వినమరుగైన

కర్పూర వసంతరాయలు -సి.నారాయణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో విజ్ఞుడు, ప్రాజ్ఞుడు అయిన కుమారగిరిరెడ్డి లకుమ సౌందర్యానికి దాసోహమని రాచకార్యాలను విస్మరించడం, బావమరిది మాటను, పట్టపురాణి ఆవేదనను పెడచెవిని పెట్టడం, నిండు దర్బారును ధిక్కరించడం- సమంజసమేనా? అన్నది మొదటి సందేహం. అయితే ఇనుప కచ్చడాల్ కట్టుకున్న ముని మ్రుచ్చులే, అప్సరసల అందాలకు బందీలై తపోభంగానికి పాల్పడినప్పుడు రసజ్ఞుడు రాగ హృదయుడు అయిన కర్పూర వసంతరాయలు అలా ప్రవర్తించడం మానవ సహజమనే అనిపిస్తుంది. కావ్యం చివరిలో మానసిక వేదనతో, మరణయాదన అనుభవిస్తున్న లకుమ తనను తాను సానిదానిగా సంబోధించుకోవటం మాత్రం కొంచెం యెబ్బెట్టుగానే అనిపిస్తుంది. అలా అనే బదులు ఆటవెలదికి అంటే బాగుండేదేమో!
ఇక అభివ్యక్తి పరంగా కర్పూర వసంతరాయలులో ఎన్నో విశిష్టతలను వెలయించారు సినారె. త్రస్క, చతురస్ర గతులలో సాగే గేయ ఛందస్సులో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒకటి, రెండు మాత్రలను పెంచి తగ్గించి నడకకు నవ్యతను చేకూర్చారు. సాంప్రదాయిక కవులు సీస పద్యాలలో ఎనె్నన్ని చమత్కారాలను సాధించారో, గేయ ఛందస్సులో డాక్టర్ సినారె అన్ని చమక్కులు చూపించారు. పరిమళించే పదబంధాలకు పెట్టింది పేరు ఆయన. ఆచంట జానకిరామ్‌గారి మాటల్లో- కాలిధూళి, గంధపుపొడి, పాద పరాగము, పాపిట సింధూరము, రుూ పదముల పొందిక గమనింపదగినది. ఇలాగే కావ్యమంతటా అందమైన మాటలు పచ్చ కర్పూరపు పలుకులులాగా పరిమళిస్తాయి. ద్వితీయ ముద్రణకు కర్పూర సౌరభాన్ని అందిస్తూ డాక్టర్ దివాకర్ల వెంకటావధానిగారు- రమ్యమైన కథను గ్రహించి, దానిని రసభావ మహితముగా గ్రంధించి, గేయ రూపమున తీర్చిదిద్దిన కీర్తి శ్రీ నారాయణరెడ్డిగారికే దక్కుతుంది- అన్న మాటలు అక్షర సత్యాలుగా మన ముందు నిలుస్తాయి. ఈ కావ్యం అయిదుసార్లు ముద్రణకు నోచుకోవడం కూడా ఆ కావ్య గరిమకు తార్కాణంగానే మనం పేర్కొనవచ్చు. (ఈ కావ్యాన్ని రాగి రేకులలో, రాతి పలకలో కనుమూసిన తెనుగల చరితకు ప్రాణం పోసిన మహామనీషి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే అంకితమివ్వడం కవి ఉన్నత మనస్సిన్నతను చాటుతుంది)
కథాగమనంలోను, పాత్రల సజీవ చిత్రణలోను, లలితమైన అభివ్యక్తిలోను, విలక్షణత్వాన్ని పుణికిపుచ్చుకున్న- కర్పూర వసంతరాయలు, పాఠకుల, శ్రోతల మన్నలను పుష్కలంగాచూరగొంది. 1960-80 దశకాలలో, ఆంధ్ర దేశంలో ఎక్కడా కవిగారి సభ జరిగినా అది రుూ కావ్యగానం లేకుండా జయప్రదం కాలేదన్నది నగ్న సత్యం! అంతేకాదు, లబ్దప్రతిష్ఠులైన కవులనుండీ ఉదీయమానులైన యువకుల వరకూ, ఎందరో మనం ఊహించవచ్చును. కొండవీటి మృత్తికలోనే కాదు, సాహిత్యాభిమానుల గుండె వాటికలో కూడా యిప్పటికీ కర్పూర వసంతరాయలు కావ్య సౌరభాలు గుబాళిస్తూనే వున్నాయి. గేయ సాహిత్యం వున్నంతవరకు సాహిత్యం అధ్యయనం సాగుతున్నంతవరకు, ఆ సౌరభాలు కాలాన్ని కర్పూరంలా పరిమళింపజేస్తూనే వుంటాయి. అందుకే ఆ కావ్యం ఆధునిక గేయ సరస్వతికి సువర్ణ సుమహారం! శత వసంతాల తెలుగు సాహిత్య నందనంలో వసివాడని అక్షర మందారం!

-అయిపోయంది

-కె.వి.ఎస్.ఆచార్య