వినమరుగైన

దీపం దర్శయామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాగున్నానండీ! మీరెలా ఉన్నారు?’’ అంటూ పైకి చూశాడు ప్రమోద్. ఫాన్ గిరగిరా తిరుగుతోంది. దీప కూడా ఆ ఫానువైపు, ప్రమోద్ వైపు చూసింది.
‘‘ఓకె! ఫైన్’’ అన్నాడు రమేష్.
‘‘ప్రయాణ బడలికతో ఉన్నారు. ముందు స్నానాలు కానివ్వండి. గీజర్ ఆన్ చేసే ఉంది’’ అంటూ ప్రమోద్‌నూ, దీపను లోపలికి తీసకెళ్లింది లక్ష్మి.
‘‘బావగారూ! భోజనాలయ్యాక ఆ రూమ్‌లో ఏసి ఆన్ చేసుకొని హాయిగా పడుకోండి. అన్నట్లు లక్ష్మీ ఫ్రిజ్‌లో స్వీట్సు, ఫ్రూట్స్, డ్రింక్స్, క్రీమ్స్ అన్నీ తెచ్చే ఉంచాను. వాళ్ళకు కావాల్సినవి అందిస్తూ సరదాగా అపుడు కబుర్లు మొదలుపెట్టు. నాకు ఆఫీసుకు టైం అయింది. నే వస్తా’’ అంటూ డ్రెస్ చేసుకొని హడావిడిగా బయటకెళ్లాడు రమేష్.
‘‘మీ అన్నయ్యకు చాదస్తం ఎక్కువ. ఇంత చదవాలా. ఇవన్నీ నే చూడనూ. ఏదో పరాయివాళ్ళ దగ్గర గొప్పలు పోయినట్లుగా సొంత చెల్లెలు దగ్గర కూడా గొప్పలు పోతాడు. ఇప్పుడవన్నీ గుడిసెల్లో కూడా ఉంటున్నాయ్. అయినా ఇవన్నీ మీకు లేనట్లు మాకే ఉన్నట్లు’’ అంది లక్ష్మి విసుగ్గా.
‘‘మాకేమున్నాయో, ఏం లేవో ఒకసారన్నా వస్తేనేగా మీకు తెలిసేది’’ అంటూ ప్రమోద్‌వైపు చూసింది.
‘‘అదేగా బాత్‌రూమ్’’ అంటూ దీపవైపు అదోలా చూసి వెళ్లాడు ప్రమోద్.
‘‘వదినా! అదుగో మరో బాత్‌రూమ్. నువ్వు కూడా రెడీ అయినావంటే క్షణంలో వంట చేస్తాను. భోం చేద్దాం’’ అంటూ వంటగదివైపు నడిచింది లక్ష్మి.
‘‘ఏం భోగం? ఏం భోగం?’’ అని మనసులో అనుకుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లింది దీప.
***
‘‘వచ్చేశాం. మళ్లీ మనిల్లూ మన లోకం’’ అనుకుంటూ ఇంటి తాళం తీశాడు ప్రమోద్. ప్రమోద్, దీప ఇద్దరూ లోపలికడుగుపెట్టారు.
‘‘మా అన్నయ్య వాళ్లింట్లో ఎంతో హాయిగా ఉంది కదండీ! రాబుద్ధే కాలేదు’’ అంది దీప.
‘‘ఊరికే వచ్చిన సుఖం ఎన్నాళ్లయినా బాగానే వుంటుంది. ఆత్మాభిమానం లేకుండా అక్కడే ఎన్నాళ్లుంటాం?’’ అన్నాడు ప్రమోద్.
‘‘ఎవరుండమన్నారులేండీ. అరెరే. ఏమిటి మీకంత చమటపోస్తోంది. బాగా ఉక్కగా ఉంది’’ అంటూ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసింది.
‘‘ఆ! ఏం వద్దు. కాసేపు వాకిట్లో అరుగుమీద కూర్చుంటాను’’ అంటూ వెంటనే ఫ్యాన్ స్విచ్ తీసేశాడు ప్రమోద్ వాకిట్లోకెళ్లి కూర్చుంటూ.
‘‘ఈ జన్మకు మీరు మారరండీ! ఇంటికి రాగానే మళ్లీ మన పాత పాటే మొదలైంది. ఇన్నాళ్ళూ మా అన్నయ్య వాళ్లింట్లో ప్రాణం కాస్త హాయిగా ఉంది. వాడి ఉద్యోగం కూడా మీ ఉద్యోగంకన్నా పెద్ద ఉద్యోగమేం కాదు. పైగా ఇక్కడ మనమిద్దరం సంపాదిస్తున్నాం. అయినా వాళ్ళు చూడండి ఎంత దర్జాగా ఉన్నారో! ఈమధ్యనే మా వదినకు డైమండ్ నెక్లెస్ కొన్నాట్ట. ఎంత బాగుందో!’’ అంటూ అరుగుమీద కూర్చున్న ప్రమోద్ వైపు చూసింది దీప.
‘‘పై సంపాదనలేమైనా ఉన్నాయేమో! నీకూ నాకూ ఏం తెలుస్తుంది. లేకపోతే ఈ రోజుల్లో అందరిలానే గొప్పలకోసం అప్పులు చేస్తున్నాడేమో! స్టేటస్ కోసం, ఈమధ్య మధ్యతరగతివాళ్ళు కూడా ఈ అప్పుల ఫ్యాషన్‌కు అలవాటు పడుతున్నారు’’ అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ప్రమోద్.
‘‘ఏం చేస్తున్నారో ఏమో? ఇప్పుడు సుఖంగా ఉన్నారా లేదా’’
‘‘అవునవును. చాలా సుఖంగా ఉన్నారు’’ అన్నాడు చిరాగ్గా.
‘‘నాకెందుకొచ్చిన గొడవ. నా వంటా వార్పూ నే చూసుకుంటాలే’’ అంటూ వంటింట్లోకినడిచింది దీప.
ఆ తరువాత కొంతసేపటికి అరుగుమీంచి లేచి, ఇంట్లోకి వెళ్లి తలుపు గడివేశాడు ప్రమోద్.
***
‘‘ఆ! ఇదేమిటి. వదిన ఒక్కతే రిక్షాలో దిగింది. అన్నయ్య రాలేదే? ఏమయ్యుంటుందబ్బా! ఇంత సడెన్‌గా. ఇదుగో ఏమండీ మిమ్మల్నే. మా వదిన వచ్చిందండీ. త్వరగా రండీ. ఆ వదినా రా! ఆరోగ్యం బాగుందా?’’ అంటూ లక్ష్మిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది.
*
ఆకాశవర్షిణి నుంచి
*
-సశేషం

-షణ్ముఖశ్రీ