వినమరుగైన

ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణేతిహాస కర్తలలో ఇట్టి భావావేశము గల వ్యక్తి లేడు. ఈయన శృంగారము ప్రబంధ శృంగారము వంటిది కాక జీవేశ్వరైక్య ప్రతిపాదకమగు, ఆధ్యాత్మిక శృంగారమగుటచే ఆరస రాజము భాగవతమున పరమ పవిత్రతను దాల్చినది’’ అని పోతన గారి పట్ల తన ఆదరాభిమానాలను చాటుకొన్నారు. శ్రీనాథయుగాన శ్రీనాథ పోతనల తర్వాత పేర్కొనదగ్గ కవులలో జక్కన, అనంతామాత్యుడు, గౌరన, దగ్గుపల్లి దుగ్గన, పిల్లలమర్రి పినవీరన, దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంకటనాధుడు, పిడుపర్తి సోమన, నంది మల్లయ- ఘంట సింగయలు, కొఱవి గోపరాజు, వెనె్నలకంటి అన్నయ్య వంటివారు ముఖ్యులు.
ఆంధ్ర సాహిత్య చరిత్రలో చిట్టచివరి యుగం శ్రీకృష్ణదేవరాయల యుగం. దీంతో గ్రంథం పూర్తవుతుంది. ఇక దక్షిణాంధ్ర నాయక రాజుల యుగం క్షీణయుగం లేక అంధకార యుగం, ఆధునిక యుగం ఇందులో లేవు. ఆంధ్ర సాహిత్య చరిత్ర మీద ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. పెక్కుమంది సాహితీపరులు తమ దృక్పథంలో ఆంధ్రసాహిత్య చరిత్రను రచించారు. కానీ ఇంత విస్తృతంగా, ఇంత విపులంగా, పఠన పాఠనాదులకనుగుణంగా, విద్యార్థులకంత యుపయుక్తంగా, సాహితీపరులకు అత్యంత ప్రయోజనకారిగా, ఆంధ్ర సాహిత్య చరిత్రను రచించిన ఘనత ఒక్క పింగళివారికే దక్కుతుంది. 1979వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించి పింగళివారిపట్ల తమకుగల గౌరవాభిమానాలను చాటుకొన్నారు. పింగళివారు కవి, విమర్శకులు, సాహితీపరులు, దార్శనికులు, సమస్తమూను. ఒక్కమాటలో చెప్పాలంటే ‘చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీగారి శిష్యులు పింగళివారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సంపూర్ణం

ధూర్జటి వేంకట బాలాజీ