వినమరుగైన

నూతిలో గొంతుకలు -ఆలూరి బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఆ గందరగోళ స్థితిలో ప్రత్యామ్నాయ వెదుకులాటలో మానవుడిగా జీవించే హక్కు మానవుడికి నిరాకరించిన నాటి సామాజిక స్థితిలో ఆత్మహననమూ లేక అస్తిత్వ నిరూపణా అన్న కీలక ప్రశ్నాసమయంలో (అదే ప్రశ్న హామ్లెట్‌కీ, అర్జునుడికీ, నికోల్‌కీ) ‘‘శోకాల చీకటిలో మగ్గిమరిగిన’’ సోన్యాను ఆశ్రయిస్తాడు. ‘‘మృతదుర్గతి నుంచి నవజీవిత సద్గతిలోకి, థ్వాంతం నించి కాంతిలోకి భ్రాంతినించి శాంతిలోకి తోవచూపు సోనియా’’ అని వేడుకుంటాడు.
ఇకపోతే నేను బైరాగిని ఎవరితోనూ పోల్చను. పోలికలు అనర్థాన్ని తెస్తాయి అంటాడు చినవీరభద్రుడు. అసలు బైరాగి ఏం చెప్పలేదని ఏ కమిట్‌మెంట్ లేదని ఎవరు నిరసించారోగానీ వారు అసలు బైరాగి జీవితానికే కమిట్ అయ్యాడని గ్రహించలేదా, చూడండి బతుకు హామీలేవీ లేని ఇక్కడ ‘కటిక చీకటిలో దూరదృష్టి సంపాదన’ అంటూ దిక్కుతోచని స్థితిలో వున్న మానవుని ఉద్దేశించి ‘‘కనిపించవు చీకటి కూకటివేళ్ల వాటికలో చొచ్చుకుపో చీకటిలోకి చీకటి గుండెల్లోకి ఈ మంటని ఈ రాతిని ప్రత్యక్షపు కూట నీతిని తొలచి మంచి చీకటిలో చొచ్చుకుపో చిమటల దీక్షతో వానపాముల వోపికతో’’
మరో కఠినమైన పదచిత్రాన్ని చూడండి
‘‘జీవితమిట నిరాదరణ నిరాభారణ నగ్నచ్ఛావి
వికటకుటిల ఘన ఘటాచ్చట జటానట ద్భైరవి
జీవితమిట కామాతుర కంకాళ కరాళకేళి
ప్రేమేతర - మృతివాతర కపాలాల కృపణధూళి
జీవితమిట భీభతోత్సవోత్సాహ ప్రేతహేల
రుధిర మధువుగ్రోలి దైత్యులు మత్తిలినలీల
మానవ జీవితపు కూకటివేళ్ల రహస్యాలు తెలిసిన తరవాతనే కన్నీళ్ల కుంభవృష్టి తెలిసిన తర్వాతనే అసలు విషయం తెలుస్తుందని చెపుతూ మానవునకుక్రియ ఒకటే ఆరాధ్యం అంటూ సామాజిక రాజకీయ గీతాన్ని నిశితంగా పరిశీలించినవాడు గనుక మాటకూ చేతకూ పొంతనలేని పరిస్థితుల్లో ‘‘క్రియలో శృతి కుదరని ఒక భగ్నవీణ’’ అని కోపగించుకున్నాడు. మనం విస్మరించిన మన తరం మహాకవి అంటారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తొలిసారిగా.
తర్వాత చినవీరభద్రుడు ఒక వ్యాసంలో విపులంగా చర్చిస్తారు. సమకాలీనులందరూ రాజకీయ సిద్ధాంతాలతో మమేకం కాలేదు గనుక ఏ ఇజాన్ని పట్టుకు పాకులాడలేదు గనుక అతన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకువస్తే వాళ్ల వాళ్ల ఉద్యమాలకీ ప్రయోజనం ఉండదు అనక అని వివరిస్తూ జీవితసమస్యల మూలాల్ని వెతక్క, ఆ మూలాల శక్తి ఏ జీవ లక్షణంలోంచి ప్రసరిస్తుందో చూడక, పరస్పర విరుద్ధమయిన శక్తులమధ్య ఏకతని గ్రహించలేక మాటల నమ్మకాల ప్రశ్నల సందేహాల వెనక రహస్యాన్ని అర్థం చేసుకోలేక, ఎక్కడ ఆ ప్రయత్నాలు చేస్తే మనకాళ్ల కింద భూమి కంపించిపోతుందో అని. ఆ లోతుల్లోకి దిగక ఏవేవో నినాదాల్తో ప్రోగ్రామ్స్‌తో నడుస్తున్న వాళ్లంతా బైరాగి అన్నట్టు ‘సుకృతులు వారికి నా నమస్మృతులు’ అంటాడు. చినవీరభద్రుడు గీసిన ఈ భావనా చిత్రపటంలో బైరాగి ఆలోచనాధార అంతా స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పాలంటే బైరాగిని ఎరుక పొందినవాడు శిలువ మోసినవాడు పాతాళ స్వర్గలోకాలమీంచి ప్రయాణించి వచ్చినవాడు మిడిమిడి అజ్ఞానాల మోహరింపులు లేనివాడు నిజమైన కవి. అతడే కవిత్వంలో తాదాత్మ్యం చెందుతాడు. శ్రీ పి.రామకృష్ణారెడ్డి ఆగమగీతి సమీక్షిస్తూ ఒకచోట మానవగీత ఆలపించే ఒక కథనం కావాలన్న వ్యక్తి నిరాశావాది ఎలా అవుతాడు అని అతని ఆశావాదాన్ని మన ముందుంచుతారు. శ్రీ మోహన్ ప్రసాద్ తాన బైరాగి ఆత్మని పట్టుకున్నానని విశ్వాసాన్ని ప్రకటిస్తారు. కానీ ఇంకా స్పష్టం కావలసి వున్నది.
‘‘అన్నీ వున్నప్పటికీ నమ్మకమొకటిలేని యెడల బతుకు వమ్ము’’ అని బైరాగికి తెలుసు. అందుకే కొంచెం నమ్మకమివ్వమని ఆయన అర్థిస్తున్నారు నికోల్ ద్వారా. ‘‘తోవెక్కడ వెలుగు ఎక్కడ సంశయరజనిలో ఆత్మహింసల ఘోరవనిలో తోవచూపమని అడుగుతున్నారు బైరాగి’’ అని శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కావ్యానికి ఆయువుపట్టయిన ఈ ‘నమ్మకం’ గురించి చెపుతారు. శ్రీ ఎ.బి.కె అంటారు ‘‘మనలో చాలామందికి జీవిత సంపూర్ణత్వం అర్థం కాదు. మనం చూసిందే సమస్తం అనుకుంటాం. వెలుగునీడలు రెంటినీ తరచి చూడనందున సుఖంతో చలన చిత్రాలను చూచి విషాద చలన చిత్రాలని చూడలేకపోయినట్లు కావ్యాలలో ముఖ్యంగా నూతిలో గొంతుకలు వంటి సంశయ కావ్యంలో కవి ఆవేదన అర్థం చేసుకోలేం’’ అంటారు.

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-శివలెంక రాజేశ్వరీదేవి