ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో జలాశయాలకు భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : కుండపోత వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాలకు గురువారం భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైవాడ రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 113.5 మీటర్లకు చేరింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. పెద్దేరు జలాశయం రెండు గేట్లు ఎత్తి 2 వేల క్యూసెక్కులు దిగవకు విడుదల చేశారు. మాడుగుల పెద్దేరు జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లుకు గానూ ప్రస్తుతం-136.5 మీటర్లుగా నమోదు అయ్యింది.