రాష్ట్రీయం

సనాతన ధర్మ వికాసానికి పాటుపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఉద్బోధ
ప్రత్తిపాడు, డిసెంబర్ 24: ప్రాచీనమైన సనాతనధర్మం నిరాదరణకు లోనవుతోందని, ఎంతో విశిష్ఠత గల సనాతనధర్మ వికాసానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఉద్బోధించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని విశ్వనగర్‌లో రెండు రోజుల పాటు జరగనున్న శ్రీ దత్తజయంతి మహోత్సవాలు గురువారం విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ శ్రీ కల్పవృక్ష వరసిద్ధి వినాయకునికి విశేష అర్చనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వగురుపీఠంలో పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులనుద్దేశించి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ అనుగ్రహ భాషణం చేస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు ఉన్నాయని గుర్తుచేస్తూ సనాతనధర్మ ఆవశ్యకతను భక్తులకు ఉద్బోధించారు.
పంచభూతాల సమతుల్యత దెబ్బతినడం వల్లే ప్రపంచంలో అనేకచోట్ల ప్రళయాలు సంభవిస్తున్నాయని, ప్రళయాలు సంభవించకుండా ఉండాలంటే ప్రకృతి సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి నేడు ఎంతో మంది ఉన్నతస్థితికి ఎదిగారని, వారంతా తమ గ్రామాల అభివృద్ధితో పాటు సమాజ అభ్యున్నతికి కూడా పాటుపడాలన్నారు. విశ్వమానవ సమైక్యతాకృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
సర్వజనశాంతి కోసమే విశ్వనగర్‌లో తాను హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న శ్రీ దత్తజయంతి మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం విశ్వంజీ మహరాజ్ తొలుత శ్రీకల్పవృక్ష వరసిద్ధి వినాయకునికి విశేష అర్చనతో పాటు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, విశ్వగురుపీఠం వద్ద గల ఔదాంబరీ వృక్షం చుట్టూ ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో శ్రీ గణపతిపూజతో పాటు శ్రీ దుర్గ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణను భక్తులు నిర్వహించారు. పూజలో విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
**దత్త జయంతి సందర్భంగా విశ్వనగర్‌లో శ్రీ కల్పవృక్ష వరసిద్ధి వినాయకునికి పూజచేసి హారతిస్తున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్