రాష్ట్రీయం

ఏపి సర్కార్ విజన్ డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15లక్షల ఎకరాలకు నీరు
నదీ జలాల వినియోగంపై లక్ష్య నిర్దేశం 150-200 టిఎంసి వినియోగానికి ప్రణాళిక

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణకు సాగునీరు సరఫరా చేసే విషయమై రాష్ట్ర జలవనరుల శాఖ ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. రాష్ట్రంలో చిన్న, పెద్ద నదులు 40 వరకు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల మధ్య అనుసంధానం కోసం వీలుగా 736 నీటి జోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో మిగిలిన 52 శాతం జోన్లలో మాత్రమే నీటి ప్రవాహం ఉంటోంది. ఈ జోన్లలో నీటిని మిగిలిన జోన్లకు తరలించి 15 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 150 నుంచి 200 టిఎంసి నీటిని సద్వినియోగం చేసుకుని కరవుజిల్లాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో కొత్తగా 14 లక్షల ఎకరాలకు ఒక పంటకు సాగునీటిని కల్పించాలన్న లక్ష్యంతో జలవనరుల శాఖ డాక్యుమెంట్‌ను రూపొందించింది. గోదావరి నదిలో సాలీనా మూడు వేల టిఎంసి నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఈ నీటిని మళ్లించి, కృష్ణా, గోదావరి, పెన్నార్ బేసిన్ల మధ్య అనుసంధానం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఒక నివేదికను కేంద్రానికి జలవనరుల శాఖ పంపింది.
తొలి దశలో కనీసం 200 టిఎంసి నీటిని మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని కరవు కోరల్లో నుండి విముక్తి చేసేందుకు ఈ డాక్యుమెంట్‌ను రూపొందించామని కేంద్రానికి పంపిన నివేదికలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సగటు వర్షపాతం 940 ఎంఎం. ఇందులో అనంతపురంలో 540 ఎంఎం ఉంటే, ఒక్కోసారి ఉత్తర కోస్తా జిల్లాల్లో 1200 ఎంఎంకి మించిన వర్షపాతం నమోదవుతోంది. ఒక ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడితే, మరో ప్రాంతంలో కరవు నెలకొని ఉంటోంది. రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 199.04 లక్షల ఎకరాలు. ఇందులో 101.17 లక్షల ఎకరాలను రైతులు సాగుచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికపై హంద్రీ-నీవా సుజల స్రవంతి మొదటి, రెండు దశలు, పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల సాగునీటిపథకం, గాలేరు నగరి సృజల స్రవంతి ఫేజ్-1, తోటపల్లి, గుండ్లకమ్మ రిజర్వాయయర్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బిఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టులను చేపట్టారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు తొలుత బడ్జెట్‌లో రూ.4678.13 కోట్లను కేటాయించగా, ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి నిధులు రూ.8124.37 కోట్లు అవసరమని సవరణలు ప్రతిపాదించారు. ఈ ఏడాది ఇంతవరకు సాగునీటి ప్రాజెక్టులకు రూ.5721.25 కోట్లను ఖర్చు పెట్టారు. ఇందులో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూ. రూ.4670.11 కోట్లను, చిన్న తరహా ప్రాజెక్టులకు రూ.1051.14 కోట్లను ఖర్చుపెట్టారు. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి తొలుత రూ.70 కోట్లు కేటాయించి సవరించిన అంచననాల్లో రూ. 105.71 కోట్లకు, వంశధార ప్రాజెక్టు స్టేజి రెండుకు రూ. 63 కోట్ల నుంచి రూ.77.53 కోట్లకు, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 153.89 కోట్ల నుంచి రూ. 190.89 కోట్లకు పెంచారు.