోభావాల్లో రావాల్సిన దయ, కోపం, ద్వేషం, వెటాకారం వంటి అంశాలు కూడా మనకు అర్థమవుతాయి. సమాజంలో తారసపడే అన్నివర్గాల ప్రజల పట్ల ఒకే రకపు తత్వం, జడత్వం ప్రదర్శించకూడదని రచయిత కాబోయే పాఠకుడు జానకి విముక్తి ద్వారా గ్రహించగలుగుతాడు.
ఇప్పటి సమాజంలోని బీదలు, ముఖ్యంగా స్ర్తిలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ నవలల్లో చూస్తాము. ఈ బ్రతుకులు ఇంత లోపభూయిష్టంగా ఎందుకు మలచబడ్డాయో అర్థం చేసుకుంటాము. ఈ లోపాల్ని సరిదిద్దటానికి ఏం చేయాలో పాఠకుడికి నవల పూర్తయ్యేసరికి కనీస అవగాహన ఏర్పడుతుంది. ఆ ప్రభావంలో నుండి ఇక పాఠకుడు బైటపడలేడు అంత తేలిగ్గా. ఇంకోరకంగా చెప్పుకోవాలంటే సత్యానికున్న ప్రభావం ఏమిటో, అది మానవ మస్తిష్కాన్ని ఎలా తన ఆధీనంలోకి తీసుకుంటుందో అర్థమైపోయి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాము.
జీవితాంశాలను సూక్తుల్లోకి మార్చి, తాత్కాలిక తార్కికానందాన్ని కలిగించే మేధావులకన్నా, జీవితాన్ని విస్పష్టంగా విశే్లషించి విముక్తి మార్గం చూపించే ప్రజా కళాకారుల వల్ల నిజమైన మేలు జరుగుతుంది. తెలుగు ప్రజల సాంస్కృతిక వీరుడు గుడిపాటి వెంకటాచలం, స్ర్తి సమస్యను నిర్భయంగా, నిజాయితీగా వ్యాఖ్యానించిన రచయిత ఆయన. స్ర్తికి కూడా హృదయం వుంటుందనీ, మెదడు వుంటుందనీ వాటికి స్పందనా, వివేచనా కావాలనీ ఆయన చెప్పినపుడు ఆ అభ్యుదయ భావాల్నీ, రచనల్నీ చూచి తెలుగు ఛాందస సమాజం నివ్వెరపోయింది.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*

-జి.మోహన్‌రావు