వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన దుఃఖాన్ని చాలా అందంగా, గాంభీర్యంగా మలచుకున్నాడు.
అదో పొగడ్తలను తెచ్చిపెట్టింది.
రాజారావు మళ్లీ పెళ్లిచేసుకోలేదు. చేసుకోకపోవటానికి కారణం కేవలం భార్యమీద ప్రేమే అనుకున్నారు అందరూ. కాని అసలు కారణం తనకు తాను అర్థం కాని అసంగ్థితతే. అలా సృష్టించుకున్న ఒంటరితనంలోంచి అతన్నుండి వెల్లువగా కవిత్వం పుట్టుకువచ్చింది.
వయసు మళ్లింది. ఆ చివరిరోజుల్లో తన రచనల్లో నిజాయితీగా వుండటానికి ప్రయత్నించాడు. తాను భార్యను ఎలా హింసించింది, తిట్టింది, కొట్టింది రాసుకున్నారు. తనలోని క్రూరత్వాన్ని ఒప్పుకున్నాడు.
రచయిత కేవలం గొప్పగా రాయడమే కాదు. గొప్ప హృదయంతో జీవించ గలగాలి. ఈ సందేశాన్ని అద్భుతంగా అందజేస్తుందీ కథ.
పద్మరాజుగారిలో గొప్ప పరిశీలనా శక్తి వుంది. ఏ చిన్న అంశం తీసుకున్నా.. దానికంత ప్రాధాన్యత ఇవ్వనవసరంలేదులే అనుకుంటున్నట్లు క్యాజువల్‌గా వ్రాయరు. చిన్న అంశానికయినా సరే కష్టమైన రూపురేఖలు ఇవ్వటానికి శ్రమపడతారు.
ఆయన వాడే ప్రతి పదం కూడా శిల్పంలా తయారుచేసి మలచినట్లు కనబడుతుంది గానీ, ఉదాసీనత కనబడదు.
ఉద్వేగాలు, కూలీజనం అన్న కథలు చిన్నవే అయినా విలక్షణమైనవి.
ఉద్వేగాలు కథలో..
‘‘ఉద్వేగాలంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని సంఘ మర్యాదకీ నాగరికతకీ తగింది మాత్రంకాదు. పెద్దవాళ్లెవరయినా కంటనీరు పెట్టుకుని ఏడిచారంటే నాకు రోత..’’ అని చెబుతూనే శేషి అనే పాత్ర అయిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎంత చిలిపిగా ఉండేదో, ప్రౌఢగా మారినప్పుడు శేషుగా రూపొంది జీవిత ఘటనలను ఎలా ఎదుర్కొందో, భర్తపోయాక, వయసుచ్చాక శేషప్పగా మారి జీవితంలో ఎలా ఎదిగిందో.. ఆయా సన్నివేశాలను దర్పణంలో చూపించినట్లు రమణీయంగా చిత్రిస్తారు రచయిత.
కూలి జనం కథ అట్టడుగు వర్గాల వారికి చెందినది. పని పాటలు చేసుకుంటున్నప్పుడు వారు మాట్లాడే సహజమైన యాసతో కూడిన బాధ, వాళ్ళలో వాళ్లు పరిహాసాలు, ఆ పరిహాసాల ఫలితంగా అంతలోనే ఉద్రేకాలు, ముసలయ్య తన భార్య అయిన రత్తిని అనుమానించి చావగొట్టడం, మిగతావారు అతడ్ని శాంతింపజేయటానికి ప్రయత్నించటం, ఆ రోజు రోడ్డు తవ్వకాలు పూర్తయ్యాక అందరూ త్రాగి, ఆ మత్తులో జోగుతూ లొల్లాయి పదాలు పాడటం..

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

కొమ్మూరి వేణుగోపాలరావు