S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/30/2018 - 00:06

మునగాల, నవంబర్ 29: ప్రమాదవ శాత్తు సాగర్ ఎడమ కాల్వలో మహిళ గల్లంతైన సంఘటన గురువారం మండల కేంద్రంలోని సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మేడం అంజయ్య తన భార్య అనిత (45), కుమారుడు నవీన్‌తోపాటు సమీప బంధువైన డ్రైవర్ కే.శ్రీ్ధర్‌తో కారులో విజయవాడకు బయలుదేరారు.

11/30/2018 - 00:04

పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 29: మండలంలోని అక్కంపల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తికి మూర్చ రావడంతో రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. బంధువులు, గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాలి ఉన్నాయి. మండలంలోని అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు కృష్ణయ్య (28) సోమవారం చేపలు పట్టేందుకు తెప్పపై రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. మధ్యలోకి వెళ్లాక మూర్చరావడంతో అందులో పడిపోయాడు.

11/30/2018 - 00:00

మల్యాల, నవంబర్ 29: భార్యపై అనుమానం పెనుభూతంగా మారి చిన్నతగువుతో పొట్లాడుతకొని భార్యగొంతు కోసి చంపి తాను ఆత్యహత్యకు పాల్పడ్డ సంఘటన మల్యాల మండలకేంద్రంలో సంచలనంగా మారింది. మల్యాల మండలకేంద్రానికి చెందిన కరబూజ శ్రీనివాస్ (37) గత రెండేండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లి నెల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నాడు.

11/29/2018 - 23:59

కరీంనగర్ (లీగల్), నవంబర్ 29: శాసనమండలి పట్ట్భద్రుల కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యిర్థిగా పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డిలపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

11/29/2018 - 23:43

మద్నూర్, నవంబర్ 29: మండలంలోని పెద్ద ఎక్లార గేటు సమీపంలో ఎస్‌ఎన్‌ఎ రహదారిపై, గురువారం నాడు ఆటోను బులేరో ట్రాలీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలైయ్యాయి. మద్నూర్ ఎస్‌ఐ సాజిద్ తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

11/29/2018 - 23:24

విజయనగరం, నవంబర్ 29: రెండు రోజుల క్రితం ఎస్‌కోట మండలం బొడ్డవర పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినిని మీ ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికి నవోదయ పాఠశాల సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లి మానభంగానికి ప్రయత్నించిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

11/29/2018 - 22:34

చిత్తూరు, నవంబర్ 29: విధుల్లో ఉన్న తోటి మహిళా కానిస్టేబుల్‌పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్‌కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ 5వేలు జరిమానా విధిస్తూ గురువారం జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి ప్రసాద్ తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

11/29/2018 - 22:28

బి.కోడూరు, నవంబర్ 29 : మండల పరిధిలోని పోరుమామిళ్ల-బద్వేల్ ప్రధాన రహదారిలో ఖాతానగరం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

11/29/2018 - 22:19

గూడూరు, నవంబర్ 29: పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవిస్తున్న ఒక యువకుడిని మరో యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్యచేసిన సంఘటన గూడూరు పట్టణంలో జరిగింది. గురువారం సాయంత్రం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని బార్ వద్ద నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన పలనాటి సాయి (27) తన భార్యతో కలిసి మద్యం సేవించడానికి వచ్చాడు.

11/29/2018 - 22:18

ఆత్మకూరు రూరల్, నవంబర్ 29 : ప్రమాదవశాత్తు ఆటో ఢీకొని రీహాన్ (4) అనే బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని అశ్వనిపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన షరీఫ్, సైదాబేగం దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండవ వాడైన రీహాన్ ఇంట్లో ఆడుకుంటూ రోడ్డుపైకి రావడంతో అటుగా వస్తున్న ఆటో వేగంగా ఢీకొట్టింది.

Pages