వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు తెలుగులో సంస్కృతానికి భిన్నమైన సాహిత్య సిద్ధాంతం కూడా లేదు. దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర వున్న తెలుగు సాహిత్యంలో ఒక యుగాన్నో, ధోరణినో, కావ్యాన్నో పరిశీలిస్తూ, విశే్లషిస్తూ ఎవరూ విమర్శ రాయలేరు.
కవుల చరిత్రలూ, వ్యాఖ్యానాలూ మాత్రమే సాహిత్య విమర్శగా చెలామణి అవుతుండేవి. ముఖ్యంగా ఒక కావ్యాన్ని తీసుకొని అందులోని వస్తువులనూ, రూపాన్నీ విశే్లషిస్తూ, వాటిపరస్పర సామంజస్యాన్ని చర్చిస్తూ, ఆ కావ్య ఉద్దేశాన్ని నిరూపిస్తూ విమర్శలు రాసే సంప్రదాయం అప్పటికింకా ప్రారంభం కాలేదు. కవిత్వ విమర్శ మొత్తం కావ్యం ప్రాతిపదికగా కాకుండా ఒక పద్యమో, శ్లోకమో ప్రాతిపదికగా సాగుతూ వచ్చింది. ఈ ధోరణికి స్వస్తి చెప్పి ఒక కావ్యాన్ని సమగ్రంగా విశే్లషించే విమర్శకు రామలింగారెడ్డిగారు కవిత్వతత్త్వ విచారంలో బాటలు వేశారు. అంతేకాకుండా ఒక ధోరణి కవిత్వాన్ని చర్చించి విలువకట్టే సంప్రదాయాన్ని కూడా వారే ప్రారంభించారు. ఈనాడు ఆ బాట ఎంతో విశాలమైంది. ఆ బాటలో ఎందరో సాహిత్య విమర్శకులు నడుస్తున్నారు. నడుస్తూ ఆ మాటను మరింత విశాలం చేస్తున్నారు.
ఇంగ్లండులో చదువుకుంటున్నపుడూ, ఆ తరువాతా రామలింగారెడ్డిగారు అంతవరకూ వచ్చిన పాశ్చాత్య విమర్శను శ్రద్ధగా అధ్యయనం చేశారు. సమాజానికీ, సాహిత్యానికీ మధ్య వున్న లేదా ఉండవలసిన సంబంధాన్ని అవగతం చేసుకున్నారు. ఆ తరువాతనే వారికి భారతీయ అలంకారశాస్త్రంలోని అసమగ్రత తేటతెల్లంగా అర్థమైంది. రామలింగారెడ్డిగారు ఇంగ్లండులోనూ, ఇతర యూరోపియన్ దేశాలలలోనూ పారిశ్రామిక విప్లవం సృష్టించి పరిణామాలను గమనించారు.శతాబ్దాలుగా కొనసాగిన ఫ్యూడల్ సంస్కృతి పతనం కావటం, దాని స్థానంలో అంతకంటె అభ్యుదయకరమైన బూర్జువా సంస్కృతీ, ప్రజాస్వామ్య భావాలూ ఆ దేశాలలో విస్తరించటం రామలింగారెడ్డిగారిని ఆకర్షించింది. అలాంటి ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాస్వామ్య భావాలను తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశపెట్టాలని వారు కవిత్వతత్త్వ విచారంలో ప్రయత్నించారు.
పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతం ప్రభావం అందులో ఉండటం చేత ఆ గ్రంథం అనేక ప్రతి విమర్శలకూ, అపవాదులకూ గురికావలసి వచ్చింది.
ఫ్యూడల్ సామాజిక విలువల్ని సాహిత్యంలో పరిరక్షించే ఒక చిన్న పండిత వర్గం వారిని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న అసంఖ్యాక సాహిత్యాభిమానులు దాన్ని సాదరంగా ఆహ్వానించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

వల్లంపాటి వెంకట సుబ్బయ్య