క్రైమ్/లీగల్

వరకట్నం వేధింపులకు గురై ఉరిపోసుకొని గృహిణి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, జూలై 25: వరకట్నం వేధింపులే గృహిణి మృతికి కారణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై మూడు నెలలకే పచ్చని కాపురంలో చిచ్చురేగి నిండినూరేళ్లు కలసి బ్రతకాలి అనుకున్న గృహిణి కండిపల్లి లక్ష్మి ( 18 ) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలో సంచలనంగా మారింది. నిండు నూరేళ్లు బ్రతకాలని ప్రేమించి పెద్దలను ఓప్పించి పెళ్లి చేసుకున్న లక్ష్మి అందని లోకానికి వెళ్లి పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణంచుకోలేక పోతున్నారు. అత్తంటి వేధింపుల కారణంగా మా కుమార్తె ఉరిపోసుకొని చనిపోయినట్టు తల్లిదండ్రులు రోధిస్తూ ఆరోపించారు. భర్త చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అందించిన వివరాలు ఇలాగవున్నాయి నర్సీపట్నం మండలం దిబ్బాడ గ్రామానికి చెందిన లక్ష్మికి అచ్యుతాపురం మండలం ఎంజెపురం గ్రామానికి చెందిన కండిపల్లి చిరంజీవి లకు గత మే నెలలో వివాహం జరిగిందని అయితే కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదస్పదం రావడంతో నిత్యం గొడవలు పడేవారని, భర్త వేధింపులకు తాళలేక ఈ మేరకు లక్ష్మి మనుస్తాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరిపోసుకొని మృతి చెందినట్టు తెలిపారు. అనకాపల్లి డీఎస్‌పీ ఆధ్వర్యంలో మృతి చెందిన సంఘటన స్థలాన్ని తహసీల్థార్ రవికుమార్, యలమంచిలి సిఐ విజయనాధ్‌తో పాటు ఎస్సై తారకేశ్వరరావులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతి గల కారణాలకు బంధువులను అడిగితెలుసుకున్నారు. శవాన్ని పంచనామా కోసం అనకాపల్లి ఎన్టీఆర్ వంద పడకల ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల వివరణ...ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు ఓకే కులానికి చెందిన లక్ష్మి, చిరంజీవిలు ఇద్దరు బంధువులు కావడంతో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఇరువురు కుటుంబ సభ్యులు ఇష్టపడి అంగరంగవైభవంగా గతమ మే నెలలో వివాహం చేసుకున్నారన్నారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి దాంపత్యంలో వివాదాలు చోటుచేసుకున్నాయని, కొన్ని రోజులగా భార్య లక్ష్మి భర్త చిరంజీవితో తరుచూ గొడవలు పడేది. దీనిలో భాగంగా భర్త చిరంజీవి లక్ష్మిని వేధింపులకు గురిచేయడంతో భరించలేక మనుస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లోకి వెళ్లి ఉరిపోసుకొని చనిపోయినట్టు గ్రామస్తుల కధనం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మావోల అదుపులో గిరిజనుడు ?
జి.మాడుగుల, జూలై 25: పోలీసు ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గిరిజన యువకుడిని మావోయిస్టులు అపహరించినట్టు తెలిసింది. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ సప్పలమామిడి గ్రామానికి చెందిన కొర్రా రాజేష్‌ను నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు అపహరించినట్టు తెలిసింది. పోలీసులతో రాజేష్‌కు సత్సంబంధాలు ఉండడమే కాకుండా వారికి ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఆయనను అపహరించి మంగళవారం సాయంత్రం ఇంజరి గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించినట్టు సమాచారం. ఈ సందర్భంగా రాజేష్‌కు దేహశుద్ధి చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు తెలిసింది.