వినమరుగైన

అగ్నిధార -దాశరథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే మహాంధ్రోదయాన్ని సురవరం ప్రతాపరెడ్డికి అంకితమిచ్చాడు. దాశరధి తెలుగు, సంస్కృతం, పారశీ, ఆంగ్లం బాగా చదువుకున్నవాడు. ఇటు ఛందోబద్ధమైన కవితలలోనూ, అటు వచన ప్రక్రియలలోనూ, గేయాలలోనూ ప్రసిద్ధి చెందినవాడు. ప్రతి ప్రక్రియను కూడా హృదయగతమైనటువంటి భావోద్వేగంలో నిక్షిప్తం చేసినవాడు. దాశరధి ఆనాటి చరిత్రకు అద్దం పట్టినటువంటి కవి. తెలంగాణ ఉద్యమ ప్రేరణతో అనేక కావ్యాలు వచ్చాయి. అనేక నవలలు వచ్చాయి. ఉదాహరణకు ఆరుద్ర త్వమేవాహం, కుందుర్తి తెలంగాణ, అలాగే బొల్లిముంత మృత్యుంజయులు- యిలా వచ్చినటువంటి అన్ని సాహితీ ప్రక్రియలు, రూపాలు, కావ్యాల్లోకెల్లా అగ్నిధార ఉత్తతమైనది. ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క క్రోధాగ్నికి ఎలా దాశరధి స్పందించాడో ఒక విషయం చెప్తే అర్థమవుతుంది. ఆయన ‘‘నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబగునో అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను నిప్పుల్ పోసి, హేమంత భామ గంధర్వ వివాహమాడెదను. జూమస్నుష్ట గోళమ్ముపై ప్రాణాకాశానవారుణోష్ట జలధారల్ చల్లి చల్లార్చెద’’నన్నాడు.
‘వీనియ తీగపై పదును పెట్టిన నా కరవాల
ధారతో గానము ఆలపించెద స్వకంఠము
నుత్తరణంబు నొనర్చి స్వర్గానకు భూమి నుండి
రసగంగను చిమ్మెద పీడిత ప్రజావాణికి మైకు
అమర్చి అభవాదులకున్ వినిపింప చేసెదన్’’
అన్నాడు. చాలా గొప్ప భావోద్వేగ భరితమైనటువంటి కావ్యమది. అంతేకాదు తెలంగాణా అంటే దాశరధి పరవశించిపోతాడు. ఎంత ఇదిగా అంటే-
కాకతీయుల కంచుగంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిననాడు
తెలుగు జెండాలు నర్తించె మింట
కాపయ్య నాయకుండేపుసూపినవాడు
పర రాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమ రాజ పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణగణమనె
నాడు, నేడు తెలంగాణా మోడలేదు
శత్రువుల దొంగ దాడికి
శ్రావణాభ్రజలద గంభీర గర్జాట్టహాసమదర
నా తెలంగాణా పోవుచున్నది నవపథాన’’
అన్నటువంటి దాశరధి అనేక విషయాలలో ఆదర్శమైనటువంటి ప్రజాకవిగా నిలబడ్డాడు.
వాస్తవానికి దాశరధి ఆకారంలో వామనుడు, పరాక్రమంలో త్రివిక్రముడు. నిత్యనూతన ప్రగతిశీలి. నైజాం కర్కశపాలనలో కఠోర జీవితాన్ని కన్నది, విన్నది కాదు. స్వయంగా అనుభవించినవాడు. ఆ అనుభవాలకు పదునైనటువంటి అక్షరరూపం కల్పించినవాడు. రెండు పదుల వయస్సు నిండకముందే నైజాం జైళ్ళలో నానా బాధలు పడ్డవాడు. ఆ బాధల నుండి పుట్టిన అగ్నియే ఆయన కవిత్వం. అందులోదే అగ్నిధార, క్రౌంచపక్షి దురవస్థ చూసి వాల్మీకి కవి గళం విప్పారింది. తెలంగాణ ప్రజల దురవస్థ చూసి, అనుభవించి దాశరధిలో అంతర్నిహితమైన అగ్ని లావాలను పోలిన కవితాస్రవంతిగా విజృంభించి అగ్నిధార రూపం దాల్చింది. పద్యం, గేయం, వచనం, కవిత్వం లాంటి అన్ని రూపాలలోనూ ఆయన సిద్ధహస్తుడు.
మీదుమిక్కిలి పారశీ కవి గాలిబ్ గజళ్లను అనువదించి తెలుగువారికి ఆ రససిద్ధిని పంచిపెట్టినవాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరధి అక్కడితో ఆగిపోలేదు. సమైక్యతను స్వప్నించి, దర్శించి అవి ఆచరణకు రావాలని కోరినవాడు. అంతటితోనే ఆగలేదు. సోషలిస్టు వ్యవస్థ పట్ల మమకారం, విశ్వశాంతి- యిలా ఆయన భావనాస్రవంతి విశ్వజీవన శ్రేయోదాయకమైనటువంటి త్రివిక్రమాకృతిలో, కవిత్వంలో రూపంలో దర్శనమిస్తుంది. కనుకనే దాశరధి నిత్యనూతనుడు. సాహిత్య సనాతనుడు, ప్రగతిశీలి. సంస్కృతాధ్యయనంతో ప్రారంభించి ఆంగ్ల విద్యలో ప్రావీణ్యం సంపాదించి, తెలుగు కవిత్వం రాసి ఉర్దూ, పార్శీ కవితలను తెలుగువారికి చవి చూపించినటువంటి ప్రతిభాశాలి. బహుగ్రంథ రచయితగా పెక్కు సత్కారాలు అందుకున్నాడు. ఆంధ్ర కవితా ప్రపంచంలో పోరాట ప్రజల ఆస్థాన కవిగా తొలిదశలో జ్వాజ్వల్యమానంగా వెలుగొందినవాడు. తరువాత ఆయన సినిమా గేయాలు, ఆస్థాన కవిగా ఆయన పరిస్థితి తెలిసిందే. తెలుగువారు యింకా ఎంతో కవితాసృష్టిని ఆయన్నుంచి ఆశిస్తూ వుండగా 60 ఏళ్ళకే అమరుడైన అగ్నిధార సృజనశీలి దాశరధి.

-అయపోయంది

-సి.రాఘవాచారి