వినమరుగైన

వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీగారు పునర్ముద్రణ సమయంలోనైనా రాళ్లపల్లివారిపై వేసిన నింద తొలగిస్తారని భావిస్తాను. ఇంకను శర్మగారి ఆఖరి ఉపన్యాసంలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. చూడండి.. తెలుగు ఛందస్సులలో నెల్ల చిన్నది యగు ఆటవెలది నితడు పరిగ్రహించెననవచ్చును. కందములు, తేటగీతి మొదలగు పద్యములు నితడు వాడినాడుగాని వానిలో చాలావరకు, ఈ చెక్కిన చక్కదనము, ఈ లగువు, ఈ బిగువు లేదు. కనుక రాళ్లపల్లివారి భావాలను గోపిగారు సమ్మరైజ్ చేయడంలోనే కన్‌ఫ్యూజన్ వుంది. రాళ్లపల్లి వారి వేమనపై నార్లవారి పుస్తకంతో కలిపి ఇలాంటి నెరసులు ఉన్నా, తెలుగు విమర్శలో చరిత్ర సృష్టించిన గ్రంథం వేమన. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు ఒక కవి జీవితాన్నీ కవిత్వాన్నీ విశే్లషించి వివేచించి చూపి రాళ్లపల్లివారు వేమన గ్రంథం ద్వారా పాశ్చాత్య విమర్శ ప్రయోగాల్లో కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శ పద్ధతికి సమగ్రోదాహరణాన్ని సంతరించి ఇచ్చారు. కోల్‌రిజ్ బయోగ్రాఫియా లిటరేరియా స్థాయిలో తెలుగులో నిలువ గల గ్రంథం ఇది.
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి మూల్యాంకనం ప్రత్యక్షర సత్యం. తెలుగు విమర్శ ఉన్నంతకాలం, వేమన కవిత తెలుగు నేల వెలసినంతకాలం రాళ్లపల్లి వారి గ్రంథం వేమన చిరంజీవిగా నిలుస్తుంది.ఇది నిరాధార నింద గనుక సమాధానం చెప్పాలి. శర్మగారు పలికిన పలుకులు గమనించండి. వేమన తత్త్వ విచారములను ముఖ్యముగా జెప్పుటకు అప్పుడప్పుడు కందములను గీతములను ఉపయోగించెనని ఊహింప వీలున్నదిగాని బలమైన హేతువు లభించువరకును ఇప్పటి కంద గీతులలో ననేకము అతనిని గావని నేను నమ్ముచున్నాను.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సంపూర్ణం

కొలసాని సాంబశివరావు