ఎలావుందీ వారం?

ఎలా ఉందీ వారం? (నవంబర్ 26 నుండి డిసెంబర్ 2 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక ఉన్నత స్థితి. కార్యసిద్ధి. అన్నింటా జయం. అనుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు గతంలాగ వుండవు. అనుకోని బహుమతులు అందుకుంటారు. కోరుకున్నవి ఆలస్యంగానైనా అందుకుంటారు. కుటుంబం కొరకు కాస్త సమయాన్ని తప్పక కేటాయించాల్సి ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మేలు. అనుకోకుండా లాభాలుంటాయి. వ్యవసాయ రంగం వారు, రియల్ ఎస్టేట్ అనుకూలం. ఆధ్యాత్మిక మెళకువలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. పెట్టుబడులలో లాభాలు. లౌక్యం చూపండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఇష్టులతో శిష్టులతో చర్చలు సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. గౌరవ మన్ననలు అందుకుంటారు. జన సంబంధాలు ప్రయోజనకారి. ప్రయాణాలకు అనుకూలం. మీ పరిశీలన అన్నింటా ఫలప్రదం. ఆశించిన రంగాలు తృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకూల తరుణం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ధ్యాస ఉంచండి. పరధ్యానం కూడదు. పెట్టుబడులతో ఇతరులను ఆకర్షిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనురాగ వాత్సల్యాలుంటాయి. సన్నిహితులు తలలో నాలుకగా ఉంటారు. డబ్బుకి ఇబ్బందులున్నా పరిష్కారమవుతాయి. ఎంచుకున్న రంగాలలో వృద్ధి కానవస్తోంది. అన్ని పనులలో అభివృద్ధి. నిరుద్యోగులకు శ్రమానుకూల ఫలితాలు. విలువైన వస్తువులతో ప్రయాణాదులందు మెళకువ పాటించండి. ఆందోళన పడకండి. వాహన ప్రయాణాలలో వేగ నియంత్రణ మంచిది. వాహన మార్పులకు వీలుంది. నిరాశను దరికి రానీయకండి. అన్నింటా కలసి వస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
శ్రమానుకూలంగా ఫలాలు సంక్రమిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సాంకేతిక రంగాలందు వృద్ధి. విలువైన వస్తువులతో ప్రయాణాదులందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ విస్తరిస్తుంది. స్వల్పంగా జయానుకూలం. నేర్పు, ఓర్పుతో కొన్ని కార్యాలు నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం అనుకూలం. వాతావరణానుకూలంగా మెలగండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
పట్టుదలతో పనులు పూర్తి చేయటం మంచిది. అనుకున్నవి ఫలిస్తాయి. ఎంచుకున్న రంగాలు అనుకున్నట్లు ముందుకు వెళతాయి. ప్రోత్సాహకాలు అందుకుంటారు. సాలోచనలు యోగిస్తాయి. వాహన మార్పులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన కార్యాలు అనుకూలిస్తాయి. శుభ వర్తమానాలు అందుకుంటారు. కష్టనష్టాలకు గురి కాకండి. హితుల సలహాలు విన్నా స్వీయ నిర్ణయాలు మేలు. స్పెక్యులేషన్ ఫలప్రదం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
ధన, సంతాన, ఉద్యోగ, కుటుంబ సమస్యలుంటే పరిష్కరిస్తారు. కొత్త ఆవిష్కరణలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. బహుమతులు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, ఉద్యోగ రంగంలో అనుకోని బాధ్యతలు అందుకుంటారు. విమర్శలు పట్టించుకోకండి. సద్వర్తనాలు సౌఖ్య, సంతోషాదులు ఉంటాయి. దూర ప్రయాణాలున్నాయి. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ ప్రమేయం లేకుండానే కొన్ని మంచి పనులు జరుగుతాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
సమయాన్ని వృధా చేయకండి. మిశ్రమ ఫలాలు శ్రమానుకూలంగా అందుతాయి. పెద్దలు, అధికారుల అండదండలు, ఆశీస్సులతో కార్యసిద్ధి. మనోధైర్యం అవసరం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు విస్తరిస్తాయి. పోటీ తత్వం అధికమవుతుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ కదలికలను గమనించే వారు ఉన్నారని తెలుసుకోండి. కొత్త ప్రణాళికలు మెరుగవుతాయి. ప్రయత్నపూర్వకంగా ఇష్టపడే అన్ని రంగాల వారికి గుర్తింపు ఉంటుంది. వస్త్ర, వస్తు బహుమతులుంటాయి. దూరపు బంధువుల రాక.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులకు సరైన సమయం. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ప్రయాణాలు, సోదర విషయాలు చర్చకు వస్తాయి. వృత్తులందు అనుకోని ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉత్సాహంతో గడుపుతారు. మిత్రులను కూడా కనిపెట్టి ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగాలందు మార్పులకు అనుకూలం. శుభ వర్తమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రగతి. పెట్టుబడులలో స్వల్ప లాభం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. లోగడ ఖర్చులే మరల మరల ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలసి మంచి కార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగావకాశాలు. ఎంచుకున్న రంగాలలో వృద్ధి కాన వస్తుంది. స్పెక్యులేషన్ విస్తరిస్తుంది. నిర్ణయాలు అవకాశాన్నిబట్టి మార్చుకోవలసి వస్తుంది. పెద్దల అండదండలుంటాయి. నిరాశను దరికి రానీయకండి. అన్నింటా కలసి వస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
అన్నింటా శుభం జరుగుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. ఆహార వ్యవహారాలలో మెళకువ పాటించండి. జాగ్రత్త వహించండి. కంటి, పంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మీరు ఎంచుకున్న రంగాలు శ్రమానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లాభాలు. శత్రు విజయం. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోండి. స్ర్తిలు చేసే వ్యవహారాలు ఫలవంతం.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. చర్చలు అన్నింటా అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ర్తిల సాయం అందుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి. బంధుమిత్రులతో ఓ వేడుకలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు ఉంది. స్పెక్యులేషన్ ఫలదాయకం. విద్య, సాంకేతిక రంగాలు విస్తరిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయ వృద్ధి. ఉన్నతి. ఓపికతో మెలగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. అన్నింటా యోగదాయకం. భజనపరులను దూరంగా ఉంచండి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు గతంలాగ ఉండవు. అనుకున్నట్లు కొన్ని పనులు విస్తరిస్తాయి. రాబడికి తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టండి. పరిధులు దాటకండి. మంచిని పెంచండి. క్రోధాన్ని జయించండి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855