రాష్ట్రీయం

వీసా మోసగాళ్లను వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో 15వేల అక్రమ ట్రావెల్ ఏజెంట్లు
సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్

హైదరాబాద్, డిసెంబర్ 12: నకిలీ వీసాల మోసగాళ్ల ఆట కట్టించేందుకు సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. అమాయక మహిళలను మోసం చేస్తున్న ఏజెంట్లు ఎవరైనా వదిలిపెట్టమని సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు నకిలీ వీసాలతో పట్టుబడుతున్నారు. నెల రోజుల్లో 18మంది మహిళలు పట్టుబడ్డారు.
ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు జారీ చేస్తున్న ముఠాలతో ట్రావెల్స్ ఏజెంట్లు కుమ్మక్కవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో నకిలీ వీసాలు బయటపడుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. కువైట్, దుబాయి, సింగపూర్ దేశాల్లో ఉద్యోగాల కోసం పంపిస్తున్నారంటూ ట్రావెల్ ఏజెంట్లు తమ రూ. 50వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని, తీరా వచ్చే సరికి ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్టు, వీసా తనిఖీ చేసినప్పుడు నకిలీ వీసాలని తెలుస్తుందని కడపకు చెంది బాధితులు తెలిపారు. కాగా గత పదిరోజుల్లో 28మందిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15వేల మంది ఏజెంట్లు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సమాచారం రాబట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాకు చెందిన వారే ఎక్కువగా మోసపోతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.