వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర సాహిత్య వీధులు ఆధునిక సాహిత్య చరిత్ర రచనలో మొదటిది. 1842 మేలో ఈ పుస్తకం వచ్చింది. ఆధునిక సాహిత్యం ఆవిర్భవించి అప్పటికింకా అర్థశతాబ్ది కూడా కాలేదు. ఆధునిక సాహిత్య వికాసానికి మహోజ్జ్వల కాలమది. ఆ కాలపు సాహిత్య వికాసానికి ప్రత్యక్షసాక్షి కురుగంటి సీతారామాచార్యులు. ఆధునిక సాహిత్యాభివృద్ధి క్రమంలో భాగస్వాములైన కవులతో, రచయితలతో ఆయనకు సన్నిహిత స్నేహ సంబంధాలున్నాయి. ‘్ధరావాహికంగా ప్రవహించు / జీవత్ - సాహిత్యానికి చరిత్ర వ్రాయటం కష్టమని తెలిసి కూడా పట్టుదలతో సీతారామయ్య ఈ పనిచేశారు. 1942 నుండి 1949 వరకు లభించిన అదనపు సమాచారాన్ని కలుపుకొంటూ మొదటి ముద్రణలోని దోషాలను సవరించుకొంటూ పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు సహాయంతో నవ్యాంధ్ర సాహిత్య వీధులు ద్వితీయ ముద్రణను 1949లో తీసుకొని వచ్చారు కురుగంటి. ఈ ముద్రణలో హనుమంతరావుగారికి సహ రచయిత గౌరవమిచ్చారు.
నవ్యాంధ్ర సాహిత్య వీధులు రచనకు తక్షణ ప్రేరణ 1940లో బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ నవ్య సాహిత్య పరిషత్తు సమావేశాల సందర్భంగా చేసిన అధ్యక్షోపన్యాసం. ఈ ఉపన్యాసంలో ఆయన, గురజాడ నుండి సమకాలం వరకు వచ్చిన కవులను, సాహిత్య ప్రత్యేకతలను ప్రస్తావించారు. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని గురించి, గురజాడ ఆవిష్కరించిన రసగీత రచనా సంప్రదాయాన్ని రాయప్రోలు అందుకొని నవ్య కవితా మార్గాన్ని బలపరచిన పద్ధతిని గురించి చెప్పారు. నవ్య సాహిత్యమంటే కావ్య నిర్మాణానికి, కొత్త వృత్తాలలో, వాడుక భాషలో గేయాలు వ్రాయటానికి, శిల్పానికి, భాషా చరిత్ర పరిశోధనలకు సంబంధించినదని స్పష్టం చేశారు. నవ్య సాహిత్యంలో ప్రధమ దశలో భావ కవిత్వం, రెండవ దశలో కథ అభివృద్ధి చెందాయని, ఈ సమయంలోనే కట్టమంచి వారి కవిత్వతత్త్వ విచారం విమర్శ పధాలలో గొప్ప దృక్పథం కలిగించిందని, మూడవ దశలో చిత్రకథ, ఆంధ్ర చరిత్ర రచన అభివృద్ధి చెందాయని, నాల్గవ దశలో జాషువా, శ్రీశ్రీ కవిత్వ రచన ప్రారంభించారని, ఐదవ దశలో చలం విజృంభించి రచించాడని, నాయని సుబ్బారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, సురవరం ప్రతాపరెడ్డి మొదలైనవారు ఈ కాలంలో గొప్ప రచయితలని - ఇలా కవులను, శాస్తక్రారులను, చరిత్రకారులను, కళా సాంస్కృతిక నిర్మాతలను ప్రస్తావిస్తూ విశ్వనాధ నవ్య సాహిత్యాన్ని ఈ వ్యాసంలో సమీక్షించారు.
నవ్య సాహిత్యంలో వికసించిన ఖండకావ్యం, నవల, రాజకీయ వ్యాసాలు, నాటకం, చిన్నకథ, చిన్న నాటకం, హాస్యరచన మొదలైన ప్రక్రియలను ఆయన పరిచయం చేశారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కాత్యాయనీ విద్మహే