వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం పల్లెపట్టులకు ఆటపట్టు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంబంధించి సాహిత్యాన్ని జానపద సాహిత్యమని స్థూలంగా చెప్పవచ్చు. జానపద సాహిత్యం శిష్ట సాహిత్య సౌధానికి పునాది వంటిది.
శిష్ట కవుల రచనలు మహానదులుగా పరిగణింపబడితే జానపదుల రచనలు సెలయేరులుగా గుర్తించబడ్డాయి. రాజాస్థానాల్లో వెలువడ్డ సాహిత్యానికి రాజులు, పండితులు రక్షకులైతే, పల్లె ప్రజల గుండెల్లో నుంచి ఉబికి వచ్చిన సహజ సిద్ధమైన సాహిత్యనికి ప్రజలే పోషకులు, రక్షకులు.
జానపద సాహిత్యం చాలాకాలం ఆదరణకు నోచుకోని సాహిత్యంగా మరుగున పడి ఉన్నది. కాలక్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొంతమంది సహృదయులు జానపద సాహిత్యాన్ని సేకరించి, విశే్లషించి వివరించటం ప్రారంభించారు.
అలాంటివారిలో పంచాగ్నుల ఆదినారాయణశాస్ర్తీ, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, నేదునూరి గంగాధరం, చిలుకూరి నారాయణరావు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, హరి ఆదిశేషువు, పండిత అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు ప్రాతఃస్మరణీయులు.
జానపద సాహిత్యానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గౌరవాన్ని కల్పించి పరిశోధన సల్పి, ఎంతోమంది జానపద సాహిత్య పరిశోధకులకు మార్గదర్శకులైనవారు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు.
బిరుదురాజు రామరాజుగారు వరంగల్ తాలూకా దేవునూరు గ్రామంలో 16-4-1925న జన్మించారు. మడికొండ గ్రామంలో పెరిగారు. పుట్టిన పెరిగిన వాతావరణం వీరి జానపద సాహిత్య సేకరణకు, పరిశీలనకు ఎంతో ఉపకరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ పట్టం నిమిత్తం వీరు సమర్పించిన పరిశోధనా నిబంధమే తెలుగు జానపద గేయ సాహిత్యము. 1958లో ప్రథమ ముద్రణ పొందిన ఈ గ్రంథం ఇప్పటికి మూడుసార్లు ముద్రితమైంది.
జానపద సాహిత్య సేకరణం వ్యయ ప్రయాసలతో కూడిన పని. అయినా ఇష్టమైన విషయం కావటంతో రామరాజుగారు ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో జానపద గేయాలను సేకరించారు. వేలకొద్దీ గేయాలను సేకరించిన వీరు కేవలం పదవ వంతు మాత్రమే పరిశోధన గ్రంథంలో చేర్చగలిగానని తెలిపారు.
గేయ సేకరణ సమయంలో కొంతమందిని బుజ్జగించి, మరికొంతమందిని బ్రతిమాలి, కొంతమందికి లంచమిచ్చి, ఇంకా కొంతమందిని బెదిరించి కూడా విషయాలను రాబట్టటం జరిగిందని వాస్తవ స్థితిని తెలియజేశారు. తెలంగాణాకు సంబంధించిన గేయాలనే ఎక్కువగా సేకరించగలిగానని తమ సేకరణ పరిమితిని కూడా స్పష్టం చేశారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

గుమ్మా సాంబశివరావు