వినమరుగైన

నూతిలో గొంతుకలు -ఆలూరి బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెదిరిన భావాల సందడిలో అతడు ఒక్కోసారి తడబడి సుడిబడి అది అర్థమయ్యే తేటతెలుగా లేక అర్థంకాని దేవభాషా అదా ఇదా ఏదో ఒకటి- ఏదైనా స్ఫురించేది ఏదైతే అది చేతికి తీసుకుని వుండొచ్చు. ఎందుకంటే కావ్య పీఠికను అప్పటి కవులకు విభిన్నంగా సరళమైన తెలుగులో పేరు పెట్టాడు గనుక. కావ్యంలోని ఆ శైలీ సంగతులూ మనల్ని ఒక చోట స్థిమితంగా కూచోనివ్వని అస్థిమితాన్ని కలిగిస్తాయి. అతనిదే అయిన ప్రత్యేక శైలి ఎవరితోనూ పోలికలేనిది.
బైరాగి నూతిలో గొంతుకలు వినిపించేనాటికి సాధించిన పరిణతిమీంచి నిరాశా, అస్థిరతా ఎందుకు వచ్చాయంటే ఆ మార్పుకి కారణం అప్పటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎట్లా అంటే పీడిత వర్గాల ఆశలకి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినవారు అసలు స్వతంత్రం వచ్చిందా లేదా అని సందేహంలో పడిపోయారు. త్యాగమొకరిదీ ఫలితమొకరిదీ అయింది. దేశంలో ఎక్కడా ఏ మార్పూ లేదు అట్టడుగు వర్గాల్లో. ఈ పరిస్థితినే శ్రీశ్రీ సాధించిన దానికి సంతృప్తిని చెంది ఇదే విజయమనుకుంటే పొరపాటని నొక్కి చెప్పాడు. సరిగ్గా అటువంటి పరిస్థితికే త్యాగధనులయినవారంతా కలతపడ్డారు. బైరాగి సైతం ‘‘ఆక్రోశించి శపించే వ్యాసుడు లేడు’’ మునుపటిలాగా అని వేదనపడుతూ మానవ సంఘం పెంచిన పాపపంక ప్రక్షాళన జరిగే సుదినాన్ని గురించి కన్న కలలు సహస్ర శకలాలయ్యాయి. దేశం బయటి పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. నాలుగు కోట్ల ప్రాణాలను బలికొన్న చరిత్రలోకెల్లా విధ్వంకరమైన రెండవ ప్రపంచ యుద్ధం వెంట మరో యుద్ధం రానున్నదా అన్న భయాందోళనలు రెకెత్తించే ప్రచ్ఛన్నయుద్ధం మానవతావాదుల సునిశిత హృదయాలను కలవరపెట్టింది. ఇటువంటి మానసిక పరిస్థితిలో పరస్పర జీవిత వాస్తవాలకు బైరాగి హృదయస్పందన నూతిలో గొంతుకలు.
బ్రతుకు చీకటిలో దారితెన్నూ తెలీక ఒంటరిగా పయనిస్తున్న మానవుని ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలు’ ఈ కావ్య ఇతివృత్తం. టి.యస్.ఇలియట్ వేస్ట్‌లాండ్. యూరప్ నాగరికతకు వేస్ట్‌లాండ్ సంకేతమయినట్లు బైరాగి కావ్యంలో శూన్యమైనా మానవ జీవితయాత్రకు చీకటి సంకేతనంగా వుంది. బైరాగి కేవలం తనదైన పద చిత్రాల సమ్మేళన దీని వెన్నంటి ఉండే క్లిష్టతా వున్నాయి గనక తప్పనిసరిగా ఈ కావ్యాన్ని పరిచయం చేసుకోవాలంటే కొన్ని పూర్వ కావ్యాల పరిచయం అనివార్యమవుతుంది. ఈ కావ్యంలో ‘‘నేను అంటే నేను కాదు. నేటి మానవుని అనుభూతితో తాదాత్మ్యం’’ అంటున్నాడు కవి తొలి పలుకులో. ఆ అనుభూతి ఏమిటి?
‘‘ప్రతి మనిషీ ఒక గదిలో, చెదపురుగులు ప్రతి మదిలో, ప్రతి మనిషీ ఒక చెరలో, ఉరికంబం ప్రతి హృదిలో, ప్రతిమనిషీ ఒక మరలో, మరమేకులు ప్రతి ఎదలో, ప్రతి మనిషీ ఒక సెగలో, పొగగొట్టం ప్రతి మదిలో, ప్రతిమనిషీ ఒక పొదలో, బెబ్బులిరొద ప్రతి హృదిలో’’ అంటూ మానవ హృదయ స్పందన చిత్రీకరిస్తాడు.
నూతిలో గొంతుకలు ఒక యుగ సంవేదన. ఈ కావ్యంలోని ఆశనిరాశలను ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకోవలసి వుంటుంది. తన విశాల దృక్పథానికనుగుణంగా బైరాగి ప్రపంచ ప్రఖ్యాతి సాహితీకృతుల నించి పాత్రల నెన్నుకోవటం ఒక అద్భుతం. షేక్స్‌స్పియర్ హామ్లెట్, గీతార్జునుడు, దస్తవిస్కీ, రాస్కల్నికోవ్ వంటి ప్రసిద్ధ పాత్రలను సమకాలీన సంవేదనతో మిళితం చేసి మరో కవి ఆ పాత్రల ద్వారా తన భావాలను వ్యక్తం చేయటం అన్న సంప్రదాయాన్ని పాటించి విశ్వ సాహిత్య పాత్రలకు తెలుగులో ఒక కళాత్మక రూపాన్ని సంతరించిపెట్టి అజరామరుడయ్యాడు. అతడు దేశ కాల సరిహద్దులను దాటిన విశ్వకవి.
హామ్లెట్ సందిగ్థావస్తను అస్తిత్వపు పాకులాటను బైరాగి తన భావ చిత్రాల ద్వారా వ్యక్తం చేస్తాడు. హామ్లెట్ స్వగతంలో ‘‘ముందువెనుక చీకటిగల రెండు ప్రపంచాల మధ్య ముందు వెనుకలాడుతోన్న ఒక సన్నని చీలుబాట ఇరుకురుల పాపటలా రెండు సైకతాల మధ్య దృశ్యకాయ శరన్నదిలా అస్తిత్వపు పాకులాట’’ అని అంటాడు. కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు హామ్లెట్‌కు అన్ని ధర్మ సందేహాలే. ఇక కవి బైరాగికి సమాజం దారికి వస్తుందా అన్న సంశయం అడుగడుగునా వెండుతూ వచ్చింది. ఆ సంశయానికి కావ్యరూపమే నూతిలో గొంతుకలు. అర్జున విషాదయోగంలో అర్జునవిషాదం యుద్ధోన్మాదాన్ని నిరసించే శాంతి యోధుని విషాదం. ‘‘రానున్న తరాలవారు ఏమనుకుంటారు? ఈ మారణహోమంలో ఎవరికి మేలు జరుగుతుంది. బీళ్లు దున్నితే పుర్రెలు చాటుతాయి. పకపకమని పూర్వుల ఔన్నత్య గరిమను వేనోళ్ల అందరికిని,

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-శివలెంక రాజేశ్వరీదేవి