వినమరుగైన

సౌందర నందము - పింగళి లక్ష్మీకాంతము, కాటూరి వేంకటేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర సౌందర నందంలో సుందరి సజీవపాత్రగా తకతకలాడుతూ సాక్షాత్కరిస్తుంది.
రచనా కాల భేదం కూడా సంస్కృతాంధ్ర సౌందరనందముల స్వరూప స్వభావ భేదాలకు దారితీసింది. ఇంతకుముందు చెప్పినట్లు సంస్కృత సౌందరనందంలో బౌద్ధ సిద్ధాంతోపదేశం జీవకారుణ్యాల బోధ ఉన్నప్పటికీ అది కావ్యకళను భజించలేదు. పైగా ఆంధ్ర సౌందరనందం మీద గాంధేయవాద ముద్రపడింది. భిక్షకీభిక్షువులయిన సుందరీనందులు కావ్యాంతంలో వెలివాడకు చేరటమే దీనికి తార్కాణం.
సహృదయులయిన కావ్యప్రియులు సౌందరనందాన్ని పఠించి, రసానందాన్ని అనుభవించే మార్గాన్ని ఆంధ్ర కవులే నిర్దేశించారు. లక్ష్మీకాంతం రచించి, కావ్యాంతంలో చేర్చిన పద్యం ఆ మార్గాన్ని సూచిస్తుంది.
‘‘్భవ మొక్కఁడు గాఁగ భావన యొక్కఁడై
రసభావపరిణతి యొసగఁ జేసి
సరసార్థ మొక్కఁడుగా శబ్ధ మింకొక్కఁడయి
శబ్దార్థ సామరస్యము ఘటించి
సూత్ర మొక్కఁడు గాఁగ చిత్రణ యొక్కఁడు
ప్రాణవ త్పాత్రముల్ పాదుకొల్పి
తెరయెత్తు టొక్కఁడుగా తెరదించు టొక్కఁడై
రంగ నిర్వహణమ్ము రక్తినిల్పి
సుందరీనంద జీవితానందమట్లు
పరమ మగు కోటి కెక్కిన బంధు భావ
మిత్ర భావము లిమ్మెయి మేళగించి
సృష్టి చేసితి మీ కావ్య శిల్పమూర్తి’’
ఉదాత్తమయిన రసభావ పరిణామం, శబ్దార్థ సామరస్యం, సజీవ పాత్ర పోషణం, నాటకీయత అను లక్షణములతో కూడిన కావ్య శిల్పమూర్తి ఆంధ్ర సౌందర నందం. ఈ హేతువుననుసరించే ఇది అశ్వఘోషుని సౌందరనందం కంటె భిన్నమైన స్వతంత్ర కావ్యంగా భాసిస్తున్నది.
సౌందరనందంలో భావన, భావమూ పుష్కలంగా గోచరిస్తాయి. ఆంధ్ర కావ్యంలోని చివరి అయిదు సర్గలూ దీనికి తార్కాణం. భిక్షుకీ భిక్షువులయిన సుందరీనందులను వెలివాడకు చేర్చటంలో ఆంధ్రకవుల భావన కొట్టవచ్చినట్టు కనబడుతుంది. వియోగం సహింపలేక సుందరీనందులు ఆక్రోశించిన తీరూ, సుందరి బుద్ధ భగవానుణ్ణి ‘ఏమనుటకు నున్ నోరు రాక, యల్లంతన మెత్తని కినుకతోడ, గౌరవ మెన సెడి వాక్యముల’తో ఎంచిన విధానమూ సహృదయులను పరవశింపజేస్తాయి. బౌద్ధ విహారంలో నందుడు విలపిస్తూ-
‘‘అళికుల స్పృహణీయ మైనధమ్మిల
భీరమున కుసుమమంజరులు తురిమి
కెందామరలకు రక్తిమదిద్దునీపాద
ముల రత్ననూపురములను గూర్చి
అరచందమామ సోయగమేలు నీఫాల
మున పచ్చి కస్తూరి బొట్లు దిద్ది
బాగోగులను నీవ పరికించు కొమ్మని
మణిగణస్థగిత దర్పణము దాల్చి
సరస కలహమ్ము వేళ నంజలి ఘటించి
ధన్యమైనట్టి నందు హస్తద్వయమున
నొకటి బిచ్చపు పాత్ర మాయుటకు దొడరె
తుడుచున్నది బాష్పబిందువులనొకటి
అని అంటారు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-నాగళ్ల గురుప్రసాదరావు