ఆంధ్రప్రదేశ్‌

13మందికి ఆంత్రాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 26: విశాఖ జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్ మళ్లీ విజృంభించింది. హుకుంపేట మండలం పనసపుట్ గ్రామంలో ఏకంగా 13 మంది అంత్రాక్స్ వ్యాధి బారినపడ్డారు. వీరిలో ఓ మహిళ, ఏడాది బాలుడు ఉన్నారు. వీరందరినీ చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు మంగళవారం రాత్రి తరలించారు. ఆసుపత్రిలో వీరిని ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి ఆంత్రాక్స్ ఎలా సోకిం ది అన్న దానిపై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆంత్రాక్స్ లక్షణాల కలిగిన 13 మంది గిరిజనులు కెజిహెచ్‌కు తరలించారని, వీరికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మధుసూదన్‌బాబు నిర్ధారించారు.