ఆంధ్రప్రదేశ్‌

మరికొంత కాలం ఆగాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అధిష్ఠానం ఇష్టం
ఎవరికిచ్చినా ఆమోదయోగ్యమే

విశాఖపట్నం, మార్చి 13: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి మరికొంత కాలం పట్టేటట్టుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అధ్యక్షుడి నియామకం చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం. అధ్యక్షుడి నియామకం విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానందేనన్న సంకేతాలు వినవస్తున్నాయి. గత కొంతకాలంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు స్థానే మరో నేతకు పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు పార్టీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విభజనానంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, సమీకరణాల నేపథ్యంలో అధ్యక్షుడి నియామకం విషయంలో తొందరపాటు కూడదనే రీతిలో అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నది పార్టీ వర్గాల అంచనా.
అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో పలు సమీకరణలను పరిశీలిస్తున్న అధిష్ఠానానికి నూతన అధ్యక్షుడి ఎంపిక్ష విషయం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్న అధిష్ఠానం సామాజిక వర్గ సమీకణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బిజెపికి సినీనటుడు పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందించారు. సామాజిక వర్గం పరంగా పవన్ సహకారం అటు బిజెపితో పాటు ఇటు తెలుగుదేశం పార్టీకి సైతం లాభించింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని పంచుకున్న బిజెపి, భవిష్యత్‌లో పార్టీ సొంతంగా బలం పుంజుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సీనియర్ నాయకుడు, కీలక సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఇదే సందర్భంలో సోము వీర్రాజు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తీరును పలు సందర్భాల్లో ఎండగట్టినా అధిష్ఠానం అభ్యంతరం చెప్పలేదు. ఈ అంశంలో బిజెపి మిత్రధర్మాన్ని విస్మరిస్తోందని తెలుగుదేశం వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు సరైన ప్రాధాన్యత లేదని, ఇదేమి మిత్ర ధర్మమని బిజెపి నేతలు అంటున్నారు.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల్ని సోము వీర్రాజుకే అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం సమంజసం కాదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వీర్రాజుకు పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే చోటుచేసుకునే పరిణామాలతో లేనిపోని తలనొప్పిలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి నియామకంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కంటే కొంతకాలం వేచిచూసే ధోరణి అవలంభించడం మంచిదనే భావనతో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం.