వినమరుగైన

మల్లాది రామకృష్ణశాస్ర్తీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహితీ జగత్తులో చిరస్థాయిగా, స్థిర స్థానాన్ని సుస్థిరపర్చుకొన్న కొద్దిమంది కథకుల్లో కీ.శే. మల్లాది రామకృష్ణశాస్ర్తీ గారిదే ప్రథమ తాంబూలం!
అలనాడు అల్లసాని వారు చెప్పుకొన్నట్లుగా, ‘‘నిరుపహతి స్థలంబు రమణిప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర నిడె మాత్మ’’ లాంటి సరంజామా ఉంటేనే కాని-కథ వ్రాయనని భీష్మించుక్కూర్చోలేదు శాస్ర్తీగారు.
కొబ్బరి మీగడలాంటి కాగితం, సుతారంగా నడిచే కలం కనబడటం తరువాయి శ్రీకారం చుట్టవలసిందేనంటారాయన!
ఆయన కథ రాస్తారనడం కన్న, చెప్పుకుపోతారనడం సమంజసం! అలా ఓసారి కథ చెప్పుకుపోతుంటే, అర్థంకాక మధ్యలో ‘ఇదంతా ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘జీవితం’ అంటారు.
‘‘సహజంగా ఉందా?’’ మరో ప్రశ్న!
‘‘ఉంటే కథెందుకవుతుంది?’’ ప్రశ్నకు సమధానంగా ప్రశే్న!
అయితే అసహజంగా ఉంటేనే కథా? విసుగు చెందని విక్రమార్కుని ప్రశ్న!
‘‘సహజం అనిపించే అసహజం’’.
అదీ సంగతి!.. అదీ కథంటే!.. అంతేనా! ‘‘నీ కథకు నీతి ఏమిటి?’’ అని నిలదీస్తే-
‘‘దానికున్నదల్లా జాతి’’ అని గుండె నిబ్బరంగా చెప్తారాయన!
శాస్ర్తీగారు సంస్కృతాంధ్రాల్లో నిష్ణాతులు. అంతేకాదు! దాదాపు మరో పాతిక ముప్ఫై భాషల్లో పరిచయం, ప్రవేశం కలవారు. అందుకే ఆయన కథల్లో అన్య భాషాపదాలు అక్కడక్కడా చోటుచేసికొంటాయి.
నిర్మల హృదయాలు, సుఖజీవనాలు, సుతిమెత్తని శృంగారాలు, మోటు సరసాలు, చెంప ఛెళ్ళుమనిపించే వ్యంగ్య భాగాలు, వెటకారాలు, వేదనలు, ఆవేదనలు, భక్తి, రక్తి, ముక్తి-మూడింటిని ముప్పేటలుగా కలిపే కలనేతలు- ఇవన్నీ అలవోకగా అగుపించే అందమైన అలంకారాలు, ఆయన కథాశిల్పానికి రంగవల్లులు దిద్దుతాయి.
కథా ప్రపంచ వినువీధిలో ఆయన ధృవతార! కథా సంవిధానంలోను, వస్తు వైవిధ్యంలోను ఆయన చూపిన చిత్ర విచిత్ర పోకడలు ఎన్నో, ఎనె్నన్నో! తెలుగు నుడికారపు సోయగాలు, సౌరభాలు, పదాల విరుపులు, మెరుపులు, శే్లషలు, ఆశే్లషలు ఆయన కథల్లో కోకొల్లలు.
ఈ నేపథ్యంలో శాస్ర్తీగారి వందలాది కథల్లో, అక్కడక్కడ కొన్నింటిని మాత్రమే, రేఖామాత్రంగా స్పృశించి తడిమి, అందలి అనుభూతుల అవగాహనకు ప్రయత్నిద్దాం!
చికిలింత కథను యిలా ప్రారంభిస్తారు శాస్ర్తీగారు.
వెంకట్రాయలు గారి భవనంలో ధనలక్ష్మి మూలుగుతూంటుంది- అని అందరు చెప్పుకుంటారు. ధనలక్ష్మి మూలుగు సంగతి దైవమెరుగును కాని- నౌకరు రంగడు మట్టుకు- ఒక్కడే కావటం మూలాన ఓపికలేనప్పుడు మూలుగుతూంటాడు. వాడి మూలుగు రాయలుకి అలవాటైపోయింది.
ఈ శైలి ఆయన స్వంతం! స్వార్జితం! దానిననుకరించడం, అధిగమించడం అసాధ్యం! ఆయన శైలి అపురూపము, అనన్య సామాన్యము. అనితరసాధ్యం!
అలాగే ఆయన కథల్లో శిల్పం చాలా చిత్రంగా వుంటుంది. ఆ శిల్పాన్ని చవిచూడాలంటే- కనుకలి, చెంగల్వకథలు చదవాలి!
కంది చేలో తిరుగాడుతున్న, అల్లవారి ఆడపడుచు, పైటచెంగు చెదిరేసరికి నర్సయ్య బెదిరి, వచ్చీరాని కొమ్ములతో కోరాడు. దాంతో పిల్లదాని తండ్రి కరణంగారికి ఫిర్యాదు చేస్తే- ‘‘పోనిద్దూ బావా!.. ఏదో కుర్రతనం..!’’ అని అన్నారేగాని, ఆ తర్వాత ‘‘పుటక మారినా బుద్ధులు మారలేదు. నాయనా! నలుగురిలో ఔననిపించుకోవాలి’’ పెళ్లీ పేరటం కావాల్సినవాడివి. ఇలా పవరళ్లు తొక్కితే ఎవరిస్తారురా నీకు పిల్లను?’’ అని నయానా భయానా చెప్పి చూశారు.
ఇలా కథంతా చదువుకుంటూ పోతే- ఈ నర్సయ్య- కరణంగారి గారాల ముద్దుబిడ్డడేమోననే భ్రమలో పడిపోతాం! తీరా చూస్తే- నర్సయ్య- కరణంగారి వెల్లావుకు పుట్టిన కోడెదూడ! నోరులేని ఆ జీవాన్ని స్వంత బిడ్డలా కరణంగారు చూసుకున్నవైనం- ఈ కథలోని అత్యద్భుత శిల్పం!
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

సోమంచి రామం