వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

తా.్ధ: నిరశ్రురోదనము’అని... జీవితం ఒడిదుడుకులతో నిండిన జీవితం. ఆదిమాత్రం మీరు చూడండి. ఇదంతా స్మూత్‌గా లిమోసిన్స్‌లో వెళ్ళినటువంటి జీవితం కాదు. ఒక అణా వేరుశెనగపప్పుతో మధ్యాహ్నం లంచ్ చేసేసుకోవాల్సినటువంటి అవస్థలు ఉండేవి. ఎందుకూ... పిల్లలకు కావలసినటువంటి శాకాహారాలు ఇవ్వడానికి, ఈ పని నేను చెయ్యాలి.
అటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక ఫ్రెండ్ ‘వైడ్ డోన్ట్ యూ పాస్ ద హేట్ రౌండ్ అన్నాడు. పెద్దవాడు, తెలుసును కదా.. భిక్షాపాత్రను బైల్దేరాను. రాత్రి రాత్రి నేను పడిన యాతన.. బొమ్మలు రాసి, భిక్షాపాత్రయిపోయి, అదొక మనిషి రూపంగా వచ్చి, ఎగతాళి చేస్తూ, నవ్వుతూ, ఇవన్నీ నీ ఊహలట్రా అనుకొని ‘ఆ’ అనుకుని దగ్గరకొస్తుంది.
‘అటు జనుదెంచి నన్నున, మదార్తినిఁ
గూడ నొకే క్షణంబునన్
గుటుకున మ్రింగి మేలు సమకూర్చెద
వంచుఁ దలంచు చుండ, నా
పటుతర దుర్భగత్వపు ప్రభావము
చేతనొ యేమో, నీవునున్
దటుకున నిల్చి చూపెదవు
తర్జని, భర్జన భీరాకృతిన్.
రమ్మందువు చేరఁగఁగై
కొమ్మందువు నిన్ను, ‘్భక్షుకున్ జనుమదె పొ
త్త’మ్మందువు, పరయత్నము
వమ్మందువు, పొందు వైభవమ్మందు నిలన్..
నాక్కోపమొచ్చి,
భిక్షాపాత్రమ! యేల నాపయి నిటుల్ బీభత్సముం జూపుదో
భిక్షాబుద్ధులు లేరె యెయ్యెడల? వాసింగాంచు సత్పాత్రతా
రక్షాదీక్షులు లేరె? సత్కవి దరిద్ర క్లేశ నిర్మూలనా
దక్షుల్ లేరె వదాన్యశేఖర పవిత్రంబైన ఆంధ్రావనిన్?
కొ.వీ: చాలా మంచి పోయమ్..
అక్షిద్వంద్వ పటుత్వమంతయును మా
యం లేదు, అంగంబునన్
దక్షత్వంబు నశించలే, దతుల మే
దశ్శక్తి వైదుష్య స
ద్వీక్షాపేక్ష తొలంగ, దాంధ్రజననీ
సేవాస్థయుం డిందదో
భిక్షాపాత్రమ, యేల నాపయి నిటుల్
భీభత్సముంజూపుదో
నిక్షేపంబున నూహలుండఁ గృతి దా
నిం గూర్పఁగా నెంచుచో
ద్రాక్షాపాత్ర మృదూక్తులుండ, రససా
మ్రాజ్యంబు తెల్గుండగా,
లక్షింపన్‌జుమ నిన్ను లేఖిని కరా
లగ్నంబుగా నన్నచో
భిక్షాపాత్రమ, యేల నాపయి నిటుల్
భీభత్సముం జూపుదో?

అక్షుద్ర శ్రమ నాంధ్ర వాఙ్మయ చిరో
దంచత్ ప్రభోజ్జీవ నా
పేక్షన్ యత్నము సేసి, పొందియుఁ మహా
విద్వత్ ప్రశంసావళిన్
కుక్షిం జూపెడు కష్టునిన్‌బలెనె
నుంబోయి యాచింతునే?
భిక్షాపాత్రమ, యేల నాపయి నిటుల్
భీభత్సముంజూపుదో..
కొ.వీ: చాలా బాగుంది. ప్రాస ప్రధానంగా వుంది.
తా.్ధ: కదూ?
కొ.వీ: ఆ.. మంచి గ్రాంథిక భాషలో నడిచింది.
తా.్ధ: అని బాగా చేమకూర వారి జాడల్లోను రాశానే్నను. ‘నిరశ్రురోదన’ అనీ..
కొ.వీ:‘నిరశ్రురోదన’ బాగుంది.
తా.్ధ:నిరశర్రోదనము..
రాల విదేల యశ్రులు
పరంపరలై, చిన్న చిన్న సోనలై,
కాలువ చాలులై చల
దగాధ తరంగిణులై, విభీష ణో
ద్వేల విలోల వీచికల
వీఱిఁడి బాఱెడు నేఱులై, జగ
జ్జాలము ముంచవేల? యవ
శంబుగఁ జేయ విదేల లోకమున్?
కొ.వీ: చాలా బాగుంది.
-సశేషం

సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్

సంపా. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేష్‌బాబు