S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/16/2015 - 22:27

ఈమధ్య తెలుగులో ప్రత్యేక పాటలకు పెట్టింది పేరుగా మారింది అందాల భామ హంసానందిని. ఈమె చేస్తున్న పాటలు మంచి విజయం సాధిస్తుండడంతో ఇపుడు ఈమెతో ఐటెమ్ సాంగ్స్ చేయిస్తూ ఆ సినిమాలకు మరింత క్రేజ్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇటీవలే రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’లో ప్రత్యేక పాటలో నటించి మత్తెక్కించింది హంస.

12/16/2015 - 22:25

సునీల్-వీరుపోట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఈడు గోల్డెహె టైటిల్‌ని నిర్ణయంచారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ బుధవారం విడుదలైంది.

12/16/2015 - 21:00

పావని రావంత్, సాగర్ రావంత్, పావని జంటగా ధనుంజయ్ దర్శకత్వంలో కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై పళ్లా రమణయాదవ్ నిర్మిస్తున్న ‘నా హృదయం ఊగిసలాడే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు సాగర్ క్లాప్‌నివ్వగా, రమేష్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆర్.పి.పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

12/16/2015 - 20:57

వి.సినీస్టుడియో పతాకంపై ‘జబర్దస్త్’ ఫేమ్ రేష్మి కథానాయికగా ఓ చిత్రం ప్రారంభమైంది. దివాకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.

12/16/2015 - 20:56

ఈమధ్యే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాని లేటెస్టుగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రూపొందుతోంది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట.

12/16/2015 - 20:53

వరుణ్‌తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ భామ దిశాపాట్ని. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కల్యాణ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ దిశా పాట్ని చెప్పిన విశేషాలు...
తొలి అవకాశం

12/16/2015 - 20:51

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తొలిసారిగా వెంకటేష్, మారుతి కాంబినేషనల్‌లో సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలోబుధవారం జరిగింది. తొలి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేసారు. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

12/15/2015 - 21:11

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మిల్కీ బ్యూటీ

12/15/2015 - 21:09

సాయివెంకట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మారుతి ఫిలిం వర్క్స్ పతాకాలపై రాజేష్ పులి దర్శకత్వంలో సంపూర్ణేష్‌బాబు, చరణ్, రాజ్, రోహన్, హమీదా ప్రధాన తారాగణంగా బోనం కృష్ణసతీష్, అడగర్ల జగన్‌బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ రూపొందిస్తున్న చిత్రం ‘్భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో హీరో నిఖిల్ విడుదల చేశారు.

12/15/2015 - 21:06

పాటల రచయిత బండారు దానయ్య కవి దర్శక నిర్మాతగా కవి ఫిలింసిటీ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రతిభ వున్న సాంకేతిక నిపుణులను, నటీనటులను పరిశ్రమకు పరిచయం చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు.

Pages