వినమరుగైన

నేనొక మానవుణ్ణి... జిజ్ఞాసకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కొత్తపల్లి వీరభద్రరావుతో తాపీ ధర్మారావు- 1972 జూలై)

తా.్ధ:దివ్యగంధిల సద్భావ దృప్త సరస
కావ్య మదిరారసంబును గౌతుకమున
కొ.వీ:కావ్యమదిరా రసము?!
తా.్ధ:కావాలి. ఆఁ.. ఇంజెక్షన్ చేయడానికొచ్చినపుడు క్లోరోఫాం ఇచ్చినట్టు.
కావ్యమదిరా రసంబును గౌతుకమున
నానియాని, ప్రస్తుత నఱ నిముసము
దెఱచు గన్నుల నిద్ర జెందితిని పగలె
ఒక విమానముంది. అందులో కూచున్నాను. ఆ విమానం లేచిపోతున్నది.
ఆ రీతిం జను నా విమానమున కా / హా చుట్టుఁ గన్పట్టెఁ బ్రా
కారాకారము నంది, సూదిమొనకుం / గాసంత సందీక, నీ
హారాతీత గభీర శైత్యమున జీ / వాంశమ్మున్ ఱాఁజేయు పెన్
దారిద్య్రంబన, నంధకార మతి / సాంద్రంబై, కరగ్రాహ్యమై

అందున నొక్కపూవు, తన / యంతనె జారిపడంగ, దాననే
మందును! దివ్య తేజ మొక / డద్భుత లీల జనించె, నందునా
హైందవ పశ్చిమోత్తర మ /హా మహిభాగ నిసర్గ వైభవం
బందము మీరఁ బాణితల / మందున గన్నటు దోచె నొక్కటన్..
వాడు, నాదిర్‌షా గాడొచ్చాడు. 400 కామెల్స్ (ఒంటెలు) మీద నుంచి, ఈచ్ కామెల్ కారీయింగ్ సో మచ్ ఆఫ్ గోల్డ్ డస్ట్ అని స్కార్ప్స్ ఇండియా అని చదివాం. చూడండి..
కొ.వీ:ఔను దాన్లో రాశారు.
తా.్ధ:నాదిర్‌షాతో ఇలా జరిగింది. లేకపోయినట్లైతే..
ఎంతో దూరంబున నుండి శే్వత ముఖమల్ / నోరూర రానేల ? యే
లా దోచంగ ననేక కోటి పరి / సంఖ్యంబైన ద్రవ్యంబులన్
కంప్లీట్ చేసి, విమానం నడుస్తూనే వుంది. తిరుగుతూనే ఉన్నాను.
పొలము నెపుడో దిష్టిబొమ్మకుఁ గట్టిన
చింకిపాతయైన జిక్కుననుచు
దొంగిలించి మానముం గాచుకొనునట్టి
కటికి లేమి కాంచగలను నేను..
కొ.వీ: వ్యావహారిక భాషలో రాస్తే బాగుండేది.
తా.్ధ: మొట్టమొదట గిడుగు రామ్మూర్తిగారిని అటాక్ చేసిన.. (ఆయన) బరంపురం వచ్చినపుడు, నేనక్కడ మేష్టర్ని అటాక్ చేసినటువంటి నన్ను ప్రక్కన పెట్టారు పెద్దలందరూ కలిసి. నేను గిడుగు రామ్మూర్తి పంతులుగారి దగ్గిర రెండు సంవత్సరాల కిందట ఎఫ్.ఏ పాసయ్యాను. చదువుకున్నాను.
కొ.వీ:ఆయన దగ్గర!
తా.్ధ: ఆయన దగ్గర, గ్రేషియన్ హిస్టరీ, రోమన్ హిస్టరీ చెప్పేవారు వారు, తెలుగు కాదు. ఆయనకప్పుడు ప్రతికూలముగా నేనుపన్యాసం చెప్పాలి. ఇదేం బాగులేదురా అని, సరిరా పెద్దవాళ్ళు నన్ను ముందు పెడుతున్నారు అన్న ఉత్సాహమూ ఉంది. తీరా గిడుగు రామ్మూర్తి పంతులుగారు.... ఉద్దండపిండం.
కొ.వీ: ఔను
తా.్ధ:ఆయనె్నదిరించగలనా అని అనుమానమూ భయమూ ఉంది. ఇదీ అదీ కాదని, పద్యాల సహాయం కూడా తీసుకుందాం అని, ఆ రోజుల్లో మాలికా కవిత్వం ఒకటి ఉంది.
కొ.వీ:ఔను ఉంది.
తా.్ధ: ఒక మాలిక రాశాను. అదే నా ఉపన్యాస ఫ్లాట్‌ఫాం మీదకి వెళ్లి..
పలువురు మెచ్చగా వివిధ / భాషల నేర్చిన యాంధ్రులార, యం
జలి నొనరించి వ్రాసెదను / శాంతి నొకింత యెసంగరే.. దయన్
(కోపం చెడ్డకోపం గిడుగు రామ్మూర్తిగారికి)
కలదు కదా, తెలుంగనెడి / కాంతయొకర్తు త్రిలింగమందు, నీ
లలన కథన్ వినంగ గను / లన్ జలముబ్బును, మేనిరక్తమా
చలనము మాన బూను, మన / సా, యనుకంపను జెంది పెక్కువ బా
ధల గను; నేలయన్న, దొలు / తన్ తన చిన్నతనంబు నందె, మా
టలు మధురంబుగా నుడువు / టం గనునంతకు ముందె, యక్కటా!
పొలతి కనేక గండములు / మూడె; నవన్నియుఁ బాఱదోలి ధీ
లలితుడు నన్నపార్యుడు వె / లందినిగాచి, యనేక భావరీ

చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు విశే్లషణల సమాహారం నుంచి. (సౌజన్యం:ఆకాశవాణి, హైదరాబాద్) -సశేషం

సంపా. డా.నాగసూరి వేణుగోపాల్, డా.సామల రమేష్‌బాబు