వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్యుడే ప్రశ్న- సామాన్యుడే జవాబు. మాయలు లేవు- మమతలు పొంగిపొర్లాయి గీతకు భిన్నంగా.
జీవితం మథియించి
పాప పంపకం నుండి పద్మాలు పుట్టించి
కార్మిక స్వర్గాన్ని కలగన్న బోల్షివిక్ రష్యా
లెనిన్ తపస్సు స్టాలిన్ సేద్యం-
దానివల్ల పెట్టుబడి కూటాలు కట్టకడుతున్నాయి
సప్త కంకాళాలు మేలుకొంటున్నాయి
కార్మికులు కర్షకులు తాడితులు పీడితులు
కెరటాలుగా పొంగి తిరగబడుతున్నారు
ప్రపంచం సోషలిస్టు సమాజం కోసం పరిపక్వంగా ఉంది. కోటి గొంతులు సోషలిస్టు సమాజం కోరి పోరాడుతున్నాయి.
పతితులు, భ్రష్టులు, బాధార్పదష్టులు, శనిదేవత రధచక్రపుటిరుసులలో పడి నలిగిన దీనులు, దగాపడిన తమ్ములు భూకంపం పుట్టించే విప్లవాల యుగం ప్రపంచాన్ని ఆవహించింది. దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు- ద్రోహాలను తూలగొట్టి, దోషాలను తుడిచిపెట్టి జనావళికి శాంతిపూచే స్వప్నం నిజమవుతుందని సోషలిస్టు స్వర్గం రుజువవుతుందని మహాప్రస్థానం సమస్తపీడిత జాతికి నమ్మకాన్నిచ్చింది ఈలోకం శ్రామిక జాతిదేనని వారి రాజ్యం వారే ఏలుకోవాలని’’ ప్రకటించింది. సోషలిస్టు నిర్మాణంలో దూరే దొంగల్ని పట్టుకోవాలని నాడే హెచ్చరించింది.
మహాప్రస్థానం సాహిత్య చరిత్రలో వచ్చిపోయిన కావ్య విశేషం కాదు- అది సాహిత్య చరిత్ర గతిని, 20వ శతాబ్దాన్ని మార్చివేసిన శ్రామిక సాహిత్య సంకల్పం- నిబద్ధతకు నిదర్శనం. వస్తువులో సామాన్యుని ఆశే్లషించిన సంస్కారం ‘పతితుల్ని, భ్రష్టుల్ని’ భుజాన ఎక్కించుకున్న యుగచైతన్యం- కన్నీటిని విప్లవీకరించిన విప్లవ పోరాటం-
మహాప్రస్థానం 20వ శతాబ్దం రెండో భాగాన్ని ఆవహించింది-యువతరాన్ని కవిత్వీకరించింది- పద్యాన్ని అసందర్భం చేసి అప్రాసంగీకంగా మార్చింది. లోకం బాధ కావ్యం బాధగా సంస్కారాన్నిచ్చింది- భాష, భావం, ఆవేశం, అనుభూతి అన్నీ ప్రజాస్వామికం అయ్యాయి. దొంగలు దొంగలుగా ప్రజలు వీరులుగా, చరిత్రలు దుర్మార్గంగా, జీవితాలు దోపిడీలుగా, సమాజాలు వర్గాలుగా, అనుభూతులు సమిష్టి సంస్కారాలుగా, కవిత్వం ప్రజాపర రాజకీయంగా, చైతన్యం యుగస్వభావంగా మార్చిన యుగజ్ఞానం మహాప్రస్థానం.
మహాప్రస్థానం 20వ శతాబ్ద సాహిత్యానికే కాదు రానున్న శతాబ్దాలకు శీర్షికగా సామాన్యుల సంఘటిత స్వప్నాల సంస్కార పతాకగా నిలిచిపోగలదు- పీడకులు పీడితులు సమాజంలో వున్నంతకాలం మహాప్రస్థానం కావ్య ప్రపంచంలోనేగాక వాస్తవ జగత్తులో కూడా సామాన్యుల్ని సంఘటితపరిచే పీడితుల కావ్య ప్రకాశంగా జాజ్వల్యమానంగా ఎర్రబావుటా నిగనగలుగా వెలుగుతూ వుండగలదు- అలజడి జీవితాలకు, ఆందోళిత ఊపిర్లకు, తిరుగుబాటు వేదాంతంగా మహాప్రస్థానం విప్లవ శంఖం పూరిస్తూనే వుండగలదు.

-అయపోయంది

-జ్వాలాముఖి