రాష్ట్రీయం

ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న భద్రాద్రి బాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4గంటల 8నిమిషాల 4సెకన్ల నిరంతరాయంగా నృత్యం

ఖమ్మం, డిసెంబర్ 4: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది భద్రాద్రికి చెందిన 11 ఏళ్ళ బాలిక. తనకు ఆసక్తి ఉన్న నృత్యాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత భద్రాచలంకు చెందిన తూము సాయిస్నేహితకి దక్కింది. చిన్ననాటి నుండి తన ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మిలు కూచుపూడి నృత్యంలో బాలికకు శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రుల ఆశయాన్ని, తన లక్ష్యాన్నికి అనుగుణంగా అహర్నిశలు శ్రమిస్తూ తన వయస్సుకు మించి సాధన చేసి మూడు రికార్డులను సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నిరంతరాయంగా కూచుపూడి నృత్యం ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీ అవార్డులను దక్కించుకుంది. శుక్రవారం మండల పరిధిలోని తనికెళ్ళ సమీపంలో గల లక్ష్యా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో4 గంటల 8 నిమిషాల 4 సెకన్ల పాటు ప్రదర్శన చేసి వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్‌ఆఫ్ రికార్డు, తెలుగు బుక్‌ఆఫ్ రికార్డులను సాధించింది. దీంతో జిల్లాతో పాటు రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసింది. దీంతో జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కళాకారులు, జిల్లా ఉన్నతాధికారులు బాలికను ప్రశంసించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి కార్యక్రమంలో జిల్లా చైర్‌పర్సన్ గడిపల్లి కవిత బాలికకు శాలువాలతో ఘనంగా సత్కరించి,ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందించారు. చిన్న వయస్సులోనే తెలంగాణ సంస్కృతి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం హర్షించదగ్గ విషయమన్నారు.ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందని, కళాకారులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. పిల్లల ప్రతిభను వెలికితీయడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం అన్నారు.