వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంక్‌కు సంబంధించిన ప్రతి బిట్‌ని పరిశీలించి దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తీవ్రంగా అనే్వషిస్తున్నాడు.
అలా చాలా సమయం గడిచిపోయింది.
బ్యాంక్‌లో తిరిగి డిపాజిట్లు పెరగడానికి కస్టమర్స్‌ని మునుపటిలా ఈ బ్యాంక్ వైపు మరల్చుకోవడానికి...
ఎలాగైనా ఈ రోజు ఓ ప్రణాళిక రూపొందించుకోవాలని స్థిరంగా అనుకున్నాడతను.
అందుకే పాండవీయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
వాస్తవానికి మనీ మనీ బ్యాంక్ ఇతర బ్యాంక్‌లు చెల్లించే వడ్డీ కంటే ఎక్కువే చెల్లిస్తోంది డిపాజిట్‌దార్లకు.
అందులో నో డౌట్.
కానీ కస్టమర్లకి నమ్మకం కలిగించాలి. వాళ్లలో పేరుకుపోయిన అభద్రతా భావాన్ని తొలగించాలి. అదీ అతని ముందున్న అసలు సవాల్.
దాన్ని అధిగమించాలంటే...
పాండవీయానికి మూడు మార్గాలు కన్పించాయి.
ఒకటి!
సిటీలోని మనీ మేకర్స్‌ని దశల వారీగా స్వయంగా కలిసి బ్యాంక్‌తో లావాదేవీలు జరిపేలా వాళ్లని ఒప్పించగలగడం.
రెండు!
ఉద్యోగస్థుల్ని కూడా డిపార్ట్‌మెంట్‌ల వారిగా సంప్రదించి బ్యాంక్‌పైన సదభిప్రాయం కలిగేలా నచ్చచెప్పడం. వాళ్ల నుండి సాధ్యమైనంత వరకు డిపాజిట్లని సేకరించడం.
మూడు!
ఈ రెండింటి కంటే ముందు మనీ మనీ బ్యాంక్ గురించి విస్తృతంగా ప్రచారం జరపడం. అన్ని మీడియాల ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం.
దీంతో మిగతా జనాలకి బ్యాంకంటే విశ్వాసం కుదురుతుంది.
వాళ్లలో బ్యాంక్ వైపు కదలిక మొదలవుతుంది.
పై ఆలోచనలను ఆశాజనకంగా తోచాయతనికి.
ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించి చేయాల్సిందేమీ లేదన్పించిందతని మనస్సుకి.
* * *
అఖిల్ తనదైన బాణీలో చెప్పుకు పోతున్నాడు.
ప్రజలు ఆశ్చర్యంతో వింటున్నారు - తెలిసిన కథని తెలియని కోణంలో.
1989-2-22
శనివారం ఉదయం పది గంటలు.
‘సతీష్’ అంటూ పిలిచాడు రవీందర్. వాళ్లింటి గుమ్మం ముందు నిలబడి. ఆ కుర్రాడి వయసు పధ్నాలుగు ఉంటుంది.
రెండవసారి పిలిచిన పిలుపునకు బయటకు పరుగెత్తుకొచ్చాడు సతీష్. ఎనిమిదేండ్లుంటాయతనికి.
వస్తునే ‘బాల్ తెచ్చావా’ అనడిగాడు.
క్రితం రోజు సాయంత్రం సతీష్‌తో రవీందర్ చెప్పాడు - మర్నాడు ఆడుకోవడానికి బాల్ తీసుకు వస్తానని. అందుకని బాల్ గురించి అడిగాడలా.
‘తేలేదు. మా ఇంట్లో ఆడుకుందాం. నువ్వే అటురా’ అంటూ పిలిచాడు సతీష్‌ని.
‘సరే’నంటూ రవీందర్ వెంట కదిలాడు.
వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే వీధిలో ఉంటారు.
సతీష్‌ని వెంట తీసుకొని రవీందర్ ఇంటికి వెళ్లేసరికి గుమ్మంలో ఎదురయ్యాడతని తండ్రి.
‘రవీ సూపర్ బజార్‌కు వెళ్లి అరకిలో గోధుమ పిండి తీసుకురా’ అంటూ కొడుక్కి డబ్బులందించాడు నారాయణ.
ఆడుకునే మూడ్‌లో వున్న రవీందర్ అయిష్టంగానే డబ్బులు తీసుకున్నాడు.
కొడుకు వాలకాన్ని గమనించిన నారాయణ ‘త్వరగా తెచ్చిచ్చి ఆడుకో. నువ్వొచ్చేదాకా సతీష్ వుంటాడ్లే’ అన్నాడు.
రవి పిండి తీసుకురావడానికి కనీసం అరగంటయినా సమయం పడుతుంది.
వెంట సతీష్‌ని కూడా రమ్మంటే ఓ ప్రమాదం తప్పి ఉండేది. కానీ అలా జరగలేదు. మాట్లాడకుండా వెళ్లిపోయాడు రవి.
కొడుకు వెళ్లిపోయాక సతీష్‌ని లోపలికి పిలిచింది కమల. మాతృత్వాన్ని మరచి అకృత్యానికి సంసిద్ధురాలైన ఆ తల్లి తినమని సతీష్‌కి ఓ లడ్డుచ్చింది.
వద్దన్నాడు మొదట. బలవంతం చేయడంతో లడ్డూ అందుకొని తినసాగాడు సతీష్.
ఇంట్లో అయితే రెండే రెండు బుక్కల్లో ఆ లడ్డూని తినేసేవాడేమో ఇక్కడ బావుండదని కొంచెం కొంచెం కొరుక్కుంటూ నెమ్మదిగా తింటున్నాడు.
అయితే అయిదు నిమిషాల అనంతరం...
ఆ కుర్రాడ్ని మత్తు కమ్మేసింది.
అత్యంత శక్తివంతమైన చెట్ల పసర్లతో తయారుచేయబడ్డ మత్తు మందు. అందులో కలపబడిందని వాడికేం తెలుసు.
మత్తు నరాల్లోకి ప్రవహిస్తుంటే తూలిపడబోయాడు.
వాడిని రహస్యంగా గమనిస్తున్న నారాయణ, కమలలు ఏమీ ఎరుగని అమాయకుల్లా పరుగెత్తుకు వచ్చి ‘ఏమైంది సతీష్’ అంటూ కంగారుగా అడిగారు.
అప్పటికే పూర్తిగా మైకం కమ్మేసింది. పడకుండా పట్టుకొని అక్కడే కింద పడుకోబెట్టాడు నారాయణ.
భార్యకు ఏదో పని చెప్పి పురమాయించాడు.
అత్యంత హేయమైన రాక్షస చర్యకి సాక్ష్యం మేముండలేమన్నట్లు ఆ వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది.
ఆ దంపతులకి కావాల్సిందదే.
అనుకున్నట్టే జరుగుతుండటంతో విధి కూడా సహకరిస్తోందని భావించాడతను.
సతీష్ నుదుటన ఎర్ర తిలకం దిద్దింది కమల. తులసి నీళ్ళు పెదాలు తెరచి నోట్లో పోసాడు నారాయణ. మిగిలిన నీటిని పిల్లవాడి ఒంటిపై చల్లాడు.
అర నిమిషంపాటు మనసులో ఏవో అక్షరాల్ని పఠించాడు.
తక్షణం ఆ కుర్రాడ్ని అమాంతంగా పైకి లేపి తన భుజంపై వేసుకున్నాడు. బలికి సిద్ధమైన మేక పిల్లడతడు.
జాలిలేదు. కరుణ లేదు.
ఆర్తి లేదు. ఆర్ద్రత లేదు.
వాళ్ళది రాతి గుండె. మనుషుల్లో రాక్షసులా ఇద్దరు.
మూఢ నమ్మకాన్ని అణువణువునా జీర్ణించుకొని, మానవ బలితో వరాలు సిద్ధిస్తాయనే మూర్ఖత్వంతో.. బలికి సిద్ధమయ్యారు.
ఇంటి ప్రక్కన వీధి మలుపులో వేప చెట్టు ఉంది. ఆ చెట్టు నీడన కొలువై ఉన్న ఆంజనేయుడి శిలాఫలకం ముందుకి ఆ బాలుడ్ని తీసుకువచ్చారు.
దేవుడి ముందు ఆ బాలుడ్ని పడుకోబెట్టారు.
దైవానుగ్రహం కొరకు సాస్టాంగ నమస్కారం చేసారిద్దరు.
లేచి కమల ఆ కుర్రాడ్ని ఒడిసి పట్టుకుంది కదలకుండా. పెదాల్తో కొన్ని అక్షరాల్ని జపిస్తూ వాడి పీక నులిమేసాడు నారాయణ.
మత్తులోనే లిప్తకాలం ఉలిక్కిపడి విలవిల్లాడిన ఆ పసివాడు గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. అతని శ్వాస అనంతవాయువుల్లో లీనమైపోయింది.
వేప చెట్ట కొమ్మల్లో ఎక్కడో దాగున్న ఓ చిన్నారి పిట్ట సైతం ఆ ఘాతుక చర్యకి ఉలిక్కిపడి ఓ కన్నీటి బొట్టు నేల రాలుస్తూ బాధాతప్త హృదయంతో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయిందక్కడి నుండి.
సతీష్‌లో చలనం ఆగిన మరుక్షణం తృప్తిగా తలలాడించారిద్దరు.
బలి విజయవంతమయ్యిందన్న పైశాచికానందం కదలాడింది వారి కళ్ళల్లో.
చేసిన పాపపు పని నుండి తప్పించుకునే ప్రయత్నం మొదలయ్యింది. అందుకో పథకం కూడా సిద్ధమైంది.
ఆ పసివాడి శవం నాటకీయంగా సతీష్ పేరెంట్స్‌కి అప్పచెప్పాడు నారాయణ.
* * *
చెప్పడం పూర్తి చేసి ఆయాసంతో ఆగిపోయాడు అఖిల్.
కళ్ళముందు కదలాడిన దృశ్యాలు అదృశ్యమయ్యాయి. మెదడుకి సంకేతాలు నిలిచిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చూపులు నిర్మలమయ్యాయి.
ముఖంలోని తేజస్సు మాయమయ్యింది.
మునుపటిలా మారిపోయాడతను.
(ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన న్యూస్ పై సంఘటనకు ఆధారం. ప్రదేశం కూడా అదే కావడంతో నిజ జీవితంలోని పేర్లే.. ఆయా పాత్రలకి ఉంచడం జరిగింది.)
అంతసేపు ఆ చిన్నారి పడ్డ మానసిక క్షోభని కళ్ళారా చూసిన నివేదిక తట్టుకోలేకపోయింది. దుఃఖంతో కొంగుని నోట్లో కుక్కుకొని వౌనంగా రోదించింది. కొద్ది క్షణాలే అయినా చిగురుటాకులా వణికిపోయిన అఖిల్ రూపమే కళ్ళముందు కదలాడుతుంటే... వాడు తిరిగి మామూలుగా మారిపోవడాన్ని గమనించలేదామె. తమ చుట్టూ జాతరలా పోగైన జనాల్ని చూసి కంగారుపడ్డ అఖిల్ తల్లిని తడుతూ అమాయకంగా అడిగాడు.
‘‘దేవుడి దగ్గరకు ఇంత మంది వచ్చారేంటి మమీ’’.
చప్పున వాడ్ని అక్కున చేర్చుకుని ఆర్తిగా గుండెకి హత్తుకుందా మాతృమూర్తి. గొంతు పెగల్లేదామెకు.
ఏం చెప్పాలి.
‘దేవుడి కొరకు కాదురా నాన్నా, నీ చెంతకే.. నీలోని అద్భుతాన్ని తిలకించడానికిరా కన్నా’ అనుకుంటూనే..
‘ఈ మాయదారి జబ్బు నీకే తగలాలా’ అంటూ పరిపరి విధాల ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది.
అప్పుడు మొదలయ్యింది జనంలో కలకలం.
ప్రతి ఒక్కరూ చెవులు కొనుక్కున్నారు.
‘‘ఆ బాబు సెప్పిందంతా నూటికి నూరు పాళ్ళు నిజమే. పోలీసులు గూడా ఎంక్వైరీ జేసిండ్రూ. అయినా హత్తెవలు జేసిండ్రో తెల్వలేదు. దొంగ సచ్చినోడు. కొప్పుల నారిగాడే ఆ పొలగాన్ని సంపి నాకేం దెల్వదని కేసు తప్పించుకున్నడన్నమాట’’ అదిచారెవరో ఆ గుంప నుండి.
‘‘గీ పొలగాన్ని ఆంజనేయస్వామి పూనిండు. జరిగింది అదని వివరంగా సెప్పించిండు’’ తిరిగి అన్నారెవరో.
‘‘ఇంకా సూత్తారేందిరా అంజన్నకు దంతవెట్టుకోండ్రీ...’’ మరొకరు అరిచారు.
మంత్రంలా పనిచేసిందా మాట.
ఆ గుంపులో కోలాహలం మొదలయ్యింది. చివరికది అఖిల్‌ని దేవుడు ఆవహించాడని జనమంతా భక్తితో చేతులెత్తి మొక్కే వరకూ వెళ్ళింది.
వాళ్ళ చర్యకు భీతిల్లిన నివేదిత ఎంతగా కదలిపోయిందంటే... సన్నని ప్రకంపన మొదలయ్యిందామెలో.
అఖిల్‌కిదంతా అర్థమవడం లేదు. అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు.
ఏదైనా దుష్టశక్తి అఖిల్‌ని ఆవహించిందేమోననే అనుమానంతో ఈ ఊళ్ళో ఎవరికైనా చూపిద్దానే మిషతో అంత దూరం నుండి తాను ఈ వూరు వచ్చింది. కానీ ఏం జరిగింది. తన ఆలోచనలకి అర్థంపర్థం లేకుండా పోయింది.
‘తనకంటే మూఢుల్లా వున్నట్టున్నారు. వాడిలో దైవశక్తిని చూస్తూన్నారీ జనం. విరుద్ధ్భావ ప్రకటపనలివి. ఇంకా ఇక్కడే ఉంటే బాబుని మూర్ఖత్వంతో ఏం చేస్తారో తెలీదు’ అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడినుండి వెళ్ళిపోవలని నిశ్చయించుకుంది నివేదత.
జనం వలన హడలెత్తిన బాబుకి జరగరానిదేమైనా జరిగితే... ఆ ఊహే భరింపలేనట్టు..
అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలన్న ఆలోచనని సైతం క్షణంలో మార్చేసుకుని, ఆ జనంలోంచి ఎలాగోలా బయటపడి, వెళ్తోన్న ఆటో ఆపి ఎక్కి కూర్చుంది.
ఎవ్వరూ తల్లీకొడుకుల్ని వారించలేదు. అదే ఆమెకు ప్లస్సయ్యింది.
ఓ నగ్నసత్యం వెలికితీయబడి-
కొత్త కోణంలో హత్య కేసు ప్రత్యక్షంగా బయటపడడంతో ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.
విశేషమేంటంటే..
మరుగున పడిన హత్య అఖిల్ చేత వెలికి తీయబడ్డా.. అక్కడినుండి అతడు వెళ్ళిపోగానే అఖిల్ గురించి మరచిపోయారంతా. హత్య గురించి హంతకుడి గురించి ప్రధానంగా చర్చించడం మొదలుపెట్టారు.
5
ఒకే ఘటన ఇరువర్గాలకి లాభించడం అరుదైన విషయం.
అలాంటిది గోదావరి ఖనిలో జరిగిన ఆ సంఘటన మువ్వురికి మూడు రకాలుగా లాభించింది.
ఎలాగంటే-
ఒకటి.
తన కొడుకు విషయంలో నివేదిక మరింత జాగ్రత్తపడేలా చేసింది.
రెండు.
సతీష్ అనబడే ఆ కుర్రాడి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయి... వాస్తవానికి కేసు క్లోజ్ చేయబడిందెప్పుడో!
కానీ ఇప్పుడు సస్పెన్స్ వీడి అసలైన హంతకుల్ని అరెస్ట్ చేయడానికి స్థానిక పోలీసు వర్గాలకు మార్గం సుగమమయ్యింది.
తగిన సాక్ష్యాధారాల కోసం తిరిగి పోలీసుల వేట ప్రారంభమైంది.
మూడు.
ఒక ప్రదేశంలో అఖిల్ గనక అడుగిడితే.
అనూస్య రీతిలో అక్కడ జరిగిన ఘటనల్ని చారిత్రాత్మకమైన మలుపులా కళ్ళకు కట్టినట్లు చెప్పగలగే.. అద్భుత శక్తి అతనిలో దాగుందన్న సరికొత్త విషయం... సుడిగాలిలా మరొక వ్యిక్తికి చేర్చబడింది!
ఆ అదృశ్య శక్తి తనకందిన ఈ వార్తకి ఎంతగా రియాక్టయ్యాడంటే.
తాను తలపెట్టిన మహాయజ్ఞానికి రంగం సిద్ధం చేసుకున్నాడా క్షణంలోనే.
***
ట్రింగ్... ట్రింగ్...
ఫోన్ రెండుసార్లు రింగయ్యింది.
‘‘ప్రణితా! ఫోన్ లిఫ్ట్ చేయ్’’ షేవింగ్ చేసుకుంటున్న పాండవీయం లోపలున్న భార్యను కేకేసి పిలిచాడు.
‘‘వస్తున్నానండీ!’’ అని సమాధానమిస్తూనే, గబగబా వచ్చి ఫోనెత్తింది ప్రణిత.
‘‘హలో!’’ అవతలి వైపు నుండి.
‘‘ఆ... హలో!’’
‘‘హలో! ఎవరండీ?’’
‘‘నేను... ప్రణితా పాండవీయాన్ని మాట్లాడ్తున్నాను. ఇంతకీ మీరెవరు?’’ గొంతు సరిగా పోల్చుకోలేకపోతోంది.
‘‘పిచ్చిదానా! ఎవరంటావేం? నేను! నిన్ను మనసారా ప్రేమించిన పాపానికి నీతో ఘోరంగా అవమానింపబడ్డాను. అది భరించలేక ఆసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాను. నీమీద కోరిక చావక ఆత్మగా మారి ఇదిగో ఇలా నీ జీవాత్మ చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రేమాత్మను, హ్హ.. హ్హ.. హ్హ..’’ అంటూ ఓ భయంకరమైన నవ్వు గుండెల్ని జలదరింపచేసేలా విన్పించిందవతల వైపునుండి.
‘‘కెవ్‌వ్...’’మని అరిచింది ప్రణిత. ఝడుసుకుందామె.
అప్రయత్నంగా ఆమె చేతి వేళ్ళు రిసీవర్ చుట్టూ బలంగా బిగుసుకున్నాయి.
అవతలవైపునుండి మళ్ళీ మాటలు విన్పించసాగాయి.
‘‘చేసిన పాపం ఊరికే పోదు. అందుకే నిన్ను వెంటాడుతున్నాను. ఆసిడ్ తాగడమే కాదు. ముఖంమీద కూడా పడిందని తెలుసుగా? ఆసిడ్ పడ్డ నా ముఖం ఎలాంటి వికృతాకృతి దాల్చి ఉంటుందో నీ ఊహకే వదిలి వేస్తున్నాను’’ అంటూ చిన్న గ్యాప్.
తిరిగి ‘‘ప్రేతాత్మలు ఫోన్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నావా? లేక నీ మాయదారి బ్రెయిన్‌తో మంత్రగాణ్ణి పిలిచి నా పీడ ఎలా వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? అదేం కుదరదు. నేను నిన్ను అంత తొందరగా వదలడం జరగదు. హ్హ..హ్హ..హ్హ..’’ ఆ నవ్వలా కొనసాగుతూనే వుంది.
శరీరంలోని అణువణువూ భయోద్వేగంతో సన్నగా ప్రకంపిస్తుంటే గజగజా వణికిపోయింది. ముచ్చెమటలు పోసాయి.
ఫోన్ కింద పెట్టాలన్న తలంపే మరచి కొయ్యలా బిర్రబిగుసుకుపోయింది. పాండవీయం ఎప్పుడో బాత్రూమ్‌లో దూరాడు. భార్య అరుపులు గానీ, ఫోన్ సంభాషణ గాని వినబడనంత దూరంలో వున్నాడు.
ప్రణిత ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయింది.
ఇంతలో అవతలివైపు నుండి సన్నగా విన్పించిందిలా.
‘‘మమీ! నేన్రడీ.’’ అని.
ఆ గొంతెక్కడో విన్నట్టన్పించింది.
విన్నట్టు కాదు. బాగా పరిచయమైన గొంతే! ఎవరిదబ్బా? ఆలోచించింది.
యస్. అది అఖిల్ గొంతు.
అప్పుడర్థమయ్యిందామెకు. షాక్ నుండి తేరుకుంది. వెంటనే రియాక్టవుతూ అరిచినంత పనే్చసింది.
‘‘ఒసే నివేదితా నువ్వటే. ఎంతగా హడలి చచ్చానే మొద్దూ. ప్రొద్దునే్న నన్ను పట్టుకు పీడిస్తున్నావేంటి?’’
భయం పోయి, సస్పెన్స్ వీడి, చాలా రోజుల తర్వాత ఫోన్‌లోనైనా తన చిన్ననాటి ఫ్రెండ్ కలిసినందుకు సంతోషం కల్గింది ప్రణితకు.
‘‘హమ్మయ్య! ఇప్పటికైనా గుర్తించావన్నమాట మేమూ మానవమాత్రులేనని! అయినా ఎదుటివారిని హడలుకొట్టిం చడం నీకే కాదు. మాకూ చేతనవుతుందే ప్రణితా. కాలేజీ రోజుల్లో ఎందర్ని ఏడిపించలేదిలా ఫోన్ దయ్యంలా. ఎంతమంది నీ ట్రాప్‌లో పడి భయభ్రాంతులకు లోను కాలేదు. నీవరకొచ్చేసరికి బెంబేలెత్తి పోయావు.
అది సరే! ఆ దయ్యాల పుస్తకాలు, సీరియల్స్ చదవడం ఆపావా? ఇప్పటికీ హర్రర్ సినిమాలు, టీ.వీ. సీరియల్స్ చూస్తూనే వున్నావా? లేక నువ్వే ఓ ఆత్మగా మారి నాకు బదులివ్వడం లేదు కదా!’’ గలగలా నవ్వుతూ అంది.
‘‘నోర్ముయ్యవే! ఏదో కాలేజీ రోజుల్లో సరదాగా ఎంజాయ్ చేయడానికి మగాళ్ళని ఏడ్పించేవాళ్ళం. అయినా అవన్నీ వదిలేసి చాలా కాలమైంది. ఇంత క్రితమే శ్రీవారి బాత్రూమ్‌లో నీళ్ళు పెట్టొచ్చాను. ఇంతలో తమరి ఫోన్. అయినా ఫోన్లో ఇలా ఎంత సేపని. మీవారు ఆఫీసుకి వెళ్ళగానే మా ఇంటికి వచ్చేసేయ్. చాల్రోజులయ్యింది నిన్ను చూసి’’ చెప్పింది ప్రణిత.
‘‘అదేం కుదరదు. నీతో బోల్డు విషయాలు మాట్లాడాలి. మీ ఆయన బ్యాంక్‌కి వెళ్ళగానే నువ్వే నా దగ్గరకు వచ్చేసేయ్’’ అంటూ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసింది నివేదిత.
***
పదకొండు గంటలు దాటాక కల్సుకున్నారిద్దరు.
టీ తాగాక కుశల ప్రశ్నలయ్యాయి.
‘‘ఏంటీ విశేషాలు. సడెన్‌గా ఫోన్ చేశావు. ఇంత కాలానికి నే గుర్తొచ్చానా తల్లీ?’’ ప్రశ్నించింది ప్రణిత.
‘‘నా విషయం సరే! నీవైనా రావొచ్చుగా. ఫోను క్కూడా మొహం వాచానా’’ అంది నివేదిత.
‘‘ఆమధ్య చేశానే! ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రింగ్ మాత్రం అయ్యంది. మళ్ళీ చేద్దామనుకుంటూ మరచిపోయాను.’’ చెప్పింది ప్రణిత.
‘‘అలాగా! మరి నేనెక్కడికి వెళ్ళానబ్బా?’’ ఒక్క క్షణం ఆలోచించింది నివేదిత.
తిరిగి తనే అడిగింది. ‘‘ఏ రోజు చేశావు’’ అని.
చెప్పింది ప్రణిత.’’
‘‘గోదావరి ఖని వెళ్ళాను.’’
‘‘వెళ్ళింది గోదావరి ఖనే! కానీ ఇంటికి వెళ్ళలేదు.’’
‘‘వ్యాట్?’’ ఆశ్చర్యపోయింది ప్రణిత.
‘‘అవునే! నీకో సీరియస్ విషయం చెప్పాలి. సలహాకోసం ఫోన్ చేశాను. నాకో విషమ సమస్య ఎదురయ్యింది.’’
చెబుతోంటే నివేదిత ముఖం వివర్ణమవడం గమనించింది ప్రణిత.
‘‘ప్రతి విషయాన్ని సింపుల్‌గా కొట్టిపడేసేదానివి. నీకు సమస్యలేంటమ్మా? అందునా విషమ సమస్యనా.
వెరీ ఇంట్రస్టింగ్. చెప్పుచెప్పు విందాం’’ ఆసక్తిగా అడిగింది ప్రణిత.
బెలూన్ సాహసం, పిక్‌నిక్‌లో జరిగింది, గోదావరిఖని సంఘటన ఇలా అన్నింటిని క్లుప్తంగా వివరించి చెప్పింది నివేదిత.
‘‘వ్యాట్! వాటే వండర్? దయ్యాలూ, భూతాలు మాత్రమే అద్భుతాలు చేస్తాయని చిన్నతనంలో అనుకునే దాన్ని. ఊహ తెలిసాక సర్కస్ వాళ్ళే సాహసాలు చేస్తారని నమ్మేదాన్ని. మన మనుషులు కూడా అద్భుతాలు చేస్తారని గిన్నిస్‌బుక్ చదివాక విస్తుపోయాను. మీవాడూ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడంటే రియల్లీ సూపర్బ్! నమ్మలేకపోతున్నాననుకో’’ హుషారుగా అంది ప్రణిత.
‘‘పెళ్ళై ఇనే్నళ్ళయినా పిల్లచేష్టలింకా పోలేదు. అడ్వెంచర్ నేచర్ కూడా నిన్నింకా వదలనట్లే వుంది.’’ చిరుకోపంగా అంది.
‘‘అది లేకపోతే లైఫ్‌లో థ్రిల్ ఏముంటుంది చెప్పు?’’
‘‘అందుకేనా లేట్‌గా మ్యారేజ్ చేసుకున్నావు. పైగా పిల్లల్నింకా కనకుండా ఆగావు.’’
‘‘లేకపోతే అన్నింటికీ నీలా తొందరపడిపొమ్మంటావా? అప్పుడే అమ్మను, అమ్మమ్మనైపోయి లైఫ్‌ని రొటీన్‌గా గడపమంటావా?’’
‘‘అది సరే! అఖిల్ విషయంలో ననే్నం చేయమంటావో చెప్పవే. ఆయన్నడిగితేనేమో వాడికేం కాలేదంటూ కసురుకుంటున్నారు. వీడి వాలకం చూస్తేనేమో క్షణక్షణం తగపుడుతోంది.’’
- ఇంకా ఉంది

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055