S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/07/2019 - 23:35

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 7: స్నేహితులతో కలిసి సొంత పెదనాన్న ఇంట్లోనే యువకుడు చోరీకి పాల్పడిన కేసులో ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 477 గ్రాముల (సుమారు అరకేజీ) బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏసీపీ కే శ్రీనివాసరావు తెలిపారు. వన్‌టౌన్ పోలీస్టేషన్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

09/07/2019 - 23:30

పాయకాపురం, సెప్టెంబర్ 7: ప్రమాదవశాత్తు బాలుడు బస్సు వెనుక టైర్ కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని కుందావారి కండ్రిక గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో నివాసముంటున్న గంగరాజుకు పాప, బాబు సంతానం. పాపను పాయకాపురంలోని అక్షర నందన స్కూల్‌లో చదివిస్తున్నాడు.

09/07/2019 - 23:29

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 7: తక్కువ ధరకే బంగారం లభిస్తుందని నమ్మించి ఓ పెళ్లి వారిని రూ. 8 లక్షల మేరకు మోసగించి పరారైన నిందితునిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వారణాసిలో పరిచయమైన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం వాసులను విజయవాడకు రప్పించి రూ. 8 లక్షలతో ఉడాయించాడు. టీ నర్సాపురానికి చెందిన అట్లారి విజయలక్ష్మి(44)కి ముగ్గురు మగ పిల్లలున్నారు.

09/07/2019 - 23:28

గుడివాడ, సెప్టెంబర్ 7: గత ఏడాది గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన దొంగతనం కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీఐ ఎల్ రమేష్ నిందితురాలు, బంగారు ఆభరణాలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

09/07/2019 - 22:59

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సెప్టెంబర్ 7: లా విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద ఇంటితోపాటు ఆయన ఆధ్వర్యంలోని ఆశ్రమం, కాలేజీలను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సందర్శించింది. ఐజీ నవీన్ అరోరా నేతృత్వంలోని సిట్ బృందాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

09/07/2019 - 00:59

కీసర, సెప్టెంబర్ 6: డెంగ్యూ వ్యాధితో ఏడు నెలల గర్భిణి మృతిచెందిన సంఘటన అంకిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కే.లావణ్య(24)కు వైరల్ ఫీవర్ రావటంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎంతకూ తగ్గక పోవటంతో నగరంలోని యశోదా ఆసుపత్రిలో చేర్చారు. డెంగ్యూ వ్యాధి సోకిందని వైద్యులు తెలిపారు. శుక్రవారం లావణ్య తుదిశ్వాస విడిచారు.

09/07/2019 - 00:55

ఏలూరు, సెప్టెంబర్ 6: గల్ఫ్ దేశాల నుండి తిప్పి పంపేసిన వారి చేతి వేళ్లకు శస్తచ్రికిత్సలు చేయడం ద్వారా వేలిముద్రలు మార్చి, నకిలీ పాస్‌పోర్టులతో వారిని తిరిగి విదేశాలకు పంపిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు.

09/07/2019 - 00:54

విజయవాడ, సెప్టెంబర్ 6: రాష్ట్రంలోని 16 మంది సీనియర్ సివిల్ జడ్జిలను జిల్లా జడ్జీలు (ఎంట్రీ లెవెల్)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

09/07/2019 - 00:53

గుంటూరు, సెప్టెంబర్ 6: చదువుకునే వయస్సులో పిల్లలను పనికి పంపితే సంబంధిత తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలో రోజురోజుకూ బాలల అదృశ్య ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట వీధి బాలల గుర్తింపు కార్యక్రమాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

09/06/2019 - 23:56

అనంతపురం, సెప్టెంబర్ 6: ఎవరైనా వేధిస్తుంటే పిల్లలు తండ్రితో చెప్పుకుంటారు.. కానీ ఆ తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చిన్నారులు రెండేళ్లుగా నిత్యం నరకం చవిచూశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఒకరికి తెలియకుండా ఒకరిని బెదిరించి ముగ్గురు కూతుళ్లను లోబరుచుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ధైర్యం చేసిన వారు తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించారు.

Pages