వినమరుగైన

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి కథలలో మతాంతీకరణను వ్యతిరేకించే అస్పృశ్యతను ఖండించే కథలెన్నో వున్నాయి. బ్రాహ్మణ అగ్రవర్ణాలు మాత్రమేనా ఆయనకు కథా వస్తువు? కాదు కాదు తెనుగు జాతి యావత్తూ ఆయన రచనా పరిధి.
రెండు కథలను ఉటంకించుతాను. ఎందుకంటే సమయ పరిధి వున్నది కదా! కోటి సాగర సంగం; ఇలాంటి తవ్వాయి వస్తేలు అద్భుతమైన కథలు. బ్రాహ్మలలో నియోగి, వైదికి శాఖలు వున్నట్లే, నాడు హరిజనులుగా వ్యవహరింపబడే దళితులలో (మాల, మాదిగ) శాఖా భేదాలున్నాయి. ఈ రెండూ కలసిపోవాలన్నది ఆయన ప్రగాఢ కాంక్ష. అందుకే 1921లోనే సాగర సంగం అన్న కథ రాశారు. అదొక మ్రకథ! అబ్బాయి కాటంరాజు ఓ శాఖ మాల, అమ్మాయి సోమాలు మరో శాఖ మాదిగ. కాని కుల పెద్దలు అంగీకరిస్తారా అట్టి వివాహం? అందువల్ల ఆయన ఆ యిద్దర్నీ క్రిష్టియన్లుగా మార్చేశారు. కల్యాణం జరిపించాడు. సవర్ణుల నోరు మూతపడింది. ప్రేమికుల జంట అట్లా ఏకమైంది. మతం మారితే సాధ్యమైన రుూ సంస్కరణ మతం మారకుండానే జరగాలీ అన్న సూచనను ఆనాడే ఆయన గట్టిగా చేశాడు- చేస్తూనే ఉండేవాడు!
ఇలాంటి తవ్వాయి వస్తే కథని ఆయన 40పేజీల కథగా చెప్పాడేగాని వెయ్యిపేజీల అర్థాన్నిస్తుంది! కథలోని పాత్ర, సన్నివేశాలు యింకా అక్కడక్కడ వుండటం మన దురదృష్టమే.. ఇది అందరూ అధ్యయనం చేయాల్సిన కథ.
ఊళ్ళో పెద్దచెరువులో బ్రాహ్మలు, సాయిబులూ నీళ్ళు త్రాగొచ్చు. జలకాలాడవచ్చునుగానీ దళితులకు వీలు లేదు, మతం మార్చుకొని క్రైస్తవులయినా కూడా వారు వూరవతలవుండాల్సిదే. ఓసారి వాళ్ల చిన్న చెర్లో కుష్ఠురోగి ఒకడు మరణిస్తాడు. అటు తర్వాత సంఘటనలూ, సన్నివేశాలూ కథలో ఎక్కడా అనౌచిత్యంకాని ఎబ్బెట్టుతనం గాని, పక్షపాత ధోరణిగాని లేకుండా సాగుతాయి. సాయిబులైతే చెర్లో దూకొచ్చును. కనుక మనమూ ‘మహమ్మదీయ మతం పుచ్చేసుకుందాం’ అని ‘విస్సన్న’, అందుకు మొట్టమొదట లంఘిస్తాడు. ఆనక మొత్తం గూడెం పోలోమని ధైర్యం తెచ్చుకు చెరువులో ఎట్లా దూకుతారో అదీ కథ. ఇది క్లుప్తంగా చెప్పలేని అద్భుతమయిన క్రమ వికాస గతిశీలక సన్నివేశం.
దీన్ని మొత్తం ‘చూడాల్సిందే’- ‘‘ఆ వూరు ఎనభైయేళ్లనాటి వెలనాటి అగ్రహారం. మున్సబు కరణాలున్నూ ఆదినుంచీ ఆ వూళ్లోని ఆ శాఖ వారే.. వైదిక విద్యల కదో పీఠం... వెనుకటికి ఆ వూళ్ళో తపోధనులెందరో ఉండేవారని, వారిలో నలుగురైదుగురు ఆ పెద్ద చెరువులో స్నానం చేసి గుండెల్లోతున నిలిచి గాయత్రీ జపం చేసుకుంటూ, చుంగలు తీర్చి పై బట్ట పైకెగరేస్తే, వారు మళ్లీ పరమేశ్వరార్పణమస్తు అనేదాకా గొడుగులాగా అది అలాగే వుండిపోయేదనీ చెప్పుకుంటూ వుంటారక్కడ’’. కాని అక్కడ మార్పు తెచ్చాడాయన.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి.

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com