వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందులో పేర్కొనబడిన రచయితల జాబితా, ప్రక్రియల వారీగా రచనల జాబితా తయారుచేస్తే రుూ 50, 60 ఏళ్ల కాలలంలోనే ఆ మార్గంలో కృషిచేసిన రచయితలు ఎంతమంది విస్తృత పధంలో పడిపోయారో, రచనలెన్ని అందుబాటులో లేకుండా పోయాయో తెలుస్తుంది. ఆయా రచయితలను, రచనలను గురించి సమాచారాన్ని అనే్వషించి భద్రపరిచే పనికి, విశే్లషించి విలువకట్టేపనికి పరిశోధకులు పూనుకొంటే నవ్యాంధ్ర సాహిత్య చరిత్రను సజీవంగా నిలుపుకోగలిగిన అవకాశంవుంది.
అయితే సమాచారం ఒక్కటే చరిత్ర కాదు. ఆ సమాచారం దానిని నమోదు చేస్తన్న వ్యక్తి మనస్సులో పరావర్తన చెంది ఆవిష్కృతమవుతాయి. కనుక దానికి ఒక రంగు, రుచి ఏర్పడుతుంది. అది విషయ వ్యాఖ్యానంలో ప్రతిఫలిస్తుంది. వ్యక్తిమనసు తను జీవిస్తున్న కాలం నుండి, తన కాలానికి చెందిన మానవ జీవిత సూత్రాలనుండి రూపొందుతుంది. కురుగంటి సీతారామయ్య జీవించి దేశ కాలాలు భౌతిక హేతు దృక్పథంతో సంప్రదాయాన్ని ప్రశ్నిస్తున్న, నిరసిస్తున్న, తిరస్కరిస్తున్న దేశకాలాలు. ఈ సంఘర్షణలో సీతారామయ్య- సంప్రదాయం వైపు నిలబడ్డ వ్యక్తి కనుక ఆయనది సంప్రదాయ దృక్పథం. నవ్యాంధ్ర సాహిత్య వీధులులో ఆ సంప్రదాయ దృక్పథ పాక్షికత చోటుచేసుకొని దానికిఒక ‘విలువ’ను ఏర్పరచింది. నవ్యాంధ్ర సాహిత్యాన్ని సంప్రదాయ భూమిక నుండి వ్యాఖ్యానించటం దాని పరిణామ ఫలితమే. నవ్యాంధ్ర సాహిత్య వీధులు ద్వితీయ భాగంలో వేదం, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు, మోక్షం, వర్ణాశ్రమాలు, పురాణగాధలు, అవతారాలు, విగ్రహారాధనం, చతుర్విధ పురుషార్థాలు, గోపవిత్రత మొదలైన వాటిని సంప్రదాయ మూల సూత్రాలుగా నిర్థారించి వివరించారు. ఈ క్రమంలో వ్యక్తి స్వాతంత్య్ర భావనను సీతారామయ్య నిరాకరించారు. (ద్వి.్భ:పు.254, 255) ఆధునికతకు మూలసూత్రమైన వ్యక్తి స్వాతంత్య్ర భావనను నిరాకరించారు. కనుకనే దానిని కేంద్రంగా చేసుకొని వచ్చిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలపట్ల, రచయితలపట్ల సీతారామయ్య సానుభూతిని చూపలేకపోయారు.
వీరేశలింగం పంతులును నవ్యయుగ ప్రారంభానికి సంధ్యాదేవత అంటూనే సంప్రదాయ విమర్శచేసే పంతులుగారి వ్రాతలు ఆంధ్ర దేశంలో పెద్దలకూ, పిన్నలకూ మధ్య ఒక అంతరం కలుగచేసినవని బాధపడ్డారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కాత్యాయనీ విద్మహే