కథే హైలెట్‌గా పిడుగు: హీరో వినీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినీత్, మోనికాసింగ్ జంటగా వి2 ఫిలిమ్స్ పతాకంపై రామ్మోహన్ సిహెచ్. దర్శకత్వంలో అశోక్‌గోటి నిర్మిస్తున్న చిత్రం ‘పిడుగు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 18న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా చిత్ర కథానాయకుడు వినీత్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
‘చిన్నప్పటినుండి నాకు సినిమాలంటే ఆసక్తి. మాది వైజాగ్. నేను ఎంబిఏ చదివాను. కొన్ని రోజులు బిజినెస్ రంగంలో వున్నా కూడా సినిమా రంగంపై ఆసక్తి వుండడంతో ఈ రంగంలోకి వచ్చాను. వైజాగ్‌లో సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. ‘పిడుగు’ నాకు తొలి చిత్రం. అన్ని రకాల కమర్షియల్ అంశాలున్న చిత్రమిది. మొత్తం 5 పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేను ‘జై’ పాత్ర పోషిస్తున్నాను. నాలుగు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్ర ఇది. కథ గురించి చెప్పాలంటే.. సంపన్న కుటుంబానికి చెందిన ‘జై’ ప్రేమించి పెళ్లిచేసుకుందామనుకున్న సమయంలో అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేదే ఈ చిత్రం. కథ సస్పెన్స్‌తో సాగుతూ యాక్షన్, రొమాన్స్, కామెడీ, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వుంటాయని, హీరోయిన్‌గా నటించిన మోనిక చక్కని నటన కనబరిచిందన్నారు. దర్శకుడు కూడా అద్భుతంగా తెరకెక్కించాడని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా తనకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకం వుందని, ఈ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్ రెడీగావుంది. వేరే బ్యానర్‌లో సినిమా వుంటుంది అన్నారు.