వినమరుగైన

శివతాండవము -పుట్టపర్తి నారాయణాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు కృష్ణరాయ కిరీట సమరశేఖరంబైన వంశంబు మాది / ఒకనాడు గీర్దేవతా కమ్ర కంకణ స్వనమైన మాధురీ ప్రతిభ మాది / ఒకనాడు రామానుజ కుశాగ్రబుద్ధిచే చదువు నేర్పినది వంశంబు మాది అని తన వారసత్వాన్ని గురించి స్వయంగా చెప్పుకున్నాడు. అంతేకాదు వైష్ణవాగమ సమభ్యాస సాగంధ్య నిష్ట్ధాృష్టులు భయ వంశములవారు అని కూడా ప్రకటించుకున్నాడు. కానీ శివకేశవాద్వైతమూ, శివభక్తీ అతడు వరించిన లక్షణాలు. తన త్యాగరాజ సుప్రభాతంలో త్యాగరాజు చిత్తవృత్తిని గురించి పుట్టపర్తి ఇలా అన్నాడు.
‘‘శ్రీ విష్ణురేవ పరతత్వమితి బృవంతః
శర్వస్సయేవ పరయిత్యభిభర్తృ యంతః
తేతే గతాః వితథనైగమ వావదూకః
అద్వైత సారసరణే స్తవ సుప్రభాతం’’
(కొందరు విష్ణువే పరతత్వమంటారు. మరికొందరు పరతత్వము ఈశ్వరుడేనంటారు. వాక్కలహాలతో వారి వేద పాండిత్యం వ్యర్థమైపోయింది. వాటి జోలికిపోకుండా శివకేశవాద్వైతాన్ని అనుసరించిన త్యాగరాజస్వామీ! నీకు సుప్రభాతం)
శివలీలాస్తవం అన్న మరొక చిన్న కావ్యంలో పుట్టపర్తి తన చిత్తవృత్తిని గురించి ఇలా చెప్పుకున్నాడు.
‘‘శేషశైల శిఖరాధి వాసినః
కింకరాః సరమవైష వావయం
నస్త్థాపి శశి ఖండశేఖరే
శంకరే మహసి లీయతే మనః’’
(నేను తిరుమల వెంకటేశ్వరుడి భక్తుణ్ణి. పరమ వైష్ణవుణ్ణి. కానీ నా మనస్సు చంద్రశేఖరుడైన శంకరుని తేజస్సులో లీనవౌతుంది.)
ఇలా శివకేశాద్వైతమూ, శివభక్తి పుట్టపర్తి ఆధ్యాత్మిక వ్యక్తిత్వంలో లీనమై శివతాండవంలో కవిత్వంగా రూపాంతరం పొందాయి.
వస్తు దృష్టితో చూచినపుడు శివతాండవంలో పరస్పరాశ్రీతాలైన మూడు భావ స్రవంతులున్నాయి. ఆ మూడు సంగమించిన మహానదే శివతాండవం. మొదటి స్రవంతి సంగీత నాట్య సంకేతాలను కవితాత్మకంగా ఉపయోగించుకుంటూ శివుని సంధ్యా తాండవాన్ని వర్ణించటం. రెండవ స్రవంతి శివకేశవాద్వైతాన్ని ప్రదర్శించటం. మూడవ స్రవంతి తాత్వికాద్వైతాన్ని ప్రతిపాదించటం. నిర్మాణం దృష్టిలో చూచినపుడు శివతాండవంలో ఐదు భాగాలున్నాయి. 1.శివుని తాండవానికి సంధ్య సిద్ధం కావటం. 2.నంది నాంది, 3.శివుని తాండవం, 4.పార్వతి లాస్యానికి విజయ అన్న చెలికత్తె చేసే ప్రార్థన 5.శివాలాస్యం. శివతాండవంలో ఐదుకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివ పంచాక్షరీ మంత్రంలో ఐదు అక్షరాలుంటాయి. పంచభూతాలు, పంచశక్తులూ కూడా ఇందులో సూచించబడ్డాయి. ఈ కావ్యంలోని ప్రధాన భాగమైన శివతాండవం ద్విరదగతి రగడలో రచించబడింది. అందులో ప్రతి గణంలోనూ ఐదు మాత్రలుంటాయి.
ఉదా- తలపైన / చదలేటి / అలలు తాం / డవమాడ
నాట్యశాస్త్రంలో తాండవానికీ, లాస్యానికీ తేడా వుంది. అంగహారాలూ, కరణలూ ప్రధానంగా ఉండి ప్రయోగంలో ఔద్ధత్యం కలిగిన నాట్యం తండవం. సుకుమారమైన అభినయమూ, శృంగార ప్రాధాన్యమూ కలిగింది లాస్యం. ఈ కావ్యంలో శివుని తాండవమూ, పార్వతి లాస్యమూ వాటికి తగిన ఛందస్సులో శైలిలో వర్ణించబడ్డాయి.
శివతాండవం శివుని తాండవానికి సంధ్య సిద్ధం కావటంతో ప్రారంభవౌతుంది. శివుని తాండవాన్ని చూడటానికి దేవకన్యలు జలదాంగనల రూపంలో వచ్చారు. పక్షులు వేదాలను గానం చేస్తున్నాయి. ఆనంద పారవశ్యంలో చెట్లు పూలను గుత్తులు గుత్తులుగా రాల్చుతున్నాయి. తాము పార్వతీదేవి అలంకారాలలో చేరుతున్నందుకు పువ్వులు నవ్వుతున్నాయి. శివునికి సేద తీర్చటం కోసం చల్లని గాలులు సిద్ధవౌతున్నాయి. తుమ్మెదలు షడ్జమంలో శృతి పడుతున్నాయి. నిరంతర ధ్వని ప్రవాహమైన శృతిని తకఝం తకఝం తకతరికిట అన్న తాళగతులు అనుసరిస్తున్నాయి. ప్రకృతి సర్వస్వమూ ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉంది. చిగురాకులు కూడా శివుని తాండవాన్ని గురించి గుసగుసమని మాట్లాడుకుంటున్నాయి.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వల్లంపాటి వెంకటసుబ్బయ్య