రాష్ట్రీయం

యానాంలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిలోకి దూసుకుపోయిన కారు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
మరొకరు గల్లంతు
యానాం, డిసెంబర్ 12: యానాం తీరప్రాంత గ్రామమైన దరియాలతిప్ప పారిశ్రామిక వాడ వద్ద ఏటిగట్టు నుండి గోదావరిలోకి టాటా ఇండికా కారు దూసుకుపోయిన సంఘటనలో అయిదుగురు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో శనివారం ఉదయం వరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. శుక్రవారం రాత్రి పెద్ద శబ్ధంతో గోదావరిలో ఏదో పడి మునిగిపోయిందన్న సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టగా గోదావరిలో మునిగిపోయిన కారు, అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటనలో మృతిచెందిన వారిని కాకినాడ రూరల్ తూరంగి పంచాయతీ పరిధిలోని రాఘవేంద్రపురం గ్రామస్థులుగా గుర్తించారు. వీరు కాకినాడ రాఘవేంద్రపురం నుండి యానాంలోని దరియాల తిప్ప వెళుతుండగా ఈ ఘటన సంభవించింది.
రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగి ఉండవచ్చునని పలువురు చెబుతున్నారు. అయితే స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. ఈ సంఘటనలో మత్స్యశాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన కొప్పాడి సత్తిరాజు (65), ఆయన భార్య కొప్పాడి ధనలక్ష్మి (60), కోడలు పార్వతి (30), మనుమరాలు హర్షిత (6), రిషిత (4)గా మృతులను గుర్తించారు. అయితే సత్తిరాజు కుమారుడు పవన్‌కుమార్ (35) గోదావరిలో గల్లంతయ్యారు. ఈయన కాకినాడ ఎన్‌ఎఫ్‌సిఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపుచర్యలు చేపట్టారు. (చిత్రం) గోదావరిలో పడిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్న దృశ్యం