ఆంధ్రప్రదేశ్‌

వాచ్‌టవర్ నుంచే ఖైదీల పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగురు జైలు అధికారులపై వేటు..సెలవుపై జైళ్ల సూపరింటెండెంట్

కడప, డిసెంబర్ 29: కడప సెంట్రల్ జైలులో నలుగురు జీవిత ఖైదీలు పరారుకావడంతో ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి చర్యలకు దిగింది. ఖైదీలు వాచ్ టవర్ నుంచే పరారైనట్టు నిర్ధారణకు వచ్చారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజమ్మ మంగళవారం సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఆరుగురు జైలు అధికారులపై మంగళవారం ప్రభుత్వం వేటువేసింది. జైళ్ల డిఐజి కృష్ణారాజు మంగళవారం సాయంత్రం కడప సెంట్రల్ జైలుకు చేరుకుని అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. జైల్లో పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ రామకృష్ణ, జైలర్లు గురుశేఖరరెడ్డి, శేషయ్య, డిప్యూటీ జైలర్లు బ్రహ్మారెడ్డి, గోవిందరాజు, హెడ్‌వార్డన్ గోపాల్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జైల్లో మరమ్మతులు సమయంలో అధికారులు, సిబ్బంది అక్కడే మకాం వేసి పనులు పూర్తయిన తర్వాత అక్కడి సామాగ్రిని స్టోర్‌రూమ్‌కు చేర్చాల్సి వుంటుందని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీలు పారిపోయారని డిఐజి పేర్కొన్నారు. సెంట్రల్ జైల్ నిర్వహణపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇంకా దోషులెవరు ఉన్నా వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. డిఐజి కృష్ణరాజు సెంట్రల్ జైలు లోపల, వెలుపల క్షుణ్ణంగా పరిశీలించి జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు, నిందితులను తనదైన శైలిలో విచారించారు. ఖైదీల పరారీలో జైలు అధికారుల తప్పిదం స్పష్టం కన్పిస్తోందని చెప్పారు. తొలుత ఉన్నతాధికారులు హుటాహుటిన కడపకు వచ్చారు. జైళ్ల డిఐజి జయవర్దన్, మరికొంత మంది సివిల్ పోలీసు అధికారులు సెంట్రల్ జైలుకు చేరుకుని ఖైదీల పరారీపై సమగ్ర విచారణ చేపట్టారు. నాలుగురోజుల క్రితమే నగరంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ బాలాజి అనే ఖైదీ పరారయ్యాడు. సోమవారం , ఏకంగా నలుగురు జీవిత ఖైదీలు పరారీ కావడంపై సెంట్రల్ జైల్ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సెంట్రల్ జైలులో గత కొన్నిరోజులుగా వివిధ భవనాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం తాపీ పనివారు బొంగులు, తాళ్లు జైల్లోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం పారిపోయిన చిత్తూరు జిల్లాకు చెందిన రవి, రామచంద్ర, కర్నూలు జిల్లాకు చెందిన దేవా, అనంతపురం జిల్లాకు చెందిన హనుమంతప్పలు పలు హత్యలకేసుల్లో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. వీరి నలుగురు ముందస్తు పథకం ప్రకారం అక్కడ ఉన్న బొంగులు, తాళ్లద్వారా నిచ్చెన తయారుచేసుకున్నారు. ఆ నిచ్చెనను సెంట్రల్ జైలులో కొండవైపు సెంట్రీ టవర్‌కు వేసి లుంగీలు, పంచెలు, తాళ్లను పొడవుగా ముడులు వేసి సెంట్రీటవర్ నుంచే బయటకు వెళ్లారు. సాయంత్రం భోజనం సమయానికి తోటి ఖైదీలంతా భోజనానికి వెళ్లగా, ఆ సమయంలో సెంట్రీల కళ్లుగప్పి నలుగురు పరారయ్యారు. వీరంతా ఏకంగా సెంట్రీ టవర్ నుంచే తప్పించుకుని పోవడం వెనుక కొందరు జైలుసిబ్బంది సహకారం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో అత్యంత తీవ్ర కలిగిన ఎర్రచందనం స్మగ్లర్లు, ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడిన వారు ఉన్నారు.