ఆంధ్రప్రదేశ్‌

పచ్చ చొక్కా వేసుకున్న బిజెపి ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభలో మాట్లాడటానికి సమయం ఎక్కువిస్తారు: విష్ణు
హైదరాబాద్, మార్చి 14: సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే ఆ పార్టీ కండువా లేదా చొక్కా ధరించడం సహజం. కానీ శాసనసభలో మాట్లాడేందుకు తనకు ఎక్కువ సమయం కేటాయిస్తారన్న ఆశతో ఒక ఎమ్మెల్యే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పచ్చ చొక్కాను వేసుకుని సభకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బిజెపి తరపున ఎన్నికయ్యారు. శాసనసభలో ఆయన బిజెపి సభాపక్ష నాయకునిగా కూడా వ్యవహరిస్తున్నారు. సభలో తాను మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని ఆవేదన చెందిన విష్ణుకుమార్ రాజు, ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పచ్చ చొక్కాను ధరించి సోమవారం సభకు వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారన్న ఆశతో పచ్చ చొక్కా ధరించి వచ్చానని చెప్పడం గమనార్హం.