వినమరుగైన

దీపం దర్శయామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్టకోసం ఆడా మగా అన్న తేడా లేకుండా పొట్టేళ్ళులా పొద్దునే్న లేస్తూనే ఆఫీసులకు పరుగెత్తడాలూ, ఆపసోపాలతో క్రిక్కిరిసిన బస్సుల్లో, ఉక్కిరిబిక్కిరి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన స్కూటర్లలో, సైడు దొరకని సైకిళ్ళలో, ఫుట్‌పాత్‌లన్నీ చెప్పులు కుట్టేవాళ్ళతో, చిన్న చిన్న అమ్మకాలు చేసుకొనేవాళ్ళతో నిండిపోగా, సైడు కాలవల గట్లమీంచీ, చుట్టుప్రక్కల చూసుకొంటూ ఇళ్ళు చేరేసరికి ఒళ్ళు హూనం అవడం, అందరికీ అలవాటయిపోయింది. ఈ విధంగా నిత్యకృత్యంగా పగలనేది సెగల పొగలతో ఆవిరై పారిపోగా, రాత్రనేది చల్లని గాలులతో, చక్కని సొగసులతో వచ్చి చేరుతుంది. ప్రతివాళ్ళూ పగలు పడే పాట్లకు, ఈ రాత్రనేది రాబట్టి కాస్తన్నా ఊపిరి పీల్చుకుంటూ ఉల్లాసంగా ఉండేందుకు వీలౌతోంది.
భోజనాలు కాగానే చిల్లర పనులన్నీ చక్కబెట్టుకొని, ఆఫీసునుంచి వస్తూనే తెచ్చుకొన్న మల్లెచెండును తల్లో తురుముకొని, మందంగా, అందంగా నడుముదగ్గర దోపుకున్న పమిటచెంగును తీసేసి, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించింది దీప.
ఆమె లోపలికి రావడాన్ని గమనించిన ప్రమోద్ లైటార్పేశాడు. రిలాక్సుగా బెడ్‌మీద అటు ఇటూ దొర్లాడు. ‘‘బాగుంది వరుస. రూమ్‌లోకి వచ్చానో లేదో అప్పుడే లైటార్పి వేయడాలూ, చెయ్యి పట్టుకొని లాగడాలూ, పమిట చెంగు లాగేసి, మిడుతల దండులా పిచ్చి పిచ్చి ఆగడాలు. ఇంతకుమించి మరేం పనిలేదు మీ మగాళ్ళకు’’ అంటూ బెడ్‌మీద ప్రమోద్ పక్కనే కూర్చుంది దీప.
‘‘కొత్తగా పెళ్ళయిన వాళ్ళం కదా! ఏడాదన్నా లాగడాలూ, లైటార్పడాలూ లేకపోతే ఎలా దీపా! ఇన్నాళ్ళూ కన్నార్పడాలతోనే కాలం గడిచిపాయె’’ అన్నాడు మృదువుగా ఆమె చెక్కిలి నొక్కి, అక్కున చేర్చుకుంటూ ప్రమోద్.
‘‘నేను మటుకు కాదంటానా? అంత తొందర పనికిరాదంటాను. ఇప్పటిదాకా అలసిపోయివచ్చాను కదా! కాస్త నడుం వాలుద్దామంటే వీలు కానివ్వరు. నడుంమీద చెయ్యేసి ఉడుంపట్టు పడతారు. కాలు కదుపుతూ ఆఫీసర్ ఫోజుతో కంగారు పెట్టేస్తారు. ఇదేదో అర్జంటుగా సంతకం చేసి పంపాల్సిన ఫైలా’’ అంది చిరుకోపం నటిస్తూ దీప.
‘‘అర్జంటే మరి. అప్పుడే పది కావస్తోంది. అవతల కరెంట్ మీటరు గిరిగిరా తిరిగిపోతోంది. పొదుపునకు పొదుపు, పొందుకు పొందు, ఏమంటావ్’’ అంటూ తొందర పడిపోతున్నాడు ప్రమోద్.
‘‘పొదుపు పాటించాల్సిందే కానీ, రేపు పిల్లలు పుట్టాక వాళ్ళు చదువుకోవాలన్నా, టీవీ చూడాలన్నా కరెంట్‌తోనే పని. అప్పుడు కూడా ఇలానే పొదుపు, పొదుపు అంటూ పోరు పెడతారా?’’ ఎదురుప్రశ్నవేసింది దీప ప్రమోద్ పిసినారితనాన్ని తట్టుకోలేక.
‘‘పొదుపన్నది ఆ కరెంటుకేగానీ, మనిద్దరిమధ్యా నడిచే కేళీవిలాస కరంటుకు కాదోయ్. టైం వేస్టు చేయకుండా ఫాస్టుగావచ్చి పడుకో దీపా!’’ అంటూ కొంచెం బలంగానే లాగి పక్కనే పడుకోబెట్టుకున్నాడు కౌగిలించుకుని ప్రమోద్!
‘‘అవునే్లండి, ఖర్చులేని పనాయె. దీనికి పొదుపేముంటుంది? మీ అవసరాలే కానీ మిగతా వాళ్ళ అవసరాలతో పనేముంది? మీ బడ్జెట్ గోల భరించలేక నాలుగు రోజులుందామని +వచ్చిన అత్తయ్యగారూ, మామయ్యగారూ, మర్నాడే సొంతూరెళ్లిపోయారు’’ చిరాగ్గా అంది.
‘‘ఓ! అదా! మా నాన్నకసలే దగ్గు. అస్తమానం ఆ ఫేనేసుకుంటే, ఆ వేడికి దగ్గెక్కువవుతుంది. అమ్మకేమో కొలెస్ట్రాల్. అందుకే విసనకర్రతో విసరమని చెప్పాను. కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలోయ్. విన్నావో లేదో. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో మట్టిపాత్రలతో పాలూ, కాఫీ, టీ, మజ్జిగ సప్లయ్ చేస్తున్నారు’’ అంటూనే శృంగార క్రీడలో వేగం పుంజుకున్నాడు ప్రమోద్.
‘‘అన్నట్లు మరచాను. అన్నయ్య రమ్మని ఫోన్ చేశాడు. రేపే మన ప్రయాణం’’ అన్నది కొన్ని క్షణాల తర్వాత దీప. ‘అవునవును’ అంటూ దుప్పటి కప్పుకొని దీపవైపు తిరిగి పడుకున్నాడు ప్రమోద్ తృప్తిగా.
***
‘‘హమ్మయ్యా వచ్చేశారు’’ అంటూ లోపలికి ఆహ్వానించింది లక్ష్మి ఆనందంగా.
‘‘అదేమిటి వదినా! అలా అంటావ్. నీ సీమంతానికి రాకుండా ఎలా ఉంటాం? కులాసానా!’’ అంటూ సూట్‌కేసు కిందపెడుతూ అంది దీప.
‘‘ఏం బావగారూ బాగున్నారా!’’ అంటూ బాత్‌రూమ్‌లోంచి వస్తూ పలకరించాడు రమేష్. -సశేషం

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి..