రాష్ట్రీయం

ఓడిపోయిన టిడిపి నేతలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా ధ్వజం
హైదరాబాద్, జనవరి 2: నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధులను ఓడిపోయిన టిడిపి నేతలు కూడా ఖర్చుపెట్టే విధంగా, వారి ప్రతిపాదనలను ఆమోదించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణమని, ఇది ప్రజాప్రతినిధులను అవమానపరచడమేనని వైకాపా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది. ఇది చీకటి జీవో అని అభివర్ణించింది. అభివృద్ధి నిధుల కేటాయింపులో స్ధానిక ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేయడం, వారి అభిప్రాయాలకు తావులేకుండా చేయడం అప్రజాస్వామికమని, ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. శనివారం విలేఖర్ల సమావేశంలో వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మాట్లాడుతూ, కాల్‌మనీ రాకెట్‌లో నిందితులతో తిరిగిన ప్రజాప్రతినిధులను కూడా అభివృద్ధి నిధులను ఖర్చుపెట్టే విధంగా స్వేచ్ఛ ఇవ్వడం తప్పన్నారు. రాయచోటి, బాపట్ల, సంతనూతలపాడు, కమలాపురం, మైదుకూరు, అరకు, ఆళ్లగడ్డ, ఇతర నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధుల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతరవేసినట్లేనన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించడం రూల్స్ బుక్‌కు వ్యతిరేకమన్నారు.