వినమరుగైన

అత్త గారి కథలు (భానుమతీ రామకృష్ణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కోరికలు ఆత్మస్వరూపం తెలుసుకోలేక అజ్ఞానంతో లొంగిపోయేవారిని వేశ్యలాగా లొంగదీస్తాయి. లోభి దగ్గర పసిపిల్లలాగా మారాం చేస్తాయి. ఆత్మజ్ఞానం గలవాడి దగ్గర భయపడి హద్దుల్లో వుంటాయి. ప్రతి మానవుడు తనలో వున్న ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆత్మయొక్క సలహాననుసరించి ముందుకు పోగలిగితే ప్రపంచకంలోని సుఖదుఃఖాలకు కారణమైన కోరికలను కొరతలను సులభంగా జయించగలదు.
నవ నాగరీకురాలైన కోడలు, సత్యకాలం నాటి అత్తగారిని గురించి చేసిన సాహిత్య సృష్టి చూశాం. ఆవిడ రచనలకు పరాకాష్టనందుకుంది రుూ అత్తగారి కథలలోనే.
చిత్రకారుడు కుంచతో ఏ గీత గీస్తే ఒక ఆకారం పూర్తి అవుతుందని గ్రహించినట్టుగానే -ఏయే సంభాషణల వలన ఏయే వర్ణనల వలన ఒక మనిషి మనస్సు ఆకారం పూర్తిగా మూర్తికడుతుందో ఆవిడకు తెలుసు.
నిజమైన మనుషుల్ని చూసి వారి ఆకారాలు అంతరాంతరాలు మాటలలో పొగడగల అపురూపమైన ప్రతిభగల రచయితలు బహుకొద్దిమంది ఉన్నారు. వారిలో అగ్రస్థానంలో నిలచిన వ్యక్తి అత్తగారి కథలు సృష్టించిన పద్మశ్రీ భానుమతి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సమాప్తం

- మల్లాది సూరిబాబు 90527 65490