వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నిరూపించుకొనే ధోరణిలో ఆరుద్రగారు- రాజకీయాలవల్ల వివిధ రంగాలలో పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. విభిన్న సంఘటనలే జరిగినా, అవి ఒక చారిత్రక క్రమంలోనే ఉంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుగాని యుగం ఉండదు’ అంటారు. దీన్నిబట్టి చూస్తే రాజకీయ పరిణామాలను బట్టి యుగ విభజన చేయవలసి వుంటుంది. కాని, ఆరుద్రగారు కొంచెం పూర్వుల మాదిరిగానే రాజు, రాజవంశాలపేరిట చాళుక్య యుగం ఇత్యాదిగా యుగ విభజన చేశారు. పైగా ఆయన రాజవంశాల పేరు మీదుగా యుగాలను పేర్కొనడం రివాజే. పాశ్చాత్య చరిత్రలలో ఎలిజిబెతియన్, జాకోబిన్, విక్టోరియన్, ఎడ్వర్టియన్ మొదలయిన యుగాలు సుపరిచితమయినవే అంటూ పాశ్చాత్య రివాజును తాను అనుసరించినట్టు సూచించారు.
అసలుకు మనం ఈనాడు అనుసరిస్తున్న చరిత్ర రచనా విధానం పాశ్చాత్యులనుంచి దిగుమతి చేసుకొన్నదే. అందువల్ల వారు పాటించిన యుగ విభజన విధానాన్ని పాటించటం మనకు రివాజయింది తప్ప, దేశీయమయిన యుగభావనకు అనుగుణమయింది కాదు. పాశ్చాత్యులు ఏజ్ అన్నదాన్ని మనం యుగంగా అనువదించుకొన్నాం. కాని, దేశీయమయిన, యుగభావన, పాశ్చాత్యమయిన ఏజ్ కానె్సప్ట్ ఒక విధమైనవి కావు. రెండింటికి పొంతన కుదరదు. అదట్లా ఉంచి పాశ్చాత్యమయిన ఏజ్ కానె్సప్ట్‌కు పర్యాయమయిన యుగం అంటూ తప్ప సాహిత్య చరిత్ర రచన చేయటానికి వీలు లేదు? మరొక దేశీయమయిన పద్ధతిని మనం నిష్ఫన్నం చేసుకోవటానికి వీలులేదా? వివిధ ప్రక్రియల వికాస ప్రాధాన్యంతో సాహిత్య చరిత్ర రచన చేసుకోలేమా? కవిత్వమనేది కల్లూరి వెంకట నారాయణరావుగారు రచించిన ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహంలో ఈ భావన పాక్షికంగా మాత్రమే కొంతవరకు కన్పిస్తుంది. పైగా అది సంగ్రహం గూడా. కాగా, ఆరుద్రగారు పాశ్చాత్యల నుంచి దిగుమతి అయిన రివాజునే పాటించారు తప్ప దేశీయ విధానానికి ప్రయత్నించినట్టు కన్పించదు. అయితే ప్రగతివాద కవిగా మార్క్సీయ భావజాలంపై గాఢమయిన విశ్వాసంగల ఆరుద్రగారు రాజుల, రాజవంశాల పేరిట ఒక రివాజుగా యుగ విభజనను పాటించడం ఒక విచిత్రమే మరి.
సామాజిక జీవితంలో మాదిరిగానే ఒక దేశపు సాహిత్య జీవితంలోనూ ఒక ప్రధాన రచనా స్రవంతి అనవరతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే, మధ్య మధ్య విభిన్న కాలాల్లో ప్రధాన స్రవంతిని కాదనే రకరకాలైన రచనా రీతులు, రచనలు వస్తూ ఉంటాయి.
సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య