వినమరుగైన

నూతిలో గొంతుకలు -ఆలూరి బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక బైరాగిని కలవరించి పులకరించే వడ్డేపల్లి శ్రీనివాస్ సంభాషణ ఎప్పుడు మొదలుపెట్టినా ముందుగా ‘‘మానస యజనవాటికపై మరల నేడు ముసురుతున్నది సందేహాల మదేహాంధ ఛాయ’’ అంటూ పలవరిస్తాడు. వాక్యంలో ఏదో ఒక ప్రచ్ఛాయ కదలాడుతుంది కానీ విప్పి చెప్పే శక్తి నాకు లేదు.
బైరాగి కావ్యాల్లో మనకి స్పష్టంగా కనిపించేది జీవితంలో మనం మింగలేక కక్కలేక ఒక కవి అన్నట్టు ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం’’ అన్నట్టు ఆ చేదు నిజం మనం అంగీకరించలేనిది సర్వత్రా కనిపిస్తుంది. వీగిపోయిన మానవ సంబంధాల హైన్యతా కనిపిస్తుంది.
భ్రాంతి బంధురమంతరం ఇట సర్వమున్నది కాని శూన్యం. గోచరిస్తుందొకటి అన్నిట మనుజమాతృల మతుల హైన్యం. వివిధ సిద్ధాంతాల ఘర్షణ విషయ వైరుధ్యాల ఘర్షణ అంటూ ఎక్కడున్నది జ్యోతి ఇక్కడ జ్యోతి అంతర్నిహితమైతే అనుకుంటూ స్పష్టమైన ఒక ఛాయాచిత్రాన్ని ఆవిష్కరిస్తాడు కఠినమైన భౌతిక వాస్తవికతని.
‘‘ఈ పరిచిత ముఖపటావిలో తల్లి ఎక్కడ పిల్లడెక్కడ మనుగడల తిరునాళ సందడి అంటా ఎవడు హితుడిట- సహృదయుడెవ్వడు మనుజుడిట- ఏకాకి తనలో అనుకుంటా చివరికి జీవిత రహస్యాన్ని ఏదో శోధించినట్లే దిక్కుతోచదు ఎక్కడున్నది స్పర్శమణి జీవితా మహాఘృణి’’ అని ‘‘కక్కురితి నగుబాటు పాపపు పుట్ట మానవదీనగాత్రం’’ అని తేల్చేస్తాడు. అక్కడ గుండె ఆగిపోతుంది. సంశయరజనిలో ఆత్మహింసల ఘోరవనిలో వెలుగుచూపమని సోనియాను దీనంగా వేడుకుంటూ ఆమెని మహిత మమతామృత సుగంధ విముఖ మధుకర శాంతి పద్మం అంతా తెలుసుకొనదగనిదంతా తెలుసుకొన్న నీవు తెలుసుకొనతగినదాన్ని తెలుపగలవు నాకు అంటూ తడబడి సుడిబడి ఇక ఈ శూన్య ఒక్క నీదే బతుకు హామీ అని వేడుకుంటాడు.
అది మరిగిపోయిన మానవ హృదయం. కరుణ కలిగిన చల్లని దైవం. సోనియా ముందు తాను భరించలేని హృదయవేదన వెళ్లబోసుకోవటం సాహితీ చరిత్రలో ఒక అపురూప కళాత్మక నివేదన. ‘‘నాలో లోకం కొరకై లోకంలో నా కొరకై ఏకైక మహోద్రేకం ఉరికించాలని కోరిక’’ అంటూ తనకు లోకంలో గత అద్వైత భావాన్ని కవిత్వీకరించిన కవిని పట్టి చూస్తే అతను వేరూ కవిత్వం వేరూ అన్పించదు. అతని విషయంలో కవిత్వం ఒక ఆవేశం, అభినివేశం కాదు. అతనే నిలువెల్లా కవిత. ఈ ఒక్క కావ్యం చాలు అతన్ను కవితాకాశాన ధృవతారగా వెలగటానికి.
‘‘ఆమ్రపాలి హస్తాన్ని చుంబించని వారెవ్వరు? ద్రోహులు కాని వారెవ్వరు’’ అంటాడు. చేదుగా, అవును అతడన్ని సమస్యల్ని అన్ని కోణాలనుంచీ అర్థం చేకున్న సర్వజ్ఞ సింగభూపాలుడు. ‘‘కక్కురితి నగుబాటు పాపపు పుట్ట మానవదీన గాత్రం’’ అని తీర్మానిస్తూ అంటాడు. ‘‘మనుగడల తిరునాళ సందడి తల్లి ఎక్కడ పిల్లడెక్కడ ఎవరికెవ్వరు సాయమిక్కడ ఈ అపరిచిత మఖాటవిలో’’ అని తేల్చిపారేస్తాడు. బైరాగి తన అపారమైన జీవితానుభవంతో మానవుని ఉద్వేగాలూ, సహజాత సంజాతాలూ అన్నీ హృదయంతో ఆలోచించి (రారా అన్నట్లుగా) జీవితానికి అటువైపున వున్న వికృత పార్శ్వాన్ని మనకి చేదుమాత్ర చేసి మింగిస్తాడు. ఎట్లాగొట్లా ప్రయత్నం చేసి ఆ చేదుమాత్ర మింగితే ఇక అంతటా అలజడిలేని ప్రశాంతత అన్నమాట! గాయపడిన ఆత్మ అతడి కవిత, ఆవేదన అతని చిరునామా.

-అయపోయంది

-శివలెంక రాజేశ్వరీదేవి